Survey on BiggBoss Telugu 8 Elimination: కిర్రాక్ సీత ఎలిమినేషన్ కరెక్టేనా..బిగ్‌బాస్ నుంచి ఈ వీక్ ఎవరు అవుట్?
ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిల చొప్పున మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదో వారంలో 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపారు. వారు గంగవ్వ, హరితేజ, ముక్కు అవినాష్, నయని పావని, టేస్టీ తేజా, మెహబూబ్, గౌతంకృష్ణ, రోహిణి. వీరి రాకతో ది షో ఆసక్తికరంగా మారుతోంది.
ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల , ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత హౌస్‌ను వీడారు. మరి ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 8 ఎలా గడిచింది, ఎవరెవరు ఎలా చేశారు, అనే దానిపై ఫిల్మీబీట్ సర్వే నిర్వహించింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. ఆ రిజల్ట్స్ మీకోసం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఇంట్లోకి వచ్చిన సెలబ్రెటీల ఆట తీరు ఎలా ఉంది?
ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారు వచ్చిన తర్వాత బిగ్‌బాస్ ఎలా ఉంది, వారు ఎలా ఆడుతున్నారని ఫిల్మీబీట్ ప్రశ్నించింది. దీనికి బాగుందని 50 శాతం మంది అభిప్రాయపడగా.. 27.73 శాతం మంది చెప్పలేమని, 27.27 శాతం మంది బాలేదని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ నుంచి కిర్రాక్ సీత ఎలిమినేషన్ కరెక్టేనా?
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత గత వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఆమె అభిమానులను, బిగ్‌బాస్ లవర్స్‌ని బాగా నిరాశపరిచింది. ఈ క్రమంలో సీత ఎలిమినేషన్ కరెక్టేనా అని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. 52.38 శాతం మంది కరెక్ట్ కాదన్నారు. 42.86 శాతం మంది బిగ్‌బాస్ నిర్ణయాన్ని సమర్ధించగా.. 4.76 శాతం మంది చెప్పలేమని అభిప్రాయపడ్డారు.

బిగ్‌బాస్‌లో మణికంఠ ఉండటానికి అర్హుడేనా?
తొలుత ఎమోషనల్ డ్రామా ప్లే చేసి మార్కులు కొట్టేసిన మణికంఠ ఎలాగోలా బిగ్‌బాస్‌లో నెట్టుకొస్తున్నాడు. అయితే టాస్కులలో మనోడు ఫెయిల్ అవుతున్నాడు. బొక్కలు విరగ్గొట్టుకుని నేను ఇంటికి వెళ్లలేనంటూ మణికంఠ ఈ వీక్‌లో ఓ మూలకెళ్లి కూర్చొన్నాడు. ఈ నేపథ్యంలో మణికంఠ బిగ్‌బాస్‌లో ఉండటానికి అర్హుడేనా? అని ఫీల్మిబీట్ ప్రశ్నించగా.. 46.43 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. 42.86 శాతం మంది మాత్రం మణికంఠకి అర్హత లేదన్నారు. 10.71 శాత మంది సమాధానం చెప్పలేమని సైడ్ అయ్యారు.

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో ఈ వారం ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?
బిగ్‌బాస్ తెలుగు 8లో 7వ వారంలో 9 మంది నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. పృథ్వీరాజ్ హౌస్‌ను వీడతాడని 24.39 శాతం మంది అభిప్రాయపడ్డారు. గౌతమ్ కృష్ణకు 17.07 శాతం మంది, టేస్టీ తేజా 12.2 శాతం.. హరితేజ మణికంఠ వెళ్లిపోతారని 9.76 శాతం మంది పేర్కొన్నారు. యష్మి, నబీల్, ప్రేరణలు ఎలిమినేట్ అవుతారని 7.32 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిఖిల్ హౌస్‌ను వీడతాడని 4.88 శాతం మంది చెప్పారు. మరి వీరిలో ఎవరు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతారో కొద్దిగంటల్లో తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











