Brahmamudi February 8th మళ్లీ ఫస్ట్ నైట్ చెడగొట్టేసిన అనామిక.. కావ్య చేతికి దుగ్గిరాల ఇంటి బాధ్యతలు!
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. దుగ్గిరాల కుటుంబంలో మూడో వారసుడు అయినటు వంటి కల్యాణ్ శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఇక శోభనం గదిలో కల్యాణ్.. అనామిక కోసం రొమాంటిక్ పాటలు పాడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. మంచాన్ని పూలతో అలరించి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో అనామిక పాల గ్లాసుతో గదిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక కల్యాణ్.. నేను ఆగలేను అంటూ అనామికతో మాట్లాడుతాడు.
ఇంతలో అనామిక మళ్లీ శోభనం చెడగొట్టేందుకు ఓ అబద్దం చెప్తుంది. తనకు పిరియడ్స్ మూడు రోజుల వరకు కుదరదు అని చెప్తుంది. దీంతో కల్యాణ్ డిసపాయింట్ అవుతాడు. కాలం మనతో కర్కశంగా ప్రవర్తిస్తుందని... ఇద్దరిని దూరం పెడుతుందని బాధపడతాడు. శోభనం గదిలో కాకుండా బయటపడుకోవడానికి కల్యాణ్ దిండు, దుప్పటి తీసుకుంటాడు. కానీ నువ్వు బయటపడుకుంటే మనకు అరిష్టమని అందరూ అనుమానపడతారని గదిలోనే పడుకోమని కల్యాణ్ తో అనామిక అంటుంది.

అనామిక ప్లాన్ తెలియని కళ్యాణ్ అందుకు ఒప్పుకుని గదిలోనే కింద పడుకుంటాడు. ఆఫీసుకు నువ్వు బాస్, ఇంటికి నేను మహారాణిని అయ్యే వరకు ఈ నాటకాలు తప్పదని అనామిక మనసులో అనుకుంటుంది. మరోవైపు రాజ్ గదిలో కావ్యను ఆటపట్టించాలని.. శ్వేతకు వీడియో కాల్ చేస్తాడు. కావ్య ముందు హాయ్ స్వీటీ అంటూ శ్వేతపై ప్రేమను ఒలకబోస్తాడు. ఏంటి నీరసంగా ఉన్నావు. నేను పక్కన లేనని డిన్నర్ చేయడం మానేసావా అంటూ మాట్లాడుతాడు.
ఇక శ్వేతపై ఓవర్ కేరింగ్ చూపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన కావ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు శ్వేతకు ఇష్టం లేకపోయినా రాజ్ కోసం డ్రామా కంటిన్యూ చేస్తుంది. భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు డిస్ట్రబ్ చేయకూడదని కామన్స్ సెన్స్ లేకుండా కొంతమంది బతికేస్తూ ఉంటారని శ్వేతపై సెటైర్ వేస్తుంది కావ్య. ఆమెపై ఫైర్ అవుతాడు రాజ్. నువ్వేం పట్టించుకోకు అది కొంచెం తింగరిబుచ్చి అని కావ్య గురించి శ్వేతకు చాడీలు చెబుతాడు రాజ్.
రాజ్ మాటలతో కావ్య ఫైర్ అవుతుంది. ఫోనులో పాటలు పెడుతుంది. ఆ గోల ఆపమని రాజ్ కోప్పడుతాడు. దాంతో నిద్ర పోతానని చెప్పి కావ్య లైట్ ఆఫ్ చేస్తుంది. నేను మాట్లాడుతున్నాగా ఎందుకు లైట్ ఆఫ్ చేస్తున్నావని కావ్యను అడుగుతాడు రాజ్. లైట్ ఉంటే నాకు నిద్ర రాదని కావ్య అంటుంది. మనం మాట్లాడుకుంటుంటే చాలా మందికి కడుపుమంటగా ఉందని శ్వేత రేపు మాట్లాడుతాను అంటూ వీడియో కాల్ కట్ చేస్తాడు. నన్ను ఏడిపించడమే నీ పనా అని కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. ఆ పనిచేస్తుంది మీరు అంటూ రాజ్ కు సమాధానం చెప్పి పడుకుంటుంది.

మరోవైపు అప్పు పోలీస్ కావాలని అనుకుంటుంది. అందుకోసం తనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా కాదనుకుంటుంది. నిన్న ఓ చిన్నారిని కాపాడినప్పుడు ఒకరికి సాయం చేయడంలో నిజమైన ఆనందం ఉందని అర్థమైందని, అందుకే పోలీస్ కావాలని నిశ్చయించుకున్నట్లు తండ్రితో చెబుతుంది అప్పు. పోలీస్ కావడానికి జాబ్ మానేయాల్సివస్తుందని చెప్తుంది. కూతురు ఎదుగుదల భారం అవ్వదు.. బాధ్యత అవుతుందని అని కృష్ణ మూర్తి అంటాడు.
శోభనం గదిలో నుంచి బయటకు వెళ్లబోతున్న కళ్యాణ్ ను ఆపుతుంది అనామిక. శోభనం జరిగినట్లుగా అందరిని నమ్మించేందుకు అతడి జుట్టు చెరిపివేస్తుంది. షర్ట్ పై లిప్ స్టిక్, కాటుక మరకలను అంటిస్తుంది. అదే డ్రెస్సులో కిందికి వస్తాడు కళ్యాణ్. అతడిపై సుభాష్ కోప్పడుతాడు. శోభనం బట్టలతో బయటకు రాకూడదని అంటాడు. నిజంగానే కళ్యాణ్, అనామిక శోభనం జరిగిందని అందరూ నమ్ముతారు తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు అనామిక హ్యాపీగా ఫీలవుతుంది.
మరోవైపు కావ్యను పిలిచిన అపర్ణ...ఇంటి బాధ్యతలు మొత్తం ఆమెకు అప్పగిస్తున్నట్లు చెప్తుంది. దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా ఈ రోజు నుంచి ఆ బాధ్యతలు అన్ని నువ్వే చూసుకోవాలని చెప్తుంది. ఇంటి తాళాలను ఆమె చేతిలో పెడుతుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరకే రావాలని అంటుంది. ఆమె మాటలతో ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక షాకవుతారు.


Click it and Unblock the Notifications










