Bigg Boss 5 seventh week elimination: సర్వేలో కంటెస్టెంట్ పేరు వైరల్.. న్యాయంగానే జరుగుతోందా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే వాడటం అవుతోంది మొదట్లో కాస్త నీరసం గా మొదలైన ఈ షో ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మళ్లీ రేటింగ్స్ తక్కువ వచ్చాయి అనే కామెంట్స్ కూడా వచ్చాయి మధ్యలో నాగార్జున కంటెస్టెంట్స్ మధ్యలో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ టాస్కుల విషయంలో అయితే మరింత పెంచినట్లు తెలుస్తోంది ఇక ప్రేక్షకులు ఈ వారం జరిగిన పరిణామాలపై ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నారు అని విషయంలో ఒక సర్వే నిర్వహించగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో కూడా వారి పోలింగ్ ద్వారా ఒక వివరణ ఇచ్చారు

శ్వేతా వర్మ వెళ్లిపోవడం న్యాయమేనా?
ఎవరు ఊహించని విధంగా గత వారం పవర్ఫుల్ గా ఉన్నటువంటి శ్వేతా వర్మ ఎలిమినెట్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే కామెంట్స్ వచ్చాయి. ఇక 7వ వారంలో శ్వేతా వర్మ వెళ్లిపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆమె వెళ్లిపోవడం సరైనదే అని 50% మంది చెప్పగా.. కాదు అని 44.35% తెలియజేశారు. ఇక చెప్పలేము అంటూ మరో 5.22% నెటిజన్లు వివరణ ఇచ్చారు.

నామినేషన్ ప్రక్రియ సరిగా జరుగుతుందా?
ఇక గత వారం నుంచి కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు చాలా తీవ్రంగా మారుతున్నాయి. సన్నీ ఎలా నడుచుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నామినేషన్ విషయంలో అయితే కొందరు ట్రోల్ చేయబడ్డారు. హౌజ్ లో కూడా కొందరు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయితే నామినేషన్ ప్రక్రియ సరిగా జరుగుతుందా లేదా అనే విషయంలో నెటిజన్లు సరిగా జరగడం లేదు అని 67.68% మంది తెలియజేశారు. అవును అంటూ 23.23 మంది తెలుపగా.. చెప్పలేం అంటూ 9.09 మంది క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ షో ఎలా ఉంది..
7వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ 5 తెలుగు షో ఎలా కొనసాగుతోంది అనే విషయంలో కూడా ప్రేక్షకుల అభిప్రాయాలలో చాలా మార్పులు వచ్చాయి. మొదటి వారానికి ఇప్పటికి ఏ మాత్రం ఆసక్తికరంగా లేదని అంటున్నారు. బాగుంది అని కేవలం 24.58% తెలియజేయగా.. బాగాలేదు అంటూ 68.64% మంది క్లారిటీ ఇచ్చారు. ఇక చెప్పలేము అంటూ 6.78% తెలియజేశారు.
Recommended Video

7వ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 5 షోలో ఏడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక వెళ్లిపోయే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది అనే విషయంలో నెటిజన్లు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. సిరి హన్మంతు వెళ్లిపోయే అవకాశం ఉందని 17.14% నెటిజన్లు ఓటు వేశారు. ఇక జస్వంత పడాల 10.95%, లోబో 19.52%, ఆర్జే కాజల్ 9.52%, ప్రియ 20.95% , యాంకర్ రవి 3.33%, ఆనీ మాస్టర్ 17.71%, శ్రీరామచంద్ర 2.86% మంది నెటిజన్లు వారి ఓటు వేసి వీరు వెళ్లిపోయే అవకాశం ఉందని అభిప్రాయం తెలియజేశారు. అందరికంటే ఎక్కువ ఛాన్స్ ప్రియ శైలజకు వెళ్లిపోయే అవకాశం ఉందని 20.95% నెటిజన్లు వారి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











