Brahmamudi February 26th రాజ్‌ను ఇరికించిన భాస్కర్.. కల్యాణ్ బాగోతం తెలుసుకున్న అనామిక!

కావ్య తన బావతో కలిసి బయటకు వెళ్లడంతో రాజ్‌, శ్వేతతో కలిసి అక్కడికి వెళ్తారు. వాళ్లు కేఫ్‌కు వెళ్లగానే రాజ్‌ కూడా కేఫ్‌కు దొంగచాటుగా వెళ్లి వాళ్లకు కనిపించకుండా చూస్తుంటాడు. ఇంతలో కావ్య ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు బావ అని అడగ్గానే సర్‌ ఫ్రైజ్‌ అంటాడు భాస్కర్. దీంతో ఇరిటేటింగ్‌ గా ఫీలయిన రాజ్‌ చూశావా ఆ బావగాడు నా నుంచి కావ్యను దూరం చేయడానికే వచ్చినట్లున్నాడు అంటాడు. ఇప్పుడు కావ్య అతని ప్రపోజల్‌ను యాక్సెప్ట్‌ చేస్తే నువ్వేం చేస్తావని శ్వేత అడుగుతుంది.

నా భార్యకు లవ్ ప్రపోజ్‌ చేయడం ఏంటి: నేనింకా డివోర్స్‌ ఇవ్వలేదని రాజ్ అంటాడు. కానీ జీవితంలోంచి తప్పుకోమని చెప్పేశావు కదా అని శ్వేత అంటుంది. ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మేము లీగల్‌గా విడిపోవాలి కదా అని రాజ్ అంటాడు. ఏమో ఇప్పుడు ఓకే చెప్పి విడిపోయాక పెళ్లి చేసుకుంటుందేమో అని శ్వేత అనగా.. ఏయ్‌ నేను ఒప్పుకోను నువ్వు నన్ను కన్ఫీజ్‌ చేయకు శ్వేత. వాడు నా భార్యకు లవ్ ప్రపోజ్‌ చేయడం ఏంటి నాన్సెస్‌ కాకపోతేనూ అలా జరగనివ్వనని రాజ్ అంటాడు.

February 26th 2024 Episode number 342 in Brahmamudi Telugu Serial

కావ్యకు అందరిముందు రాజ్ ప్రపోజ్: ఇక రాజ్‌ ఇరిటేట్‌గా ఫీలవుతుంటే ఇంతలో ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. వాళ్లను చూసిన రాజ్‌ భయంగా వెళ్లి కావ్య పక్కన నిలబడతాడు. రాజ్‌, కావ్యను చూసిన ఇందిరాదేవి సీతారామాయ్య ఆశ్చర్యపోతారు. కావ్యకు లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి ఇక్కడికి వచ్చావా? అంటూ అడుగుతారు. అవునని రాజ్‌ చెప్పగానే మీడియా వాళ్లు కూడా వస్తారు. తర్వాత రాజ్‌, కావ్య ఒకరికొకరు విషెష్‌ చెప్పుకుని కేక్‌ కట్‌ చేస్తారు.

February 26th 2024 Episode number 342 in Brahmamudi Telugu Serial

కావ్యతో రాజ్ షికారు: ఇది ప్రేమంటే.. చూపించుకునే ప్రేమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే బేధమే ఉండకూడదని ఇందిరాదేవి అంటుంది. ఒకసారి తాళి కట్టాక ఆ పెళ్లికి పంచభూతాలు సాక్ష్యాలు అవుతాయని చెప్తుంది. మన ముక్కోటి దేవతలు సపరివారమవుతారు. మనుషులు కోరుకుంటే పెళ్లి జరగదు. ఎవరికి ఎవరం అనేది మనం పుట్టకముందే నిర్ణయం అయిపోతుందని వివరిస్తుంది. ఇందిరాదేవి మంచి మాటలు చెప్పి ఇక మీరు వెళితే మా ప్రేమను మేము పంచుకుంటాం అనగానే రాజ్‌, కావ్యను ఇక్కడే ఉంచితే బాగుండదు అనుకుని కావ్యను తీసుకుని వెళ్లిపోతాడు.

