Brahmamudi February 27th ఆఫీసులో కల్యాణ్ పరువు తీసిన అనామిక.. మరదలిపై రాజ్ ఫైర్
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య వేసిన డిజైన్స్ బాగాలేవని రాజ్ వంకలు పెడుతుంటాడు. మా బావ వచ్చినప్పటి నుంచి మీకు ఎక్కడో మండిపోతుంది.. అందుకే నేను ఎక్కడ దొరుకుతానోనని ఎదురుచూస్తున్నారంటూ కావ్య రాజ్ మీద అరుస్తుంది. ఇలాగైతే ఇప్పుడే నిన్ను జాబ్‌లోంచి తీసేస్తానని రాజ్ బెదిరిస్తాడు. అయితే ఒకసారి మీరు అగ్రిమెంట్ చదివి ఆ మాట అనండి అని కావ్య అంటుంది. దీంతో రాజ్ అయ్యో మా డాడీ అంటాడు.
కావ్య, రాజ్ ప్రపోజ్ వీడియో చూసి: త్వరలోనే నేనే ఆఫీసులోంచి వెళ్లిపోతానని కావ్య అనగానే ఆ పని చేయ్ దరిద్రం పోతుందని రాజ్ అంటాడు. మీరు చెబితే ఎలా వెళ్తాను మా బావను అడుగుతానని కావ్య అంటుంది. మా బావ ఓకే అంటే వెళ్లిపోతాను అనగానే ఇప్పుడు బావ గురించి ఎందుకు అంటూ రాజ్ ఇరిటేటింగ్ ఫీలవుతాడు. మరోవైపు సుభాష్, ప్రకాష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రాజ్, కావ్యల ప్రపోజ్ వీడియో చూస్తారు. ఆ వీడియోలో వాళ్ల అమ్మా నాన్న ఉండటం చూసి షాక్ అవుతారు.

రుద్రాణికి సుభాష్ ప్రపోజ్: ముసలొల్లు కూడా ప్రపోజ్ చేసుకున్నారు. ఈ వీడియో మీ వదిన చూసిందంటే బాగోదని ప్రకాష్ కు సుభాష్ చెప్తాడు. ఇక సుభాష్ కూడా మా ఆవిడ ఇది చూస్తే మంటపెడుతుందని అని సెటైర్స్ వేస్తాడు. ఇక సుభాష్.. అపర్ణకు ప్రపోజ్ చేయడానికి లోపలికి వెళ్లి అపర్ణకు ప్రపోజ్ చేస్తాడు. ప్రకాష్ కూడా ధాన్యలక్ష్మీకి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా గమనిస్తున్న రుద్రాణి నాకు ప్రపోజ్ చేయడానికి ఎవ్వడూ లేడు అని మనసులో అనుకుంటుంది.

ధాన్యలక్ష్మికి ప్రకాష్ ప్రపోజ్: మా మతిమరుపు అన్నయ్యా లోపలికి పిలిచి ప్రపోజ్ చేశాడా? లేదంటే ఎందుకు పిలిచాడో మర్చిపోయాడా? అని రుద్రాణి.. ధాన్యలక్ష్మిని అడుగుతుంది. నాకు కనీసం ఏం చెప్పాలో మర్చిపోయే మొగుడైనా ఉన్నాడు. నీకసలు మొగుడే లేడు కదా? అని పంచ్ వేసి వెళ్లిపోతుంద ధాన్యలక్ష్మి. చీచీ పేడతట్టని తెలిసి రాయి వేశాను. ఎంత మాట అనేసిందని మనసులో అనుకుంటుంది రుద్రాణి. రాజ్ ఆఫీసులో డిజైన్స్ చూస్తుంటాడు. ఎన్ని డిజైన్స్ చూసినా కళావతి వేసిన డిజైన్స్ బాగున్నాయి. ఇగోకు పోయి నా కంపెనీకి నేనే అన్యాయం చేస్తున్నానా? అనుకుంటాడు.

