Bigg Boss Telugu 5 fourth week elimination: సర్వేలో వెల్లడైన కంటెస్టెంట్.. అదే నిజమవుతుందా?
బిగ్ బాస్ సీజన్ 5 టాప్ రియాలిటీ షో గా మొన్నటి వరకు రేటింగ్స్ బాగానే అందుకుంది. అయితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ చాలా నీరసంగా ఉందనే కామెంట్స్ అయితే చాలానే వసగున్నాయి. నిజానికి నాగార్జున కూడా ఇంకా ట్రాక్ లోకి అయితే రాలేదు. తప్పులు చేసిన వారిని ఆయన పెద్దగా ఏమి అనడం లేదని కేవలం ఓ వర్గం వారికి మద్దతుగా ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఇటీవల ఫిల్మీ బీట్ తెలుగు ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో ఒక ప్రత్యేకమైన ఫీడ్ బ్యాక్ అందుకుంది. బిగ్ బాస్ 5 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన పోల్స్ ద్వారా నెటిజన్లు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే ఈ వారం ఎలిమినేషన్స్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మరి వారి అంచనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

లహరి వెళ్లిపోవడం సరైన నిర్ణయమేనా?
మొదటి మూడు వారాల్లో అమ్మాయిలు ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా మొదట్లో వెళ్లిన ఇద్దరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా సరయు మొదట్లోనే బయటకు వెళ్లిపోవడం ఎవరు ఊహించలేదు. ఇక మూడవ వారంలో లహరి షారి వెళ్లిపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆమె వెళ్లిపోవడం సరైనదే అని 40% మంది చెప్పగా కాదు అని 51% తెలియజేశారు. ఇక చెప్పలేము అంటూ మరో 9% నెటిజన్లు వివరణ ఇచ్చారు.

రవి చేసింది తప్పు..
ఇక గత వారం లహరి ప్రియ విషయంలో రవి ఎలా నడుచుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ విషయంలో రవి సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేయబడ్డాడు. హౌజ్ లో కూడా దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాటర్ లో రవి అందరి ముందు క్షమాపణ కూడా చెప్పాడు. ఇక నెటిజన్లు సర్వేలో అవును తప్పు చేసినట్లు 85.25% మంది తెలియజేయగా కాదు అని మద్దతుగా 10.66% నెటిజన్లు క్లారిటీ ఇచ్చారు. ఇక చెప్పలేము అంటూ 4.1% మంది తెలియజేశారు.

సిరి, షణ్ముఖ్ కలిసి ఆడుతున్నారా?
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఒక టాపిక్ అయితే అందరిలోను చర్చలకు దారి తీస్తోంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత సిరి, షణ్ముఖ్ కలిసి ఆడుతున్నారని ఇప్పటికే సరయు కామెంట్ చేయగా.. రీసెంట్ గా లహరి కూడా వివరణ ఇచ్చింది. ఇక ఈ టాపిక్ విషయంలో సిరి కామెంట్ కరెక్ట్ అని 71.74% నెటిజన్లు తేల్చి చెప్పగా కాదు అని 21.74% మంది క్లారిటీ ఇచ్చారు. ఇక చెప్పలేము అని 6.52% మంది తెలియజేశారు.

నాగార్జున హోస్టింగ్ లో అన్యాయం?
ఇక హౌజ్ లో నాగార్జున హోస్టింగ్ పై కూడా కొన్ని ఆరోపణలు భిన్నంగా వినిపిస్తున్నాయి. కొందరు కంటెస్టెంట్స్ కు నాగార్జున సప్పర్ట్ చేటున్నారనే వాదన పై అవును అంటూ 74.51% మంది తెలుపగా కాదు అని 21.57% నెటీజన్స్ తెలియజేశారు. చెప్పలేము అంటూ 3.92% మంది తెలియజేశారు.

4వ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 5 షోలో నాలుగవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని సందేహం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక వెళ్లిపోయే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది అనే విషయంలో నెటిజన్లు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. యాంకర్ రవి వెళ్లిపోయే అవకాశం ఉందని 7.14% నెటిజన్లు ఓటు వేశారు. ఇక కాజల్ 7.79%, విజే సన్నీ 3.9%, లోబో 16.23%, ప్రియ 7.79% , సిరి 6.49%, ఆనీ మాస్టర్ 14.29%.. ఉండగా అందరికంటే ఎక్కువ ఛాన్స్ నటరాజ్ మాస్టర్ వెళ్లిపోయే అవకాశం ఉందని 36.36% నెటిజన్లు వారి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