కావ్య డ్రామా: ఇందిరాదేవి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు కారులో వెళ్తున్న రాజ్‌, కావ్య మళ్లీ గొడవ పడతారు. అసలు ఆ బావగాడు కేక్‌ బొకే ఎందుకు తెప్పించాడని రాజ్ అడుగుతాడు. నీకు ప్రపోజ్‌ చేయడానికా? ఏయ్‌ ఎంటి జవాబు లేదు. జవాబు చెప్పకుండా అటొకరు ఇటొకరు పిండేసినట్లు అలా మెలికలు తిరిగిపోతున్నావేంటే? అంటాడు రాజ్. అంటే మీరన్నాక గుర్తొచ్చిందని కావ్య అంటుంది. మా బావ నాకోసం కేక్‌ తెప్పించాడా? అంటే నాకు లవ్‌ ప్రపోజ్‌ చేసేవాడా? ఎంత పని చేశారండని కావ్య డ్రామా మొదలు పెడుతుంది.

February 26th 2024 Episode number 342 in Brahmamudi Telugu Serial

అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి: మీరు ఎలాగూ ప్రేమించరు. ప్రేమించే వాళ్లను చెడగొడతారని కావ్య అంటుంది. ఇక ఇద్దరూ గొడవ పడతారు. మరోవైపు రుద్రాణి అనామిక దగ్గరకు వెళ్లి అనామిక నీలో నువ్వే నవ్వుకుంటున్నావని అడుగుతుంది. ఫ్రెండ్‌ జోక్‌ పంపిస్తే నవ్వుతున్నాను ఆంటీ అని అనామిక అంటుంది. జోక్‌తో నవ్వొస్తే పర్వాలేదు కానీ మనల్ని చూసి ఎవరైనా నవ్వుతేనే ప్రాబ్లమ్‌ అని చెప్తుంది. మనల్ని చూసి నవ్వేదెవరు ఆంటీ? అని అనామిక అనగా.. ఇప్పుడెవ్వరూ లేరు కానీ నువ్వేం పట్టనట్టు కూర్చుని ఉంటే ఈ ఇంట్లో అందరూ చూసి నవ్వుతారని రుద్రాణి అంటుంది.

ఆఫీసుకు అనామిక: అనామికకు రుద్రాణి కట్టుకథలు చెప్తుంది. కళ్యాణ్‌ను ఆఫీసుకు పంపించడమే కాదు. అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్తుంది. నువ్వు వెంటనే ఆఫీసుకు వెళ్లి నీ మొగుడు ఏం చేస్తున్నాడో వెళ్లి చూడని అనామికను రెచ్చగొడుతుంది. అనామిక లంచ్‌ తీసుకుని ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంది. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్య గొడవపడతారు. కావ్య వేసిన డిజైన్స్‌ బాగాలేవని వెటకారంగా తిడతాడు. మా బావ వచ్చినప్పటి నుంచి మీకు ఎక్కడో మండిపోతుంది అందుకే నేను ఎక్కడ దొరుకుతానోనని ఎదురుచూస్తున్నారు. అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

February 26th 2024 Episode number 342 in Brahmamudi Telugu Serial

అనామిక రచ్చ రచ్చ: తదుపరి ఎపిసోడ్ లో అనామిక పంచాయితీ పెడుతుంది. అసలు నీ బాధకు కారణం ఏంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నీ కొడుకు అని అనామిక అంటుంది. దానికి ఇందిరాదేవి నా మనవడు ఏం చేశాడు అని అడుగుతుంది. మీ మనవడు ఆఫీసుకు పోయి కవి సమ్మేళనం పెట్టాడు అని వెటకారంగా అంటుంది. కవిత్వం రాసుకుంటూ కూర్చున్నాడు. ఇక కావ్య మాట్లాడుతూ కవిగారు ఏం తప్పురాశారు. ఆయన కవిత్వం రాసుకుంటాడని తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావ్.కవులను, కళాకారులను ఎప్పటికి గౌరవించాలి కానీ ఇలా అవమాన పరచకూడదని చెప్తుంది. ఆపు అని సీరియస్ గా అనామిక అంటుంది. నాభర్తను మొత్తం చెడగొట్టింది నువ్వే అని అంటుంది. నా భర్తను అసమార్థుడిని చేసి నీ భర్తను మహారాజులా చూడాలనుకుంటున్నవ్ అని అంటుంది అనామిక. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X