Brahmamudi February 9th పోలీసుగా మారనున్న అప్పు... కావ్య చేతికి దుగ్గిరాల ఇంటి పగ్గాలు!
బ్రహ్మముడి నేటి ఎపిసోడులో (ఫిబ్రవరి 9వ తేదీ) కావ్య, కల్యాణ్.. రాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అన్నయ్య తప్పు చేస్తున్నారు అంటే నా మనసు ఒప్పుకోలేదని కావ్య అంటుంది. ఇక తాను కూడా మొదట నమ్మలేదని... అన్నయ్య ప్రవర్తన చూస్తుంటే నమ్మాల్సి వస్తుందని కల్యాణ్ అంటాడు. ఇంతలో రాజ్ డంబెల్స్ తో బయటకు వచ్చి స్కిప్పింగ్ ఆడుతాడు. ఇక అప్పుడే ఇందిరాదేవి, సుభాష్, ప్రకాశం వస్తారు. రాజ్ స్కిప్పింగ్ ఆడటం చూస్తారు.
రాజ్ ఏంట్రా ఇవ్వన్నీ అని ఇందిరాదేవి అడుగుతుంది. సత్తువ పెంచుకోవడానికి కసరత్తులు చేస్తున్నా అని చెప్త్తాడు రాజ్. అంత అవసరం ఉంటే.. జిమ్ కు పోవచ్చు కదా అని సుభాష్ అంటాడు. నాకు ఇళ్లే వ్యాయమశాల అని చెప్తాడు రాజ్. తనకు క్లోజ్ ఫ్రెండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయమని చెప్పినట్లు సుభాష్ కు రాజ్ చెప్తాడు. పెళ్లైన ఇంత కాలానికి దీనిపై ధ్యాసమళ్లిందా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఇక తాను నిత్య పెళ్లి కొడుకులా ఉంటానని రాజ్ అంటాడు.

ఇక కావ్య.. నిత్య పెళ్లి కొడుకులా ఉంటారట చూడండి అంటూ కల్యాణ్ తో చెప్తుంది. ఇక తర్వాత కావ్య.. రాజ్ కోసం పొగలు కక్కే వాటర్ తీసుకుపోతుంది. గీజర్ పని చేయడం లేదని.. స్టవ్ మీద పెట్టి తీసుకుపోతున్నట్లు ప్రకాశంతో చెప్తుంది. ప్రకాశం బకెట్ కరిగేలా ఉంది త్వరగా తీసుకుపో అని చెప్తాడు. ఇక తర్వాత గదిలో స్నానానికి నీళ్లు పెట్టినట్లు కావ్య చెప్తుంది. ఇంతలో స్వేత కాల్ చేస్తుంది. ఆ కాల్ ను చూసిన కావ్యతో రాజ్ సెటైర్స్ వేస్తాడు. కాలిందా.. బాగా కాలిందా అంటూ ఫోన్ తీసుకుని శ్వేతతో మాట్లాడుతాడు.
గుడ్ మార్నింగ్.. బేబీ అంటూ అంటూ మాట్లాడుతాడు. దీంతో కావ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శ్వేతతో మాట్లాడిన తర్వాత కూడా కాలిందా ఇంకా కాలిందా అంటూ కావ్యతో అంటాడు రాజ్. ఆ తర్వాత స్నానానికి పోతుంటే.. కావ్య నీళ్లు వేడిగా ఉన్నాయి అని చెప్పబోతుంది. కానీ రాజ్ ఆ విషయాన్ని చెప్పనివ్వడు. అలాగే బాత్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. వేడి నీళ్లతో స్నానం చేసి.. ఆ.. అంటూ అరుస్తాడు.
ఏమైందని కావ్య అడుగుతుంది. కాలిందా అని అడుగుతుంది. రాజ్ షాక్ అవుతాడు. చెప్పాలి కదా అని తిడుతాడు. మీరే చెప్పనివ్వలేదని చెప్తుంది కావ్య. ఇక రాజ్ మీద కావ్య సెటైర్స్ వేస్తుంది. ఆ తర్వాత కావ్య కింద డైనింగ్ హాల్ దగ్గర అందరికి టీఫిన్స్ వండిస్తూ ఉంటుంది. రాజ్ ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. ఇంతలో రాజ్ చిన్న ఫ్యాన్ పట్టుకుని వస్తాడు. ఎండకాలం లాగా ఆ ఫ్యాన్ ఏంటి అని ఇందిరాదేవి అడుగుతుంది.
కళ్లు మంటగా ఉన్నాయని చెప్తాడు రాజ్. ఇక వేడివేడిగా టిఫిన్ తినమంటే నో అని అరుస్తాడు. ఆ తర్వాత పనిమనిషిని పిలిపించి సలాడ్ తెప్పించుకుని రాజ్ ఆరోగ్యం గురించి చెబుతూ తింటాడు. ఇంతలో ఇందిరాదేవి నెలవారీ సామానులు తెప్పించావా అని ఇందిరాదేవి.. అపర్ణను అడుగుతుంది. ఇంకా లిస్ట్ ఇవ్వలేదని చెప్తుంది. ఇక ధాన్యలక్ష్మి ఫ్లాష్ బ్యాక్ లో అపర్ణకు తాను ఇచ్చిన లిస్ట్ సీన్ గుర్తుకు తెచ్చుకుంటుంది.

గతంలో కాస్మోటిక్స్ లిస్ట్ ఇచ్చి.. అపర్ణ చేత తిట్లు తిన్నది గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇక ఈ నెల అపర్ణ చేతికి ఇవ్వకూడదని అనుకుంటుంది. ప్రకాశం దగ్గరకు వెళ్లి 20వేలు కావాలని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అదేంటి నన్ను అడుగుతున్నవ్ అని ప్రకాశం అంటాడు. వదినను కదా అడిగేది అని అంటే.. అక్కను నేను అడగను.. నాకు ఇష్టం లేదు.. నా ఖర్చులు మీరే చూసుకోవాలని అంటుంది ధాన్యలక్ష్మి. మీరు మీరు బాగానే ఉంటారు.. మధ్యలో నేను ఎందుకు బలి అవ్వడం నేను ఇవ్వను.. నువ్వు వెళ్లి వదిననే అడుగు అని చెప్తాడు ప్రకాశం.
ఇదంతా విన్న అపర్ణ.. ధాన్యలక్ష్మికి బుద్ది చెప్పాలని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్యకు ఇంటి బాధ్యతలు అప్పగిస్తుంది అపర్ణ. ఇదంతా చూసిన అనామిక, ధాన్యలక్ష్మి రగిలిపోతారు.


Click it and Unblock the Notifications











