Brahmamudi February 4th కావ్య మోడ్రన్ లుక్‌కి పడిపోయిన రాజ్... భార్య ముందే శ్వేతతో అలా..!

నేటి బ్రహ్మముడి సీరియల్ (ఫిబ్రవరి 5వ తేదీ ఎపిసోడ్)లో అప్ప.. కస్టమర్ పాపను కాపాడేందుకు వెళ్తుంది. అక్కడ పాపను కాపాడి బయటకు తీసుకువస్తుంటే రౌడీలు వస్తారు. డబ్బులు ఇచ్చి పాపను తీసుకుపోవాలని చెప్తారు. లేకపోతే పాపను చంపేసి ఆర్గాన్స్ అమ్మేస్తామని హెచ్చరిస్తారు. దీంతో అప్పు అది జరగాలంటే మీరు ఉండాలిగా అని అంటుంది. అంటే మమ్మల్ని కొట్టి పాపను తీసుకుపోతావా అని అడుగుతారు రౌడీలు.

మిమ్మల్ని నేను ఎందుకు కొడతాను..పోలీసులు వస్తారు అని చెప్తుంది. ఎలా వస్తారు అని రౌడీలు అనగానే.. ఇలా అంటూ డోర్ తీసుకుని పోలీసులు ఎంటర్ అవుతారు. నేను వచ్చే ముందే పోలీసులకు మెసెజ్ పెట్టాను అని చెప్తుంది అప్పు. దీంతో పోలీసులు రౌడీలను తీసుకుపోతారు. అలాగే అప్పును అభినందిస్తారు. మీలాంటి యంగస్టార్స్ మా డిపార్ట్ మెంట్లో ఉండాలని చెప్తారు. థ్యాంక్యూ చెప్తుంది అప్పు.

మరోవైపు ఆఫీసులో రాజ్... కరెక్షన్స్ విషయంలో సెక్రటరీ శృతిని తిడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య మోడ్రన్ లుక్ లో కారు నుంచి దిగుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంది. అది చూసి రాజ్ బిత్తరపోతాడు. శృతి.. కావ్యను చూసి పొగుడుతుంది. దీంతో రాజ్ సిరీయస్ అవుతాడు. ఆఫీసులో అందరూ సూపర్ గా ఉన్నారు అంటూ పొగుడుతూ ఉంటారు. రాజ్ తన ఆఫీసురూమ్ లోకి వచ్చి కూర్చుంటాడు.

February 4th 2024 Episode number 324 in Brahmamudi Telugu Serial

ఇక కాసేపు కావ్య, రాజ్ టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతారు. టెడ్డిబేర్ కు ట్రెండీవేర్ వేసినట్లు ఉందని అంటాడు. దీంతో కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో శ్వేత కాల్ చేస్తుంది. కలుద్దాం అన్నావ్ అని శ్వేత అంటే.. ఎక్కడో ఎందుకు ఆఫీసుకు వచ్చేయ్ అంటాడు రాజ్. మరోవైపు రుద్రాణి సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. కావ్యలో వచ్చిన మార్పు గురించి తెలుసుకున్నవా అని రాహుల్ ను అడుగుతుంది. కెరియర్ ను డెవల్మెంట్ కోసమే వెళ్లినట్లుందని చెప్తాడు.

కావ్య.. రాజ్ కోసమే వెళ్లిందని రుద్రాణి అనుకుంటుంది. రాజ్, కావ్య అన్యోన్యంగా లేరు.. ఉన్నట్లు నటిస్తున్నారని మాట్లాడుకుంటారు. రాజ్ ఏదో తప్పు చేశాడు కాబట్టే కావ్య ఆఫీసుకు వెళ్తుందని తెలుసుకోమని రాహుల్ కు చెప్తుంది. మరోవైపు కావ్య ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్వేత వస్తుంది. శ్వేతను చూసిన రాజ్... కావ్యకు మంట పెట్టాలని శ్వేత అంటూ వెళ్తాడు. హాయ్ శ్వేత అంటూ ఆమె మీద చేయి వేసి మాట్లాడుతాడు.

దీంతో కావ్య వచ్చి.. శ్వేతతో మాట్లాడుతుంది. శ్వేత మీద కౌంటర్స్ వేస్తుంది. దీంతో శ్వేతకు డౌట్ వస్తుంది. మరోవైపు మరిది కల్యాణ్ ఉంటే బాగుండని శృతితో కావ్య మాట్లాడుతుంది. ఇక రాజ్ క్యాబిన్ లో శ్వేత మాట్లాడుతూ.. కావ్య మనల్ని అపార్థం చేసుకుంది.. మనం స్నేహితులమే అని చెప్పు అని శ్వేత అంటుంది. దీంతో రాజ్ నాకు ఇష్టం లేదు అంటూ చెప్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో రాజ్.. శ్వేతతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. అది చూసి కావ్య రగిలిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X