నువ్వు అంటే నేను పడాలా? ఇది నా ఇల్లే జారే జా: బిగ్ బాస్‌లో మరోసారి ఫైటింగ్

మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా హౌస్‌లో మరోసారి గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

బుధవారం ముగిసిన ఎపిసోడ్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఈ సారి బిగ్ బాస్ ఎంటర్‌టైన్‌మెంట్ షో ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఇంటిలోని సభ్యులు ఆట పాటలతో అలరించాలని అందుకే గానూ ఆడిషన్స్ ఇవ్వాలని చెప్పాడు. దీనికి శ్రీముఖి, బాబా భాస్కర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తారని అన్నాడు. ఇంటిలోని కంటెస్టెంట్లు అందరూ తమ తమ టాలెంట్‌తో జడ్జ్‌లను మెప్పించి ప్రదర్శన ఇచ్చేందుకు సెలెక్ట్ అవ్వాలని చెప్పాడు. అదే సమయంలో ఎవరి ప్రదర్శన బాగుంటే వాళ్లకు ఫిజ్ బాటిల్ ఇవ్వాలని జడ్జ్‌లకు చెప్పాడు.

Fighting Between Ali Reza, Mahesh Vitta In Bigg Boss House

ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లు ఎవరికి వచ్చిన ప్రదర్శన వాళ్లు ఇచ్చారు. దీంతో ఆడిషన్స్ ముగిశాయి.. అదే సమయంలో బుధవారం ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఇక, గురువారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇందులో మహేశ్ విట్టా - అలీ రేజా మధ్య గొడవ జరుగుతున్న దృశ్యాలు చూపించారు. అలీ ఏదో అనడం దానికి మహేశ్ ఇది నీ ఇల్లా అని ప్రశ్నించాడు. దీంతో అలీ అవును నా ఇల్లే జారే జా అంటూ సీరియస్ అయ్యాడు.

ఇక రెండు రోజుల కిందట కూడా వీళ్లిద్దరికీ గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఎలిమినేషన్ విషయమై అలీ రేజా.. బాబా భాస్కర్‌కు వివరణ ఇస్తున్నాడు. ఇంతలో మహేశ్ విట్టా మధ్యలో జోక్యం చేసుకున్నాడు. అప్పుడు అలీ నువ్వు పుల్లలు పెట్టకు అని అనడంతో మహేశ్ కూడా సీరియస్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో అషు రెడ్డి.. మహేశ్‌ను దూరంగా తీసుకొచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X