twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జుట్టు కత్తిరించుకున్న NTV 7 యాంకర్‌పై వేటు

    By Bojja Kumar
    |

    Ras Adiba Mohd Radzi
    మలేషియాకు చెందిన న్యూస్ ఛానల్ NTV 7లో పని చేసే ముస్లిం యాంకర్ 'రాస్ అదిబా' క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించడంలో భాగంగా తన జుట్టును కత్తిరించుకుంది. అయితే పూర్తిగా గుండు చేయించుకుంటే న్యూస్ యాంకర్ జాబ్‌కు అన్ ఫిట్ కాబట్టి కాస్త జుట్టు మాత్రం ఉంచుకుంది.

    అయితే ఈ పని చేసినందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమెకు మతాధికారుల నుంచి వార్నింగ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు ఫత్వా జారీ చేశారు. అయితే రాస్ అదీబా మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. తాను క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగానే జుట్టుకు కత్తిరించుకున్నానని, అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేస్తోంది.

    క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రాణాలు పోవడం ఖాయమనే భావన చాలామందిలో ఉంది. అయితే వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమేనని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతర్జాతీయంగా క్యాన్సర్ నిరోధంపై అవగాహనను కల్పించడానికి సుమారు 350 సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

    క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం ఖాయమనేదాన్ని చాలామంది అధిగమించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ విషయానికి వస్తే ప్రముఖ గాయని మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వ్యాధి బాధితురాలే. ముందస్తుగా వ్యాధిని కనుగొనడంతో దాని నుంచి ఆమె బయటపడింది.

    అదేవిధంగా బాలీవుడ్ నటీమణి లీసారే, హాలీవుడ్ నటి బార్బరా తదితర నటీమణులు కూడా క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడి యధావిధిగా తమతమ కెరీర్లలో రాణిస్తున్నారు.

    English summary
    A female Muslim TV news anchor for Malaysia's NTV7 who shaved her head has been suspended until her hair has grown back to an "acceptable length". Ras Adiba Mohd Radzi, a popular television personality in Malaysia, shaved her head in support of the National Cancer Council cancer awareness campaign.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X