ఇమ్మాన్యుయేల్‌తో మనస్పర్ధలు .. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్, షాకింగ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ వర్ష
తెలుగు వారిని దశాబ్ధానికి పైగా అలరిస్తోన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక్కడ వచ్చిన పాపులారిటీతో వెండితెరపైనా అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి వారిలో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా ఉంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్దరూ తెలుగు లొగిళ్లకు పరిచయమయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ , ఎక్స్‌ట్రా జబర్దస్త్ సహా పలు షోలలో వర్ష , ఇమ్మాన్యుయేల్‌లు తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా జంటగానే నటించారు. స్కిట్ అయిపోయాక ఒకరిపై ఒకరు తమ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధంపై చాలా సందర్భాల్లో బయటపెట్టారు. మొన్నామధ్య ఒక స్కిట్‌లో అయితే ఏకంగా వారిద్దరి మధ్య పెళ్లి జరిగినట్లుగా కూడా చూపించారు. జబర్దస్త్‌తో పాటు మరికొన్ని షోలలోనూ కలిసి పాల్గొంటూ అలరిస్తున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ అయితే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి వర్కవుట్ చేస్తున్నాడు.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో నూతనంగా ప్రారంభమై ఓ జ్యూయెలరీ షోరూంలో వర్షతో కలిసి ఓ వీడియో చేశాడు. వర్ష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ సిల్వర్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కలిసి ఓ రోజున ఒకే కారులో వెల్లడం దుమారం రేపింది. ఇక హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే వర్ష సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అలరిస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు షాపింగ్ మాల్స్, షోరూమ్‌లో ఓపెనింగ్‌లతో బిజీగా ఉంటున్నారు వర్ష.
మరికొద్దిరోజుల్లో 2024 కాలగర్భంలో కలిసిపోనుంది. ఎన్నో ఓటములు, విజయాలు, కష్టం, సుఖం ఇలా మరెన్నో తీపి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలకనుంది. ఈ నేపథ్యంలో వర్ష కూడా ఈ ఏడాది తన జీవితంలో జరిగిన మంచి చెడుల గురించి వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్‌తో జరిగిన గొడవ గురించి బయటపెట్టింది.
ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ షోలో పాల్గొన్న ఒక్కో జంట ఈ ఏడాది బెస్ట్ మూవ్‌మెంట్స్‌తో పాటు బాధలు, కష్టాలను పంచుకోగా.. జబర్దస్త్ వర్ష కూడా ఎమోషనల్ అయ్యింది. తనకు జీవితంలో 2024 లాంటి ఏడాది మరోసారి రావొద్దని కోరుకుంది.
మనకి జీవితంలో ఎంతో ఇష్టమైన వ్యక్తితో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిందంటే అస్సలు తట్టుకోలేమని.. ఈ ఏడాది ఇమ్ముకి నాకు లెక్కలేనన్ని గొడవలు జరిగాయని వర్ష బయటపెట్టింది. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నామంటూ వర్ష చెప్పడంతో హోస్ట్ సుడిగాలి సుధీర్‌తో పాటు మిగిలిన జంటలు షాక్ అయ్యాయి. మరి అంతలా వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే డిసెంబర్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











