twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నంలో నీళ్లు పోసుకుని చాలా రోజులు తాగాము.. ధీనస్థితి గురించి రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కామెంట్స్

    |

    రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని అభిమానించే, ఆరాధించే ఫైట్ మాస్టర్స్. తెలుగులో దాదాపు ప్రతీ ఒక్క హీరోతో పని చేసిన వీరు.. మాస్‌ను మెప్పించేలా యాక్షన్ సీక్వెన్స్ తీయడంలో ధిట్ట. ఓ సినిమాలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ కంపోజ్ చేశారని సాధారణ ప్రేక్షకుడు సైతం ఇట్టే గుర్తు పట్టగలరు. అదే వారి పనిలోని గొప్పదనం. తాజాగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలీతో సరదాగా షోలో తమ జీవితంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.

    టాలీవుడ్, కోలీవుడ్..

    టాలీవుడ్, కోలీవుడ్..

    రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తమిళ, తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సాధారణ ఫైట్ మాస్టర్స్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన వీరు.. హీరోలుగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిధాయకమే. తెలుగులో వీరు బస్తీమే సవాలే అనే చిత్రంలో హీరోలుగా నటించారు.

    స్టార్ కంపోజర్స్..

    స్టార్ కంపోజర్స్..

    స్టార్ హీరోల చిత్రాల్లో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసే ఫైట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా బోయపాటి చిత్రాల్లో వీరిది మరో లెవెల్. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సింది. అంతలా పేరు తెచ్చుకున్న వీరు తమ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించారట.

    అన్నం కోసమే ఇండస్ట్రీకి..

    అన్నం కోసమే ఇండస్ట్రీకి..

    ఓ సారి ఓ సినిమా షూటింగ్‌కు వెళ్తే అక్కడ అందరికీ ఐదు రకాలు వంటకాలతో కూడిన భోజనం పెట్టారట అది చూసి.. ఆ భోజనం కోసమైనా సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అప్పట్లో తినడానికి కూడా ఎంతో కష్టపడ్డామని, అన్నం వండుకుని దాంట్లో నీళ్లు పోసుకుని తాగిన రోజులు ఎన్నో ఉన్నాయని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు.

     ప్యాంట్‌కు జిప్..

    ప్యాంట్‌కు జిప్..

    ప్యాంట్‌కు జిప్ కూడా ఉంటుందని తమకు తెలియదని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పేర్కొన్నారు. ప్యాంట్ వేసుకున్న కొత్తలో జిప్ ఉంటుందని, అది పెట్టుకోవాలని తమకు తెలీదని, దాంతో చెన్నైలోని పాండి బజార్ మొత్తం అలాగే తిరిగామని నవ్వుకున్నారు.

    Recommended Video

    Ladies Not Allowed Movie Trailer
    ఊర్లో అలా..

    ఊర్లో అలా..

    తాము పుట్టిన ఊర్లో.. తమ చేతుల మీదుగా కార్యాలు జరిపించేవారని, బస్తాల్లో ధాన్యం మా చేతులతో నింపించేవారని, ఎవ్వరైనా కొత్త జంట వెళ్తుంటే ఎదురురమ్మనే వారని గుర్తు చేసుకున్నారు. రామ్-లక్ష్మణ్ అని పేరు ఉండటంతో వారు అలా చేసే వారని చెప్పుకొచ్చారు.

    English summary
    Fight masters Ram Lakshman About Their Struggles. Fight masters Ram Lakshman Are Guests In Ali Talk Show. They shared about Their Struggles At Earlier stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X