కావ్య మీద రాజ్ ఫైర్: ఇంతలో కావ్య వస్తుంది. ఇదిగో డిజైన్స్ అంటే ఇలా ఉండాలి. నీ డిజైన్స్ చూస్తే నా కంపెనీ గురించి తప్పుగా అనుకుంటారని రాజ్ అంటాడు. నీలాంటి పనికిరాని వాళ్లను పెట్టుకున్నందుకు పనికిరాని మాటలన్నీ పడాల్సిందే కదా? అని రాజ్ అంటుంటాడు. మేడం చెప్పారా? సార్‌కు అని శృతి అంటుంది. సార్ చెప్పనిస్తేనే కదా? అని కావ్య అనగా.. ఏంటి మీరు చెప్పేది.. నేను వినేదని రాజ్ అంటాడు. క్లయింట్స్ వచ్చారు సార్ మీతో మాట్లాడతారట అని శృతి అంటుంది. వాళ్లను లోపలికి రమ్మని చెప్పు అని శృతికి చెప్తాడు రాజ్.
కావ్య డిజైన్స్ సూపర్: లోపలికి వచ్చిన క్లయింట్ కావ్య వేసిన డిజైన్స్ చాలా బాగా నచ్చాయని అవే మేకింగ్‌కు పంపించమని చెప్తాడు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ రూంలో కూర్చుని మ్యూజిక్ వింటుంటాడు. స్వప్న వచ్చి ఇవాళ వాలెంటెన్స్ డే సంవత్సరం క్రితం హోటల్ లో గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేశావు. అంటే రాహుల్ కోప్పడతాడు. నీవు లవ్ చేస్తున్నానని నటించావు. కానీ నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. అంటూ గిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోతుంది.
కల్యాణ్ కవితలు.. అనామిక రచ్చ: మరోవైపు కళ్యాణ్ స్టాఫ్ అందరినీ పిలిచి కవితలు రాస్తుంటాడు. ఇంతలో అనామిక లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసుకు వస్తుంది. కళ్యాణ్ ఆఫీసు పని చూసుకోకుండా కవితలు రాస్తుండటాన్ని చూసి షాక్ అవుతుంది. ఇంట్లో నాకు అబద్దం చెప్పి ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఇదా? ఇంత మోసమా? కట్టుకున్న భార్యని ఇంత దారుణంగా మోసం చేస్తున్నావా? అని అనామిక రచ్చ చేస్తుంది. ఇక్కడ అందరూ ఉన్నారు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామా? అని కల్యాణ్ అంటాడు.

చీట్ చేసావని అనామిక పంచాయితీ: నన్ను ఇంత చీట్ చేస్తావా? ఇంక నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు. ఈ గాలిలో కలిసిపోయే రాతలతో నా తలరాత మారుతుందనుకున్నానని అనామిక అంటుంది. అనామిక కళ్యాణ్‌ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే రాజ్ కోపంగా అనామికను తిడతాడు. దీంతో అనామిక కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో అనామిక కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటే... అనామిక ఎంటి అలా ఉన్నావని ధాన్యలక్ష్మీ అడుగుతుంది.
కావ్య మీద నిందలు: ఎలా ఉన్నాను అత్తయ్యా అని అనామిక అడుగుతుంది. ఎవరైనా ఏమైనా అన్నారా? అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. చెప్తాను. అన్నీ చెప్తాను. అందరికీ చెప్తాను. అందరినీ బయటకు రమ్మని చెప్పాను. అందరి ముందే చెప్తానని అనామిక అంటుంది. అనగానే అందరూ హాల్ లోకి వస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. తదుపరి ఎపిసోడ్ లో అనామిక రచ్చ చేస్తుంది. కల్యాణ్ కవితలు రాస్తున్నారని.. అరుస్తుంది. సపోర్టుగా కావ్య మాట్లాడితే నీ వల్లే ఇలా తయారయ్యాడని నిందలు వేస్తుంది. ఇంట్లోని వారంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











