తోపు లెక్క ఫీల్ అవ్వొద్దు .. గీతూ రాయల్‌కి ఇచ్చిపడేసిన ఫైమా, ఆ షోలో బయటపడ్డ విభేదాలు
ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల. మూవీ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు ఇలా ఏది తీసుకున్నా కార్యక్రమాన్ని అద్భుతంగా రక్తి కట్టించడంలో సుమ దిట్ట. ఎంతోమంది యాంకర్లు వస్తున్నారు , పోతున్నారు కానీ సుమ మాత్రం ఇప్పటికీ నెంబర్‌వన్‌గా వెలుగొందుతున్నారు. అలాంటి సుమ హోస్ట్‌గా ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతూ.. వినోదాన్ని అందిస్తోంది. ఎప్పటిలాగే ఈ వారానికి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది ఈటీవీ. ఈ వివరాల్లోకి వెళితే..
దాదాపు 15 ఏళ్లుగా ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో సుమ హోస్ట్ చేస్తున్న షోలు ప్రసారమవుతున్నాయి. మొదట్లో క్యాష్ ప్రోగ్రామ్ ఉండగా.. దాని ప్లేస్‌లో సుమ అడ్డా కార్యక్రమం మొదలైంది. ఏళ్లుగా మారని ఈ టైమ్‌ను ఈటీవీ యాజమాన్యం మార్చింది. దీనికి కారణం జబర్దస్త్. గతంలో గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు జబర్దస్త్ వచ్చేది. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రసారమయ్యేది. అయితే ఇప్పుడు ఎక్స్‌ట్రాను పక్కనపెట్టి.. శుక్ర, శనివారాల్లో జబర్దస్త్ ప్రసారం చేయాలని డిసైడ్ కావడంతో శనివారం రాత్రి 9.30 ప్రసారమయ్యే సుమ అడ్డా షో మంగళవారం రాత్రి 9.30కి షిఫ్ట్ అయ్యింది.

రోజు మారినా సుమ అడ్డా మంచి వ్యూయర్‌షిప్ సాధిస్తోంది. ప్రతి వారం ఏదో ఒక చిత్ర యూనిట్ లేదంటే సినీ ప్రముఖులను తీసుకొచ్చి వారితో సరదాగా గేమ్స్ ఆడిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు సుమ. తాజాగా ఈ వారం బుల్లితెర నటులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయిన పల్లవి ప్రశాంత్, భోలే షావలి, దామిని, ఫైమా, గీతూ రాయల్, కీర్తి భట్‌లు సుమ అడ్డాలో సందడి చేశారు. రావడం రావడమే సుమపై పంచ్‌లు విసిరింది గీతూ. రేపొద్దున సుమ అడ్డా మాదిరిగా గీతూ అడ్డా అని ఇంకో షో పెట్టాలని అనగా.. వద్దులేమ్మా.. ఈ టైటిల్ దీనికొక్కదానికే సరిపోతుందని సుమ కౌంటర్ వేస్తుంది.
ఆ వెంటనే మొన్న చిరంజీవి గారి ఇంట్లో కోటును తీసుకొచ్చినట్లు మీరు నా రెండు నైటీలు తీసుకొచ్చేశారని భోలేపై పంచ్‌లు వేస్తుంది సుమ. ఆ వెంటనే లాలీ పాప్‌ను గాల్లోకి ఎగరేసి నోటీతో క్యాచ్ పట్టుకోవాలని ఓ టాస్క్ ఇవ్వగా.. ఫైమా, దామిని ఓడిపోతారు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం పర్ఫెక్ట్‌గా పట్టుకోవడంతో నీకన్నీ అలా కలిసొస్తుంటాయ్ అంతే అంటూ అతనిపై పంచ్‌లు విసురుతుంది. తర్వాత ఫైమాతో దెయ్యం స్కిట్ చేయిస్తుంది. ఆ వెంటనే వారితో బిగ్‌బాస్ తరహాలో ఓ సీరియస్ గేమ్ ఆడిస్తుంది సుమ.
దామిని, కీర్తి భట్, భోలే షావలి, కీర్తి భట్‌లను కూర్చోబెట్టి నువ్వెందుకు రాలేదని అడగ్గా.. ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు వాళ్లిద్దరూ అనుకుని వెళ్లిపోయారు. నేనొక్క దాన్ని ఉన్నా నన్ను ఒక్క మాట కూడా అడగలేదని అంటుంది. దీంతో గీతూ - ఫైమాల మధ్య మాటా మాటా పెరిగి, తోపు లెక్క బిహేవ్ చేయొద్దంటూ గీతూకి ఫైమా వార్నింగ్ ఇస్తుంది. తర్వాత భోలే షావలితోనూ గీతూ గొడవ పడుతుంది. ఎన్ని ఇగోల్రా బాబోయ్ అని సుమ షాక్ అవుతుంది. నువ్వు అక్కడ చేసిన కథలంతా నా ముందు చేయొద్దు అంటూ పల్లవి ప్రశాంత్‌కి గీతూ వార్నింగ్ ఇస్తుంది. మీరు ఏదో రియాలిటీ షోలో ఉన్నప్పుడు మిగిలినవి ఇక్కడ తేల్చుకుంటున్నారా అంటూ సుమ పంచ్‌లు వేస్తుంది. మరి సుమ అడ్డాలో ఏం జరిగిందో తెలియాలంటే నవంబర్ 26 రాత్రి 9.30 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











