Brahmamudi February 20th బావతో కావ్య రొమాన్స్... జెలసీగా ఫీలవుతూ మొఖం మాడ్చుకున్న రాజ్!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 20వ తేదీ ఎపిసోడ్ కూడా ఆసక్తిగా సాగింది. కావ్య వాళ్ల బావ రావడంతో రాజ్‌లో కొత్త టెన్షన్‌తో పాటు జెలస్ ఎక్కువ అవుతుంది. అలా ఈ ముగ్గురు మధ్య కవ్వించు చర్యలతో నేడు జరిగిన సంభాషణ మంచి ఇంట్రెస్టింగ్గా సాగింది.
అనామికకు అప్పు రివర్స్ వార్నింగ్ :కళ్యాణ్‌తో క్లోజ్‌గా ఉండొద్దంటూ అప్పుకు వార్నింగ్ ఇవ్వాలని అనుకున్న అనామికకు తన ప్లాన్ రివర్స్ అవుతుంది. అప్పునే తిరిగి.. కళ్యాణ్‌ను సొంతం చేసుకోవడం తనకు పెద్ద విషయం కాదని, తనను రెచ్చగొట్టి కాపురాన్ని నాశనం చేసుకోకని హెచ్చరిస్తుంది. కళ్యాణ్ చాలా మంచివాడని, అతడి మంచిగా చూసుకుంటూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమని చెబుతుంది. అంతే గానీ ఇలా రోడ్డెక్కి అల్లరి పాలు చేయడానికి ప్రయత్నిస్తే నువ్వే ఆఖరికి రోడెక్కాల్సి వస్తుందని అనామికకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో అప్పుకు సమాధానం ఇవ్వలేకు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక.

జెలస్‌గా ఫీలవుతూ:అప్పు అనామిక సీన్స్‌ను కట్ చేస్తే బావ కోసం ఎయిర్‌పోర్ట్ వెళ్లిన కావ్య ఎంతకీ ఆఫీస్‌కు తిరిగిరాకపోవడంతో రాజ్ తెగ ఆలోచిస్తుంటాడు.త తాను పడుతున్న కంగారును బయటకు పెట్టకుండా ప్రయత్నిస్తాడు. ఈలోగా ఆఫీస్ ముందు కార్ ఆగడం, కావ్యతో పాటు ఆమె బావ రావడం చూసి షాక్ అవుతాడు. ఆమె బావ స్టైలిష్‌గా కారులో నుంచి దిగడం చూసి రాజ్ కాస్త జెలస్‌గా ఫీల్ అవుతూ మొహం కూడా మాడ్చుకుంటాడు.

