Brahmamudi February 22nd దుగ్గిరాల ఇంట్లో కావ్య బావ తిష్ట .. షాక్​లో రాజ్.. కథ అడ్డం తిరుగుతుందా?

ఇందిరాదేవి ఇచ్చిన సలహాతో కళావతి డ్రామా మొదలుపెడుతుంది. తనను వద్దనుకుంటున్న భర్తకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే మూర్తి చెల్లెలు కొడుకు అమెరికా నుంచి రావడాన్ని అవకాశంగా మార్చుకుంటుంది. తన బావతో కలిసి నాటకం ఆడుతుంది. ఇక అమెరికా నుంచి వచ్చిన బావను కలుసుకున్న కావ్య.. కావాలనే రాజ్ ముందు డ్రామా ప్లే చేస్తుంది. వీరు క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తుంది. అది చూసిన రాజ్ తట్టుకోలేకపోతుంటాడు.

రాజ్ జలస్ ఫీల్ అవ్వడాన్ని తన ఫ్రెండ్ శ్వేత గమనిస్తుంది. ఎందుకు రాజ్.. తనను ఎలాగూ వద్దు అనుకుంటున్నవ్ కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నవ్ అని అడుగుతుంది. అదేం లేదని రాజ్ అంటాడు. మరోవైపు కారులో కావ్య, ఆమె బావ షికారుకు వెళ్తారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పి విడాకులు తీసుకుంటాను అని రాజ్ ఇందిరాదేవి దగ్గరకు వెళ్తాడు. అక్కడ కళావతి చేసే పని గురించి చెప్తాడు. అసలు ఈ నాటకానికి మూలమే ఇందిరాదేవి.

February 22nd 2024 Episode number 339 in Brahmamudi Telugu Serial

ఆమె దగ్గరకు వచ్చి రాజ్ చెప్తే ఏం లాభం ఉంటుంది. ఇక నాటాకాన్ని రక్తి కట్టించేందుకు కళావతికి సపోర్టుగా మాట్లాడుతుంది ఇందిరాదేవి. తన బావను మన ఇంటికి తీసుకువచ్చిందని చెప్తుంది. ఇక ఇందిరాదేవి, కళావతిలతో పాటు.. కృష్ణ మూర్తి ఫ్యామిలీ కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ఈ డ్రామాతోనైనా రాజ్ తన మనసులోని ప్రేమను బయటపెడాతాడా లేదా అనేది చూడాలి. కావ్య మీద రాజ్ కు ప్రేమ ఉంది కానీ అది బయటకు రావడం లేదు. అందుకే వీరంతా కలిసి ఈ నాటాకాన్ని మొదలు పెట్టారు.

ఇక డైనింగ్ హాల్ లో కావ్య బావ భోజనం చేస్తూ ఉంటాడు. రాజ్ కోపంగా వస్తాడు. ఇక స్వప్న తన బావతో మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటున్నవ్ బావ అంటూ అడుగుతుంది. ప్రస్తుతానికి హౌటల్ లో ఉంటున్నానని చెబుతాడు. అయితే హోటల్ లో ఉండటం దేనికి మా కావ్య బంధువు అంటే మా బంధువే అంటూ ఇందిరాదేవి అంటుంది. మా ఇంట్లోనే ఉండమని సలహా ఇస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక దుగ్గిరాల ఇంట్లోనే కావ్య బావ ఉండనున్నారని తెలుస్తోంది.

February 22nd 2024 Episode number 339 in Brahmamudi Telugu Serial

కావ్య, తన బావ ఇంట్లోనే ఉంటే.. రాజ్ జలస్ మరింత ఎక్కువ అవుతుంది. మరి అప్పుడైనా ప్రేమ బయటకు వస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు రుద్రాణి వీరి బంధంపై మచ్చవేసే ప్రమాదం ఉంది. సీరియల్లో మరింత ట్విస్టులు చోటుచేసుకోబుతున్నాయని తెలుస్తోంది. ఇక రుద్రాణి వేసిన మచ్చను మరి ఇందిరాదేవి ఎలా తొలగిస్తుంది.. రాజ్ తన ప్రేమను ఎలా బయటపెట్టనున్నారు అనేది రాబోయే ఎపిసోడ్ లో చూడవచ్చు.

మరోవైపు అనామిక.. ఇంట్లో పెత్తనం కోసం వేసే ప్లాన్స్, దానికి రుద్రాణి సలహాలు ఇవన్నీ ఆసక్తి కలిగించేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక అప్ప తను ప్రేమించిన కల్యాణ్ ను మరిచిపోయి.. పోలీస్ అయ్యేందుకు కసరత్తులు చేస్తుంది. అప్పు పోలీస్ గా మారితే.. రానున్నా ఎపిసోడ్స్ మరింత ఆసక్తిగా ఉండున్నాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X