Brahmamudi February 28th అసలు రంగు బయటపెట్టిన అనామిక.. పుట్టింటికి కావ్య- టెన్షన్‌లో రాజ్!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో ఇంట్లో అనామిక కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. ఎలా ఉన్నాను అత్తయ్యా అంటూ సీరియస్ గా చూస్తుంది అనామిక. ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. అనామిక కోపంగా చూస్తూ.. చెప్తాను. అన్నీ చెప్తానని అంటుంది. అందరినీ బయటకు రమ్మని చెప్పాను. అందరి ముందే చెప్తాను.. అనగానే అందరూ హాల్ లోకి వస్తారు.
కవి పుంగవా వచ్చావా అంటూ...:ఏంటి అనామిక అందరినీ రమ్మన్నావని రుద్రాణి అడుగుతుంది. వచ్చావా కవి పుంగవా? ఇవాళ ఏం జరిగిందో అసలు రోజూ ఏం జరుగుతుందో ఇందులో సూత్రధారి ఎవరో పాత్రధారి ఎవరో కపటధారి ఎవరో అన్నీ ఇవాళ బయటపడి తీరాల్సిందే అని అనామిక అంటుంది. చాలు ఆపు అనామిక అని రుద్రాణి అరుస్తుంది. అడవిలో అడుగు ఎత్తలేని కుందేలు నిలువెత్తు ఏనుగుల్ని, సింహాల్ని నిలబెట్టి పంచాయతీ పెట్టినట్లు ఉంది. ఇన్ని పద ప్రయోగాలు నీకెందుకమ్మా? నీకష్టమేంటో ఊరికే చెప్పుకో అతే కానీ ఈ అరుపులు, విరుపులు ఇక్కడ కుదరవని చెప్తుంది.

అందరి ముందు కళ్యాణ్‌ను తిట్టి...:నాకు తెలుసు ఈ ఇంట్లో నాకే స్వాతంత్రం లేదని అనామిక అంటుంది. నోరెత్తేవాళ్లకి ప్రశ్నించేవాళ్లకు మాట్లాడే అవకాశమే ఇవ్వరు. కనీసం మోసం జరిగినప్పుడైనా, అన్యాయం జరిగినప్పుడైనా నిలదేసే హక్కు లేదని అంటూ అనామిక వెళ్లిపోతుంటే ధాన్యలక్ష్మీ ఆపి ఇంతకీ ఏం జరిగింది చెప్పు అనగానే నీ సమస్య ఏంటని అడగ్గానే నా సమస్య మీ కొడుకే అంటూ కళ్యాణ్ గురించి చెప్తుంది. ఆఫీసుకు వెళ్లి కూడా కవిసమ్మేళనం పెట్టాడని అంటూ బాధపడుతుంది. దీంతో అనామిక ఆఫీసులో కూడా కళ్యాణ్‌ను అందరి ముందు తిట్టివచ్చిందని అందరూ తిడతారు.
కావ్య మీద అనామిక ఫైర్...:కావ్య కళ్యాణ్ గురించి మంచిగా మాట్లాడుతుంది. కవులను, కళాకారులను అవమానపరచకూడదని చెప్తుంటే.. ఆపు నా భర్తను మొత్తం చెడగొట్టింది నువ్వే. నా భర్తను అసమర్థుడిలా తయారు చేశావు. కళ్యాణ్‌ను ఎందుకు పనికిరానివాడిలా చేయాలనుకుంటున్నారని అనామిక అంటుంది. దీంతో స్టాపిట్ అనామిక అని కల్యాణ్ అరుస్తాడు. ఇంతసేపు చాలా మాట్లాడావు. ఆఫీసులో చాలానే మాట్లాడి వచ్చావు. ఎందుకంటే నాకు నీ మీద ప్రేమ అలాగే ఉంది కాబట్టి అని చెప్తాడు.
అనామిక మీద కళ్యాణ్ ఫైర్:ఏం అర్హత ఉందని పెద్దల ముందు అరుస్తున్నావని కల్యాణ్ ఫైర్ అవుతాడు. అసలు ఎంతసేపు నీ గురించే కానీ నా గురించి తెలుసుకున్నావా? నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఆఫీసుకు వెళ్లాను. ఇప్పుడు చెప్తున్నాను విను అనామిక నేను నీకోసం, నీ ఆశల కోసం ఏమీ చేయలేను. నేను నా దారిలోనే వెళ్తానని కల్యాణ్ తెగేసి చెప్తాడు. కళ్యాణ్ చెప్పగానే అనామిక పైకి వెళ్లి కళ్యాణ్ రాసిన కవితలు కిందకు విసిరేస్తుంది. ఈ పనికిమాలిన రాతలు చూస్తూ ఎప్పుడూ బతకాలా? నీ అభిరుచి కోసం నేను ఎప్పుడూ ఇలాగే బతకాలా? అంటూ నిలదీస్తుంది.

మూర్ఖులకు కవిత్వం గురించి ఎంత చెప్పినా...:ఇంతలో కావ్య అనామికకు కవిత్వం గురించి చెప్పబోతుంటే కళ్యాణ్ కావ్యను ఆపి మూర్ఖులకు కవిత్వం గురించి ఎంత చెప్పినా వ్యర్థం అనగానే ఇంక ఆపు అనామిక నువ్వు కళ్యాణ్ రాసే కవితలను చూసి పెళ్లి చేసుకున్నావా లేక వాడి వెనక ఉన్న ఆస్థిని చూసి పెళ్లి చేసుకున్నావా? అని ఇందిరాదేవి అడుగుతుంది. ఆస్థిని చూసే అయితే పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్థి ఉందని చెప్తుంది. అనామిక వెళ్లిపోతుంటే... ఆగు అనామిక నేను నీ కోసం బతకను నాకు నచ్చినట్టుగానే బతుకుతానని కల్యాణ్ అంటాడు. ఇది నువ్వు జీర్ణం చేసుకోగలిగితేనే ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇక వెళ్లు అని చెప్తాడు.
కళ్యాణ్ రాసిన కవితను అనామికకు..:ఇక కల్యాణ్ అనగానే అనామిక వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్ కూడా రూంలోకి వెళ్లి అనామిక మీద రాసిన కవితను నీకు చదివే అర్హత కూడా లేదని పేపరు మడచి దూరంగా విసిరివేస్తాడు. ఆ పేపరు కావ్య తీసుకుని చదువుతుంది. ఇంతలో అనామిక కూడా కోపంగా గార్డెన్ లోకి వెళ్లిపోవడం కావ్య చూసి. కావ్య కూడా గార్డెన్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్‌ను బాధపెట్టొద్దని కావ్య చెప్పి కళ్యాణ్ రాసిన కవితను అనామికకు ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
తదుపరి ఎపిసోడులో.... మా అమ్మ పుట్టింటికి వచ్చి ఓ వారం రోజులు ఉండమని చెప్తుందని కావ్య.. రాజ్ తో చెప్తుంది. నువ్వు వెళ్లాలి అనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. అవును అండి అని కావ్య అంటుంది. ఇంత శుభవార్త ఇంత లేట్ గానా చెప్పడం.. వెంటనే బయలుదేరి వెళ్లిపో అని రాజ్ అంటాడు. కావ్య పదా అని ఆమె బావ అంటాడు. మీరిద్దరు వెళ్తున్నారా అని అడిగితే అవును అన్నయ్య అని అంటాడు. దీంతో ఇద్దరు వెళుతున్నాడని తెలిసి రాజ్ కంగారు పడతాడు. వారి వెంట తాను వెళ్లాలని అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











