Brahmamudi February 3rd మోడ్రన్ లుక్‌లో ఆఫీసుకు కావ్య... ఎట్టకేలకు రాజ్, శ్వేత మధ్య రిలేషన్ బయటకు!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3వ తేదీన పిజ్జా డెలివరీకి వెళ్లిన అప్పు... కస్టమర్ వాళ్ల పాపను కిడ్నాప్ చేస్తారనే విషయం తెలుసుకుంటుంది. పాపను కాపాడేందుకు తన ఫ్రెండ్స్ ముగ్గురికి ఓ స్కూల్ పేరు చెప్పి మూడు ఏరియాల్లో ఉన్న పాఠశాల్లోకి వెళ్లమంటుంది. దాంతో ఆ ముగ్గురు అక్కడికి బయలుదేరుతారు. నా ఫ్రెండ్స్ కు చెప్పాను. వాళ్లు వెళ్లి పాప ఎక్కడుందో కనుక్కుంటారు అని అప్పు చెప్తుంది.
కస్టమర్ థ్యాంక్స్ అంటూ అప్పుకు చెప్తుంది. మీరు కంగారుపడకండి అని ధైర్యం చెబుతుంది అప్పు. మరోవైపు ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది కావ్య. ఇంతలో మేడమ్ పార్సల్ అని కొరియర్ బాయ్ వస్తాడు. కల్యాణ్ వెళ్లి ఆ పార్సల్స్ తీసుకుంటాడు. ఎవరికీ వచ్చిందో పేరు చూస్తానని రాహుల్ వెళ్లి చూస్తాడు. పార్సల్స్ పై రుద్రాణి పేరు చూసి షాక్ అవుతాడు. అప్పుడే వచ్చిన స్వప్న అవాక్కయ్యవా అంటుంది.

ఆ పార్సల్స్ ను రుద్రాణి వెళ్లి చూస్తుంది. తన పేరు చూసి షాక్ అవుతుంది. నా పేరు మీదే వచ్చింది. కానీ నేను బుక్ చేయలేదని అంటుంది.. బిల్ ఎంతైందని రాహుల్ అడిగితే.. 70 వేలు అయిందని, అది కూడా కట్టేసారని కొరియర్ బాయ్ చెబుతాడు. పేరు మీదే. కానీ, మీరు బుక్ చేయలేదు నేను ఆర్డర్ పెట్టాను అని స్వప్న చెప్తుంది. మరి నా పేరు ఎందుకు పెట్టావ్ అని రుద్రాణి అడిగితే.. ఆ 70 వేలు మీ క్రెడిట్ కార్డుతో కట్టానని అంటుంది.
రుద్రాణి షాక్ అవుతుంది. ఇదంతా చూసి ఇందిరాదేవి, అపర్ణ నవ్వుకుంటారు. ఇప్పుడు అంత అవసరం ఏముందని రుద్రాణి అరుస్తుంది. నాకు కాదు. కావ్యకు అని స్వప్న చెప్తుంది. ఇంతలో పైనుంచి రాజ్ కిందకు వస్తాడు. నా చెల్లిని ఎవరో అప్పలమ్మలా ఉన్నావని కామెంట్ చేశారు. నా చెల్లిన అంతమాట అంటే ఊరుకుంటానా అందుకే ఇలా ఆర్డర్ పెట్టానని స్వప్న అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నా కోడలిని అంతమాట అంటాడా ఎవడు ఆడు అని సుభాష్ ఫైర్ అవుతాడు. అతను రాజ్ కు బాగా తెలుసు అంకుల్ అని స్వప్న అంటుంది.
ఎవర్రా రాజ్ వాడు. నా కోడలిని అన్న వాడిపై రివేంజ్ తీసుకుంటాను అని సుభాష్ అంటే.. అంకుల్ రివేంజ్ అవరం లేదు రిటాట్ ఇద్దామని స్వప్న అంటుంది. అందుకే నా చెల్లిని రెడీ చేసి చూపిస్తా అని చెప్తుంది. రాజ్ ఆఫీసుకు వెళ్లిపోతాడు. కావ్య కోసం ఇలా చేసినందుకు నా ఫుల్ సపోర్ట్ నీకే స్వప్న అని ఇందిరాదేవి అంటుంది. థ్యాంక్యు అమ్మమ్మ అన్న స్వప్న కావ్యను రెడీ చేసేందుకు పైకి తీసుకెళ్తుంది. వాడెవడో కావ్యను కామెంట్ చేయడమేంటో.. అది స్వప్నకు కాలి.. రివేంజ్ కు బదులు రిటాట్ ఇద్దామనుకోవడం ఏంటో.. ఫైనల్ గా నాకు 70 వేలు బొ.. డ్యాష్ పడటం ఏంటో అని రుద్రాణి అంటుంది.

