‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫైటింగ్.. ప్రాపర్టీ ద్వంసం చేసిన అలీ.. వాళ్లిద్దరిని పైనుంచి తోసేశాడు

Recommended Video

Simhasanam kosam dragons veta #BiggBossTelugu3

తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఊహించిన దాని కంటే ఎక్కువ రేటింగ్‌తో దూసుకుపోతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. దానికి తోడు, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా అలాగే ఉండడంతో గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా మరోసారి ఫిజికల్ టాస్క్ ఫైటింగ్‌కు దారి తీసింది.

 కెప్టెన్సీ టాస్క్

కెప్టెన్సీ టాస్క్

మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా రెండు రాజ్యాలుగా ఏర్పడాలని సూచించాడు. తమ జెండాలను పక్క రాజ్యంలో పెట్టిన వారే విజేతలని చెప్పాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మూడు డ్రాగన్ ఎగ్స్ ఎవరు సొంతం చేసుకుంటారో.. వాళ్లే తదుపరి రౌండ్‌కు వెళ్తారని వెల్లడించాడు.

ముగ్గురే మిగిలారు

ముగ్గురే మిగిలారు

రెండు రాజ్యాల్లో.. శ్రీముఖి టీమ్.. హిమజ జట్టు కంటే ఎక్కువ జెండాలను పాతింది. అయితే, బజర్ మోగే సమయానికి ఇరు టీమ్‌లలో ఒక్క సైనికుడు కూడా మిగలకపోవడంతో ఏ జట్టూ విజయం సాధించలేదని బాస్ చెప్పాడు. అయితే, అప్పటికి డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని ఉన్న అలీ, రవి, రాహుల్ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతాడని వివరించాడు. దీంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసిపోయింది.

సింహాసనంపై కూర్చోవాలి

బుధవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో కెప్టెన్సీ టాస్క్ జరిగిన క్రమాన్ని చూపించాడు. దీని ప్రకారం.. డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని ఉన్న అలీ, రవి, రాహుల్ కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. గార్డెన్ ఏరియాలో ఉంచి సింహాసనంపై బజర్ మోగే వరకు ఎవరు కూర్చుని ఉంటారో వాళ్లే ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ లెటర్‌లో పేర్కొన్నాడు.

 కుర్చీ కోసం ఫైటింగ్

కుర్చీ కోసం ఫైటింగ్

ఇందులో అందరి కంటే ముందుగా అలీ రేజా సింహాసనంపై కూర్చున్నాడు. అతడిని కిందికి దించేందుకు మిగిలిన ఇద్దరు పోటీ దారులు, వారికి మద్దతుగా కొందరు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అలీ.. ప్రాపర్టీని విరగ్గొట్టాడు. అంతేకాదు, తన దగ్గరకు వస్తున్న రాహుల్, రవి కృష్ణను పై నుంచి కిందికి తోసేశాడు. ఆ సమయంలో అంతా ఆశ్చర్యపోయారు.

ఎవరు కెప్టెన్ అవుతారు?

ఎవరు కెప్టెన్ అవుతారు?

ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారన్న దానిపై మాత్రం ఆసక్తి కొనసాగుతూనే ఉంది. వీరిలో రవి గాయపడి ఉండడం వల్ల ఆయన పెద్దగా పోరాటం చేయలేడు. మిగిలిన ఇద్దరు మాత్రం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీంతో వారిద్దరిలోనే ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది మద్దతు ఉన్న అలీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X