గేదెలు, మేకలు కాసేవాళ్లం.. చిరంజీవిని అలా అనేసరికి గట్టిగా పీకాడు.. రామ్-లక్ష్మణ్ కామెంట్స్

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ తెలియని అంటే ఎవరో తెలియని సినీ ప్రేక్షకులుండరూ. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్క స్టార్‌తో పని చేశారు. చదువు లేని ఈ మాస్టర్స్.. చిత్రసీమలో టాప్ ఫైట్ మాస్టర్స్‌గా ఎదిగిన తీరు, పడిన కష్టాలు తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. చిన్నతనంలో వారి బాల్యం, కుటుంబ నేపథ్యం తెలిస్తే కంటనీరు పెట్టాల్సిందే. తాజాగా వీరిద్దరు అలీ నిర్వహించే షోలో పాల్గొని ఎన్నో విషయాలను ప్రేక్షకులకు తెలియజేశారు.

గేదెలు, మేకలు..

గేదెలు, మేకలు..

చిన్నతనంలో ఊర్లో గేదెల, మేకలు కాసేవాళ్లమని, పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు అదే పని అని, వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని గడిపేవాళ్లమని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు. వీరిద్దరిలో ఒకరు గేదెలు, ఇంకొకరు మేకలు కాసేవారట. ఏ మాత్రం కూడా చదువుకోలేదట. ఏదో సాధించాలనే తపన మాత్రం ఉండేదట.

ఊర్లోని రాయి..

ఊర్లోని రాయి..

ఊర్లో ఉండే ఓ రాయి తమకు గురువులాంటిదని చెప్పుకొచ్చారు. ఆ రాయిని ఊర్లో ఎవ్వరూ ఎత్తలేకపోయేవారు. అయితే కొన్ని రోజుల ప్రయత్నం తరువాత ఇద్దరూ కలిసి ఆ రాయిని ఎత్తారట. అక్కడితో ఊర్లో వారంతా తమను హీరోలా చూసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇంకా ఏదైనా సాధించాలనే కోరిక బలంగా పెరిగిందని పేర్కొన్నారు.

అలా చెన్నైకి..

అలా చెన్నైకి..

ఫైట్ మాస్టర్ రాజుది రామ్ లక్ష్మణ్ వాళ్ల పక్క ఊరేనట. రామ్ లక్ష్మణ్ తండ్రి గారి స్నేహితుడి మూలానా రాజు మాస్టర్‌తో పరిచయం ఏర్పడిందట. ఓ ఆరు నెలలు రాజు మాస్టర్ వెనకా తిరగ్గా అవకాశం ఇచ్చాడట. దాంతో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్లారట.

 ప్రతీది నేర్పారు..

ప్రతీది నేర్పారు..

రాజు మాస్టర్ కేవలం ఫైట్ మాస్టర్ గురువుగానే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఎదగాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా తినాలి? ఎలా మాట్లాడుకోవాలి ప్రతి విషయాన్ని నేర్పించాడని చెప్పుకొచ్చారు. తినడం కూడా సరిగ్గా రాదని, ఓసారి భోజనానికి కూర్చున్న సమయంలో జరిగిన సంఘటనను వివరించాడు. భోజనం ఎలా చేయాలో కూడా చెప్పారని తెలిపాడు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
గట్టిగా కొట్టారు..

గట్టిగా కొట్టారు..

చిరంజీవిని త్రినేత్రుడు షూటింగ్‌లో చూశామని, అయితే బయట మామూలుగా ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడామని అయితే వెంటనే రాజు మాస్టర్ వచ్చి గట్టిగా కొట్టారని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి అని పిలుస్తారేంటిరా.. చిరంజీవి గారు లేదా అన్నయ్య గారు అని పిలవాలని చెప్పాడని అప్పటి నుంచి అలానే పిలుస్తున్నామని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X