వెటకారంగా కావ్య బావ: ఇక తన బావను భర్త రాజ్‌కు పరిచయం చేస్తుంది కావ్య. అతడు రాజ్‌ను అన్నయ్యా అంటూ వెటకారంతో పిలవడం, హగ్ చేసుకోడానికి ముందుకు రావడం చేస్తాడు. దీంతో రాజ్ ఓ అడుగు వెనక్కి వేసి హగ్గులు, పెగ్గులు పడవు అంటూ కాస్త సీరియస్‌గా అంటాడు. దీంతో నేను రావడం నీకు ఇష్టం లేదా అన్నయ్య అంటూ రాజ్‌తో అంటాడు కావ్య బావ. ఆ తర్వాత బుజ్జి లాంటి బుట్టబొమ్మను పెళ్లిచేసుకునే ఛాన్స్ కొట్టేసిన నువ్వు లక్కీ అంటూ రాజ్‌పై ప్రశంసలు కూడా కురిపిస్తాడు.
రాజ్ చేసుకోకపోయి ఉంటే తాను వివాహమాడి అమెరికా తీసుకొని పోయేవాడిని అంటూ చమత్కరిస్తాడు. ఏం చేస్తాం బావ, రాసుకున్నవాళ్లకు రాసుకున్నంత అంటూ తన బావ మాటలను ఉద్దేశించి రాజ్‌ను ఏడిపిస్తుంది కావ్య. ఆమె మాటలతో రాజ్ మరింత సీరియస్ అవుతాడు. ఏయ్ ఏంటి ఇదంతా అంటూ కాస్త మండిపడతాడు.
వారం కాదు నెల రోజులు ఇండియాలోనే : కావ్య బావ మాటలను వినలేక మీరు ఎప్పుడు అమెరికా తిరిగి వెళ్లిపోతున్నారంటూ అడుగుతాడు రాజ్. అంటే నేను మీకు ఇండియా రావడం ఇష్టం లేదా, ఓ వారం రోజులు ఇండియాలో ఉండాలని వచ్చాను, కానీ కావ్యను చూసిన తర్వాత నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను అంటూ మరింత కవ్విస్తాడు కావ్య బావ. అనంతరం మన క్యాబిన్‌లోకి వెళ్లి చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుందాం బావ అంటూ తన క్యాబిన్‌లోకి తీసుకెళుతుంది కావ్య. అయితే ఇదంతా రాజ్‌కు కవ్వించడానికే చేస్తుంటుంది కావ్య.
క్యాబిన్లో కావ్య, ఆమె బావ ఏం మాట్లాడుకుంటున్నారో తెలీక రాజ్ కంగారుపడిపోతుంటాడు. కావ్య క్యాబిన్ ముందే అటూ ఇటు తిరుగుతుంటాడు. క్యాబిన్ గ్లాస్‌కు తన చెవి దగ్గరగా పెట్టి మరీ వారి మాటలను వినడానికి ప్రయత్నిస్తాడు. అంతలో శృతి చూస్తుంది. ఇదంతా కావ్యతో పాటు ఆమె బావ కూడా గమనిస్తారు. రాజ్‌ను మరింత ఏడిపించేందుకు ఒకరిపై మరొకరు కావాలనే దొంగ ప్రేమను కురిపించుకుంటుంటారు. ఈలోగా సడెన్‌గా కావ్య డోర్ తీస్తుంది. రాజ్ కింద పడిపోతాడు.వెంటనే అతడిని కావ్య పట్టుకుంటుంది.
శ్వేతకు విడాకులు : ఇక రాజ్ తిరిగి తన క్యాబిన్‌కు వెళ్లిపోతాడు. శ్వేతతో కలిసి ఈ విషయం గురించి చర్చిస్తాడు. అదే సమయంలో తన భర్త నుంచి శ్వేతకు విడాకులు రావడంతో సెలబ్రేషన్స్ చేస్తాడు రాజ్. కేక్ తెప్పిస్తాడు. కావ్యను కూడా పిలుస్తాడు. శ్వేతకు ఎప్పుడు విడాకులు వస్తాయాని తాను ఇన్నాళ్లు ఎదురుచూశానని, ఆ శుభ ఘడియలు వచ్చాయని రాజ్ అందరి ముందు కావాలనే అంటాడు.
అదేం శాడిజం అండి.. .ఫ్రెండ్‌కు విడాకులు రావాలని ఎవరైనా అనుకుంటారా అంటూ రాజ్‌తో అంటాడు కావ్య బావ. అది ఎందుకో నీకు మరదలకు బాగా తెలుసు అంటూ తెలివిగా రాజ్ బదులిస్తాడు. శ్వేత ఒంటరిగా ఉండిపోదని, ఒంటరిగా ఉండనివ్వనని రాజ్ అంటాడు. దీంతో కావ్య రాజ్‌పై మళ్లీ ఎటాక్ మొదలుపెడుతుంది. మనసులేని చోట కలిసి ఉండటం వల్ల లాభం లేదు. భార్య వద్దని అనుకున్న మొగుడితో కలిసి ఉండాల్సిన కర్మ లేదని చెప్పడం మొదలుపెడుతుంది. ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావంటే నీ మనసు ఎంతో గొప్పదని కావ్యపై ప్రశంసలు కురిపిస్తాడు ఆమె బావ.
ఆ తర్వాత కావ్య, ఆమె బావ రాజ్ దగ్గర నుంచి నాలుగు గంటలు పర్మిషన్ తీసుకుని ఇద్దరు బయటకు వెళ్లిపోతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.


Click it and Unblock the Notifications











