Bigg Boss Telugu 5 week 8 elimination: ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే.. క్రేజ్ కంటెస్టెంట్‌కు ముప్పు

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుత వారంలో ఆరుగురు టాప్ కంటెస్టెంట్స్‌ నామినేషన్‌లో ఉండటంతో అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ బిగ్‌బాస్ వీక్షకులు, అభిమానుల్లో మొదలైంది. అయితే బిగ్‌బాస్ తెలుగు 5లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌పై తెలుగు ఫిల్మీబీట్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియ ఎలిమినేషన్ సరైనదేనా?

ప్రియ ఎలిమినేషన్ సరైనదేనా?


బిగ్‌బాస్ తెలుగులో షోలో మంచి కంటెంట్ ఇస్తున్న నటి ప్రియ అనూహ్యంగా షో నుంచి బయటకు వెళ్లారు. ఆమె ఎలిమినేషన్ అభిమానులకు షాక్ కలిగించింది. అయితే ఏడోవారంలో జరిగిన ప్రియ ఎలిమినేషన్ సరైనదేనా? అంటూ అడిగిన ప్రశ్నకు అవును అంటూ 62.5 శాతం మంది, 31.25 శాతం మంది సరికాదు అని, 6.25 శాతం మంది చెప్పలేం అంటూ సమాధానం చెప్పారు.

బిగ్‌బాస్ తెలుగు 5 షో ఎలా ఉందంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 షో ఎలా ఉందంటే?

గత ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ గురించి ప్రేక్షకుల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొన్నదనే విషయంపై వివరాలను సేకరించే ప్రయత్నం ఫిల్మీబీట్ చేసింది. బిగ్‌బాస్ తెలుగు 5 షో ఎలా కొనసాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది అంటూ 18.28 శాతం మంది, 74.19 శాతం మంది బాగాలేదు అంటూ ఓటు వేశారు. 7.53 శాతం మంది బిగ్‌బాస్ షో గురించి చెప్పలేమని అన్నారు.

బిగ్‌బాస్ టీఆర్పీ పడిపోవడానికి కారణం

బిగ్‌బాస్ టీఆర్పీ పడిపోవడానికి కారణం

గత కొద్ది వారాల్లో బిగ్‌బాస్ టెలివిజన్ రేటింగ్ పడిపోతున్నది. అయితే ఈ విషయంపై ప్రేక్షకుల్లో నెలకొన్న అభిప్రాయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేసింది. బిగ్‌బాస్ తెలుగు 5 రేటింగ్ పడిపోవడానికి కారణం ఏమని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు కంటెంట్ బాగాలేదు అని 45.45 శాతం, కంటెస్టెంట్లు సరిగా ఫెర్ఫార్మ్ చేయడం లేదు అని 47.47 శాతం, అంతా బాగానే ఉంది అంటూ 2.02 శాతం, చెప్పలేం అంటూ 5.05 శాతం మంది సమాధానం ఇచ్చారు.

ఎన్టీఆర్, నాని, నాగ్‌లో ఎవరు బెస్ట్ అంటే

ఎన్టీఆర్, నాని, నాగ్‌లో ఎవరు బెస్ట్ అంటే

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 5లో హోస్ట్‌గా ఎవరు బెస్ట్ అని మీరు భావిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జూనియర్ ఎన్టీఆర్‌ బెస్ట్ అని 55.67 శాతం, నానికి 15.46 శాతం, అక్కినేని నాగార్జునకు 28.87 శాతం బెస్ట్ అని ఓటు వేశారు.

నాగార్జున హోస్టింగ్ ఎలా ఉందంటే?

నాగార్జున హోస్టింగ్ ఎలా ఉందంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 షోను అక్కినేని నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 5 హోస్ట్‌గా నాగార్జున అక్కినేని ఎలా చేస్తున్నారు అనే ప్రశ్నకు 50 శాతం బాగా చేస్తున్నారు అని, 41.51 శాతం బాగా చేయడం లేదు అని, 8.49 శాతం చెప్పలేం అని ఓటు వేశారు.

8 వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

8 వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

ఇక బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 8వ వారం సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, లోబో, మానస్, యాంకర్ రవి, శ్రీరామచంద్ర నామినేట్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు 5లో 8వ వారం నామినేట్ అయిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకొంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఎక్కువ మంది అంటే 44.74 మంది లోబో అని, 17.11 శాతం సిరి హన్మంతు, 17.11 శాతం షణ్ముక్‌కు, మానస్‌కు 1.32 శాతం, యాంకర్ రవి 5.26 శాతం, శ్రీరామచంద్ర 5.92 శాతం ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X