స్వప్న నా కోడలి కోసం తీసుకుందిగా ఆ డబ్బు నేను ఇస్తానులే అని అపర్ణ అంటుంది. దాంతో రిలీఫ్ గా ఫీల్ అయిన రుద్రాణి థ్యాంక్స్ వదినా అంటుంది. నా కోడలి కోసం అని స్వప్న చెబితే క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇచ్చేవాన్ని అని సుభాష్ అంటాడు. మరోవైపు ఫ్రెండ్స్ కాల్ కోసం ఎదురుచూస్తుంటుంది అప్పు. ముగ్గురిలో ఓ ఫ్రెండ్ కి ఆ ఇల్లు దొరుకుతుంది. అందులో రౌడీలు ఉన్నారని చెప్తాడు. దాంతో అక్కడే పాప ఉంటుందని కస్టమర్‌ను తనతోపాటు తీసుకెళ్తుంది అప్పు.
మరోవైపు కావ్య కోసం అంతా ఎదురుచూస్తుంటారు. చాలా సేపటి తర్వాత కావ్యను రెడీ చేసి కిందకు తీసుకొస్తుంది స్వప్న. అందరూ చూసి అవాక్కవుతారు. నచ్చనివాళ్లవి దిష్టి కళ్లు, నచ్చినవాళ్లవి ఆశీర్వదించే కళ్లు అని స్వప్న ముందే చెప్తుంది. దాంతో నోరు కట్టేసిందిగా అని రుద్రాణి అనుకుంటుంది. అంతా బాగుందని అంటారు. స్వప్నను మెచ్చుకుంటారు. దిష్టి కళ్లు అనుకున్నా సరే నాకు మాత్రం నచ్చలేదని ధాన్యలక్ష్మి అంటుంది.
అందరికీ నచ్చింది కానీ, ఒక్కరికే నచ్చలేదని కల్యాణ్ అంటాడు. అది కావ్య వదినకే. పులి వేషం వేసినట్లు ఫీల్ అవుతుంది అని కల్యాణ్ చెప్తాడు. నువ్ కరెక్ట్ గా చెప్పావ్ కల్యాణ్. దానికి అస్సలు ఇష్టం లేదు. కానీ రాజ్ మోడ్రన్ గా ఉండాలన్నాడట అందుకే రెడీ చేశాను అని స్వప్న అంటుంది. కావ్య మోడ్రన్ గా ఉండాలని రాజ్ అనుకున్నాడా అని అపర్ణ డౌట్ పడుతుంది. భర్తకు నచ్చినట్లు ఉండటం ధర్మమే కదా అని ఇందిరాదేవి అంటుంది.
మరోవైపు కిడ్నాపర్స్ ఉన్న చోటికి అప్పు వాళ్లు వెళ్తారు. ఇంట్లోకి అప్పు, కస్టమర్ వెళ్తారు. ఇద్దరూ రౌడీలు మొబైల్ చూసుకుంటూ ఉంటారు. దాంతో వెనుక నుంచి మెల్లిగా లోపలికి వెళ్తారు. అక్కడ పాప ఉన్న గదిలోకి వెళ్లి పాపను చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో పాపను అప్పు కాపాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీస్‌లో శ్వేతను కావ్య కలుస్తుంది. మనం డైరెక్ట్‌గా కలవడం ఇదే తొలిసారి కదా అని శ్వేత అంటుంది.
ఇదే చివరిసారి అని కావ్య అంటుంది. అదేంటి అని శ్వేత అనగా.. మళ్లీ మళ్లీ వస్తారా అని కౌంటర్ ఇస్తుంది శ్వేత. మన మధ్య ఏదో ఉందని మీ ఆవిడ అనుకుంటుందని శ్వేత రాజ్ కు చెప్తుంది. మనమధ్య ఏమి లేదని చెప్పు రాజ్ అని అంటుంది. నాకు తనతో ఉండటం ఇష్టం లేదని రాజ్ అంటాడు. శ్వేత ఫైర్ అవుతుంది. ఇప్పుడే వెళ్లి చెప్తాను అంటూ శ్వేత వెళ్తుంది.


Click it and Unblock the Notifications










