Brahmamudi February 29th కల్యాణ్‍కు కొత్త ఆఫీస్ బాధ్యతలు.. అనామికపై స్వప్న ఫైర్ - పుట్టింటికి కావ్య!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో అనామిక గార్డెన్‌ లోకి వెళ్లిపోవడం కావ్య చూసి... కావ్య కూడా గార్డెన్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్‌ను బాధపెట్టొద్దని కళ్యాణ్‌ రాసిన కవితను అనామికకు ఇస్తుంది. అతనికి వ్యాపారం అంటే పడదని, భర్త ప్రేమ అందరికీ దొరకదని కావ్య చెబుతుంది. ఇది కవిత అనుకుంటావో, లవ్ లెటర్ అనుకుంటావో నాకు తెలీదు. కానీ భార్యాభర్తల బంధం ఇలా లెటర్స్‌లో కాదు. నమ్మకంలో ఉండాలి అని కావ్య చెప్పుకువస్తుంది. మా ఆయన ఇలా పిచ్చి రాతలు రాసుకుంటూ కూర్చుంటే నువ్వు నీ భర్త అందలం ఎక్కాలని చూస్తున్నారా? అని అనామిక అంటుంది.

అనామికను మెంటలన్న స్వప్న..:ఇక వీరి మాటలు విన్న స్వప్న వెంటనే కోపంగా ఏ మెంటల్ అని దగ్గరకు వస్తుంది. నిన్ను కాదమ్మా.. నా చెల్లిని అంటున్నా. ఏమే కావ్య నీకు బుద్ధిందా.. ఇలాంటి మూర్ఖులకు ఎందుకే సూక్తులు చెబుతున్నావ్.. గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని కవితలు, ప్రేమ గురించి దీనికి ఎందుకే చెబుతున్నావ్. దీని వంకర బుద్ధి ఇంకా అర్థం కాలేదా. తన భర్తను ఆఫీస్‌లో అందలం ఎక్కించి ఇక్కడ ఇంట్లో తను మహారాణిలా చక్రం తిప్పుదామని అనుకుంటుందే అని బాగానే అంటుంది స్వప్న.

February 29th 2024 Episode number 345 in Brahmamudi Telugu Serial

అనామికకు స్వప్న వార్నింగ్:ఏం మాట్లాడుతున్నావు స్వప్నా అనామిక అంటుంది. చూశావా నన్ను పేరు పెట్టి పిలుస్తుందని స్వప్న అంటుంది. దీనికి ఎంత పొగరు. ఇలాంటి దానికి నీతులు చెబుతావేంటో బుద్ధి లేని దానా. నిన్ను కాదమ్మా నా చెల్లిని అంటూ స్వప్న తిడుతుంటే.. కావ్య స్వప్నను లోపలకి తీసుకెళ్తుంది. అనామిక కోపంతో రగిలిపోతుంది. మరోవైపు అందరూ భోజనం చేస్తుంటారు. కల్యాణ్, అనామిక రారు. కల్యాణ్ రాలేదా అని రాజ్ అడిగితే.. అవమానం జరిగాక ఎలా వస్తాడు అని రుద్రాణి అంటుంది.

ఇప్పటివరకు చూసుకుంది రాజే..:ఇంతలో రాజ్ లేచి వెళ్లిపోతుంటే.. నేను కవిగారిని తీసుకొస్తాను. మీరు కూర్చోండి అని కావ్య కల్యాణ్‌ను తీసుకురావడానికి వెళ్తుంది. ఈ ప్రేమ తమ్ముడి జీవితంలో కూడా చూపిస్తే బాగుండేది రాజ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఏ.. ఆపు.. కల్యాణ్‌ను మనం కన్నాం అంతే. వాన్ని చూసుకుంది రాజే. కల్యాణ్ చేసింది నీకు ఇప్పుడే తప్పుగా అనిపించిదా. ఇంతకుముందు లేదా. నీకు ఎవరు ఏం చెబుతున్నారో ఏమో నాకు అర్థం కావటం లేదని ప్రకాశం అంటాడు.

