బిగ్‌బాస్‌లో రచ్చ..స్విమ్మింగ్ పూల్‌లో తన్నుకున్న సామ్రాట్, తనీష్.. నందినితో రొమాన్స్ వల్లే చిచ్చు!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. సభ్యులతో నాని జరుపుతున్న సంభాషణకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ఎలిమినేషన్ ఎపిసోడ్స్ లో నాని వ్యవహరిస్తున్న విధానం చాలా బావుంది. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి, ఎవరిని మెచ్చుకోవాలి వంటి అంశాలలో నాని చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీక్ డేస్ లో ఆసక్తికరమైన టాస్క్ లతో హౌస్ సభ్యులు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న మూవీ మేకింగ్ టాస్క్ రసవత్తరంగా ఉంది. నేడు ప్రదర్శించబోయే ఎపిసోడ్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.

మూవీ మేకింగ్ టాస్క్
బిగ్ బాస్ ఆదేశం ప్రకారం సభ్యలంతా మూవీ మేకింగ్ టాస్క్ లో పాల్గొంటున్నారు. సభ్యలంతా ఓ చిత్రాన్ని చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఫ్రెండ్స్ మధ్యలోకి లవర్ వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ హౌస్ లో సినిమా తెరకెక్కుతోంది.

వాళ్లే హీరోలు
బిగ్ బాస్ హౌస్ లో తెరకెక్కుతున్న సినిమాలో తనీష్, సామ్రాట్, కౌషల్ హీరోలుగా కనిపిస్తున్నారు. ప్రోమోలో వీరి మధ్య సంభాషణ ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఈ చిత్రానికి అమిత్ దర్శకుడు, రోల్ రైడ కెమెరా మెన్ కావడం విశేషం.

అందమైన హీరోయిన్
ఇక నందిని అందమైన హీరోయిన్ గా నటిస్తోంది. కౌశల్ తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. హీరోయిన్ ఎంట్రీ చూస్తే నిజమైన సినిమా అనే అనిపిస్తుంది. హీరోయిన్ ఎంట్రీ తరువాతే అసలు కథ మొదలవుతుంది.

నందినితో రొమాన్స్
నందినికి కౌశల్ ప్రపోజ్ చేయడం.. అతడి ప్రేమని నందిని అంగీకరించడం చక చకా జరిగిపోయేలా కనిపిస్తున్నాయి. వీరి మధ్య రొమాన్స్ కూడా సాగుతుంది. ఇక్కడే స్నేహితుల మధ్య చిచ్చు మొదలైనట్లు కనిపిస్తుంది.

స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ
నందిని విషయంలో స్నేహితుల మధ్య గొడవలు మొదలవుతాయి. తనీష్.. నందిని, కౌశల్ ప్రేమని అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగిందా.. అసలు కారణం ఏంటి అనే విషయాలు నేటి ఎపిసోడ్ లో తేలనున్నాయి. కానీ నందిని విషయంలో సామ్రాట్, తనీష్ మధ్య స్వమ్మింగ్ పూల్ లో పెద్ద రచ్చే జరుగుతోంది.

చరిత్ర సృష్టిస్తుంది
సామ్రాట్, తనీష్ మధ్య ఫైట్ సీన్ తరువాత దర్శకుడు అమిత్ తెగ సంబరపడిపోతాడు. నా సినిమా అని చెప్పడం కాదు కానీ.. ఈ సినిమాతో నేను చరిత్ర సృష్టిస్తానని అమిత్ అంటున్నాడు.


Click it and Unblock the Notifications











