Brahmamudi February 2nd మళ్లీ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసేందుకు అనామిక ప్లాన్.. కావ్యను మార్చేసిన స్వప్న
నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ (ఫిబ్రవరి 2వ తేదీ)న రాజ్, కావ్య మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. కావ్యను రాజ్ వద్దు అనుకుంటాడు. ఎందుకు వద్దు కారణాలు చెప్పండని కావ్య అడగ్గా.. ఒకటి కాదు వంద కారణాలు ఉన్నాయని రాజ్ అంటాడు. రాసి చూపిస్తాను అంటూ బోర్డ్ దగ్గరకు వెళ్తాడు. అయితే రాసి చూపించండి అంటూ కావ్య కూడా వెళ్తుంది. దీంతో ఏం రాయాలో రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. చూశావా వంద కారణాలని చెప్పావు ఒకటోది రాయడానికే ఆలోచిస్తున్నావని కావ్య అంటుంది.
దీంతో ఇదే మొదటి కారణం అంటూ ప్రతి విషయంలో నాతో అడ్డగోలుగా వాదిస్తావని రాస్తాడు. ఇక రెండోది కూడా నీదే పైచేయిలా ఉంటావు అని రాస్తాడు. మొదటిది రెండోది రెండు ఒక్కటే అని చెప్తుంది కావ్య ఇక మూడోవది అప్పలమ్మలా రెడీ అవుతావు నీ మాటలతో ఎదుటి మనిషికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తావు అంటూ ఇంతకన్నా ఎక్కువ అడగొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు.

మరోవైపు హాల్లో దుగ్గిరా కుటుంబం మొత్తం కూర్చొని ఉంటుంది. అయితే అపర్ణ మాట్లాడుతూ.. కావ్య ఆఫీసుకు వస్తుంది కదండి ఎలా వర్క్ చేస్తుందంటారని సుభాష్ ను అడుగుతుంది. దానికి అబ్బా ఏం అడుగుతావులే వదిన సూపరో సూపరు అంటూ ప్రకాశం చెప్తాడు. దీంతో మిమ్మల్నేం ఏమీ అడగలేదు లేండి అంతగా రెచ్చిపోకండని ధాన్యలక్ష్మీ అంటుంది. నిజంగా కావ్యలాంటి డిజైనర్ ఈ జనరేషన్‌లో లేరు అపర్ణ. ఎప్పుడో మా చిన్పప్పుడు అలాంటి వాళ్లను చూశానని సుభాష్ అంటాడు.
అందరూ కావ్యను ప్రశంసిస్తుంటే.. ధాన్యలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. ప్రకాషం.. ఏంటి ధాన్యం అలా వెళ్లిపోతున్నావు అనగానే నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అంటుంది ధాన్యలక్మి. దీంతో ఇందిరాదేవి ధాన్యలక్ష్మీని తిడుతుంది. నలుగురిలో భర్తను అలా మాట్లాడొద్దని క్లాస్ ఇస్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి తనకు ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదని బాధపడుతుంటే.. అందరూ కళ్యాణ్ ను ఆటపట్టిస్తుంటారు.

ఇంతలో ధాన్యలక్ష్మీ, అపర్ణ మధ్య గొడవ వస్తుంది. దీంతో వీళ్లిద్దరూ తిట్టుకుంటూ మరోసారి నా శోభనం వాయిదా వేస్తారేమో అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. ముహుర్తం పెట్టినట్లు చెప్తారు. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు కాల్ చేసి.. శోభనం జరిపించేలా ఉన్నారని చెప్తుంది. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు తెలియకుండా ఈ శోభనం అపాలి అని అడుగుతుంది. దానికి వాళ్ల అమ్మ ఓ ఐడీయా చెప్తుంది. సరే మమ్మీ అలాగే చేస్తాను అని అనామిక అంటుంది.
మరోవైపు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తుంది అప్పు. ఇంట్లో డెలివరీ తీసుకునే మహిళ కంగారుపడుతూ డెలివరీ తీసుకుంటుంది. అప్పు ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఇంతలో వాళ్ల పాపను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఫోన్ చేసి బెదిరిస్తారు. ఇది గమనించిన అప్పు వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండని సలహా ఇస్తుంది. మరోవైపు బెడ్ రూంలో పడుకున్న రాజ్ దగ్గరకు నోటికి ప్లాస్టర్ వేసుకుని కాఫీ తీసుకుని వెళుతుంది కావ్య. రాజ్ నిద్ర లేచి కావ్య చూసి షాక్ అవుతాడు.
ఏంటీ ప్లాస్లరు ఏంటీ మ్యాటరని అడుగుతాడు. మీరు రాత్రి ఏమన్నారు. నేను అడ్డుగోలుగా వాదిస్తాను అన్నారు. నా మాట గెలవాలనుకుంటున్నాను అన్నారు. అసలు నేను మీతో మాట్లాడకుండా.. నోటికి ప్లాస్టర్ వేసుకుంటే ఎలా వాదిస్తాను. ఎలా నా మాట నెగ్గాలనుకుంటానని కావ్య చెప్తుంది. అంటే ఇప్పుడు తమరు ఈ బోర్డులో రాసినవన్నీ ఫాలో అవుతారన్నమాట అని రాజ్ అంటాడు. ఏం డౌటా? మీకు నచ్చినట్టే ఉండాలని కావ్య అంటుంది.

మీరు మెచ్చినట్టే ఉండాలి. మీరు నొచ్చుకోకుండా మాట్లాడాలి. మీరు విసుగు తెచ్చుకోకుండా నేను చూసుకోవాలి. అలాగే ఇకనుంచి నేను మీకు అప్పలమ్మలా కనిపించనని కావ్య చెప్పి కాఫీ ఇచ్చి వెళ్లిపోతుంది. దీని ఆత్మవిశ్వాసం చూస్తుంటే నిజంగానే సాధించేలా ఉంది అని మనసులో అనుకుంటాడు రాజ్. మరోవైపు కిడ్నాపర్లు పంపిన వీడియోను అప్పు మరోసారి చూసి అందులో ఉన్న స్కూల్ తనకు తెలుసని.. పాపను మనం రక్షించొచ్చని అంటుంది. అందుకోసం తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తుంది. దీంతో ఎపిసోడ్ అయిపోతుంది.
తదుపరి ఎపిసోడ్ లో స్వప్న.. తన చెల్లి కావ్యను ఎవరో అప్పలమ్మలా ఉన్నవ్ అని కామెంట్ చేశారంట. నేను ఉండగా నా చెల్లిని అలా అన్నవాళ్లకు చూపిస్తాను అంటూ కావ్యను రెడీ చేస్తుంది. ఇక ఆఫీసుకు కారులో బయలు దేరిన కావ్య.. ఆఫీసు ముందు స్టైలిష్ లుక్ లో దిగుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