కల్యాణ్ ను రాజ్, కావ్య చూసుకుంటారు..:ఏంటీ అన్నయ్య నన్ను చూస్తూ అంటున్నావ్. నీ భార్య ఏం చిన్నపిల్ల కాదు. చెబితే నమ్మేయడానికి అని రుద్రాణి అంటుంది. మీరు ఎలాంటి వారినైనా మార్చేస్తారని అంకుల్ అంటున్నారని స్వప్న అంటుంది. అనగానే తన భర్త పై స్థాయిలో ఉండాలని అనామిక కోరుకోవడంలో కూడా తప్పులేదు అని ధాన్యలక్ష్మీ అనగానే.. వాడిని నేను మారుస్తాను అని రాజ్ అంటాడు. విన్నావుగా ధాన్యలక్ష్మీ ఇక మనస్ఫూర్తిగా తిను.. నీ కొడుకును రాజ్, కావ్య చూసుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది.

సారీ చెప్పిన కల్యాణ్...:మరోవైపు కల్యాణ్‍కు కావ్య నచ్చజెబుతుంది. పేరు తెచ్చుకోవడం అంటే వ్యాపారం చేసే కాదు. కవితలు రాసి కూడా పేరు తెచ్చుకోవచ్చు. మీ లోని కవిని ప్రపంచానికి చాటిచెప్పండి అని కల్యాణ్‌ను భోజనానికి తీసుకొస్తుంది కావ్య. తర్వాత తన ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదని అనామిక బాధపడుతుంది. నేను నువ్వు చెప్పావని ఆఫీస్‌కు వెళ్లాను అంతేనని కల్యాణ్ అంటాడు. నాకు నచ్చి కాదు. అర్థం చేసుకో. కానీ, నావల్ల బాధపడ్డావ్ కాబట్టి సారీ అని చెప్తాడు.

February 29th 2024 Episode number 345 in Brahmamudi Telugu Serial

నీ అంతట నువ్వే వచ్చేవరకు...:చేసిందంతా చేసి ఇలా నాలుగు గోడల మధ్య సారీ చెబితే అయిపోతుందా అని అనామిక అంటుంది. నా పక్క పంచుకుందామనే కదా ఇలా చేస్తున్నావ్ అని అనామిక అనగానే కళ్యాణ్‌ కోపంతో అనామికపై చేయి ఎత్తుతాడు. ఇంతలా నేను దిగజారుతాననుకున్నావా. ఇప్పటివరకు నీపై నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు నీపై అసహ్యం వేస్తుంది. నీ అంతట నువ్ నచ్చి వచ్చేవరకు నీ నీడను కూడా తాకను అని కళ్యాణ్‌ వెళ్లిపోతాడు.

కల్యాణ్ కు కొత్త బ్రాంచ్ :తర్వాత కళ్యాణ్‌ను రాజ్‌ పిలిచి అగ్రిమెంట్‌ పేపర్స్‌ ఇచ్చి ఖైరతాబాద్ బ్రాంచ్ పేపర్స్. ఇక నుంచి ఆ బ్రాంచ్ నువ్వే చూసుకోవాలని చెప్పగానే ధాన్యలక్ష్మీ, అనామిక హ్యాపీగా ఫీలవుతారు. కల్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇంతేనా అన్నయ్య అర్థం చేసుకుంది అని కల్యాణ్ అంటే.. మీ మనసుకు నచ్చిన పని చేస్తూనే ఈ పని కూడా చేయండి అని కావ్య అంటుంది. నా వల్ల కాదు వదినా అని కల్యాణ్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

తదుపరి ఎపిసోడ్ లో... :కావ్య పుట్టింటికి వెళ్తా అంటే వెళ్లమని చెప్తాడు. దీంతో పదా వెళ్దామని కావ్య, ఆమె బావ మాట్లాడుకుంటారు. ఇద్దరు వెళ్తారా అని అడిగితే అవును అండి అని చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. నేను కూడా వెళ్లాలి అని రాజ్ అనుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X