Bigg Boss 7 Telugu: 20 మందిలో వచ్చింది 14 మందే.. మిగిలిన వాళ్లు ఎవరు? షోలోకి ఎప్పుడు వస్తారంటే!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌ను పరిచయం చేసిన షో బిగ్ బాస్. ఊహించని సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, కంటెస్టెంట్ల ఫైటింగ్స్ ఇలా ఎన్నో రకాల సీన్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితులు ఉండవని నిరూపించి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పటికే కొన్ని సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఆదివారమే ఏడో సీజన్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు తక్కువ మంది కంటెస్టెంట్లే ఎంట్రీ ఇచ్చారు. మరి మిగిలిన వాళ్లు ఎవరు? వాళ్లంతా షోలోకి ఎప్పుడు వస్తారు? ఆ వివరాలేంటో మీరే చూడండి!

గ్రాండ్‌గా మొదలైన ఏడో సీజన్:తెలుగులో బిగ్ బాస్ సీజన్లు అన్నీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంతో ఇప్పుడు షో నిర్వహకులు ఏడో దాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 3న ప్రీమియర్ ఎపిసోడ్ ద్వారా దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరించి హౌస్‌లోకి అడుగు పెట్టారు. గతంలో కంటే ఈ సారి హౌస్ మరింత కలర్‌ఫుల్‌గా కనిపించింది. అలాగే, ఇందులో మార్పులూ చేశారు.

Few More Contestants Will Enter Into Bigg Boss 7 Telugu

పేరుకు తగ్గట్లుగానే ట్విస్టులు:ఆరో సీజన్ అనుకున్న రేంజ్‌లో ఆదరణను అందుకోలేదు. దీంతో నిర్వహకులు ఏడో దాన్ని 'ఉల్టా పుల్టా' అనే కాన్సెప్టుతో సరికొత్తగా నడిపిస్తామని ముందే చెప్పారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. దీంతో ఆరంభంలోనే ఈ సీజన్‌పై అంచనాలను భారీగా పెంచేశారు.

Few More Contestants Will Enter Into Bigg Boss 7 Telugu

ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారంటే:గ్రాండ్‌గా లాంఛైన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.

చివర్లో ట్విస్టు.. హీరోను కూడా:ఆదివారం జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ ప్రముఖ హీరో నవీన్ పోలిశెట్టి కూడా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు. కానీ, నాగార్జున మాత్రం అతడు చెప్పింది అస్సలు నమ్మలేదు. అంతేకాదు, ప్రతి కంటెస్టెంట్ మాదిరిగానే నవీన్ పోలిశెట్టిని కూడా హౌస్‌లోకి పంపించాడు. అతడు లోపలికి ఎంట్రీ ఇచ్చిన దాన్ని సోమవారం ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు.

Few More Contestants Will Enter Into Bigg Boss 7 Telugu

అర్థాంతరంగా ముగించారు:వాస్తవానికి బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి దాదాపు 20 మంది వరకూ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, ప్రీమియర్ ఎపిసోడ్‌లో కేవలం 14 మందిని మాత్రమే లోపలికి పంపించి అర్థాంతరంగా ముగించేశారు. దీంతో ప్రేక్షకులు అందరూ డైలమాలో పడిపోయారు. కొందరైతే మన అభిమాన సెలెబ్రిటీలు షోలోకి రాలేదని షాక్‌కు కూడా గురయ్యారు.

నిజంగానే 20 మంది ఎంట్రీ:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 7వ సీజన్‌లో నిజంగానే 20 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారట. అయితే, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో మిగిలిన వాళ్లను ఈ వారం మధ్యలో లేదా వచ్చే శని, ఆదివారాలు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లలో పంపించే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే షో మరింత ఆసక్తికరంగా మారే చాన్స్ ఉంది.

Few More Contestants Will Enter Into Bigg Boss 7 Telugu

ఎవరు ఎంట్రీ ఇస్తున్నారంటే:గతంలో లీక్ అయిన లిస్టును బట్టి చూస్తే.. బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి సీరియర్ హీరో అంబటి అర్జున్, యాంకర్ నిఖిలు, భోలే షావలి, హీరోయిన్ ఫర్జానా, సింగర్ మోహన భోగరాజు, సీరియల్ నటి ఐశ్వర్య పిస్సేలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ లిస్టులో కొన్ని మార్పులు జరిగినా మొత్తానికి 20 మందిని ఫైనల్ చేయడం మాత్రం కన్ఫార్మ్ అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X