Survey on Bigg Boss Telugu7 రైతుబిడ్డ నిజాయితీగా ఆడుతున్నాడా? ఫిల్మీ బీట్ సర్వేలో తేలింది ఇదే!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో అట్టహాసంగా సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మరోసారి హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... అయితే ఈ వారం మరో 3 ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే తొలివారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్ల ఎంపిక గురించి అడిగిన ప్రశ్నకు నెటిజన్లు భారీగానే సమాధానాలు వచ్చాయి. Bigg Boss Telugu 7 సీజన్ తొలివారం ఎలా ముగిసిందని మీరు భావిస్తున్నారు? అనే ప్రశ్నకు.. బాగుందని 42 శాతం మంది, బాగా లేదని 40 శాతం, ఇప్పుడే చెప్పలేం అని 17 శాతం మంది చెప్పడం గమనార్హం.

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ తొలివారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావడం సమంజసమేనా?అని అడిగిన ప్రశ్నకు నెటిజన్లు క్లారిటీతో సమాధానం చెప్పారు. కరెక్ట్ 67.57 శాతం మంది జవాబు చెప్పగా.. కరెక్ట్ కాదు అంటూ 21.62 శాతం, చెప్పలేం అంటూ 10.81శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అని నెటిజన్స్ చెబున్నారు.
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ రెండోవారంలో నామినేట్ అయిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతుందని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు నెటిజన్లు పల్లవి ప్రశాంత్ 15శాతం, అమర్ దీప్ 5శాతం, యాక్టర్ శివాజీ 8శాతం, రతిక రోజ్8 శాతం, డాక్టర్ గౌతమ్ కృష్ణ 11శాతం, టేస్టీ తేజా 6 శాతం, షకీలా 35 శాతం, శోభాశెట్టి 10 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే... షకీలా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని నెటిజన్స్ భావిస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌కు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?అడిగిన ప్రశ్నకు మంచి స్పందన లభించింది. 0-5 రేటింగ్ కు 40శాతం , 5-10 శాతానికి 39 శాతం, చెప్పలేం అనే అప్షన్ కు 19శాతం మంది ఓటు వేశారు.
నామినేషన్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్‌ను ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేయడం సరైనదేనా?అని అడిగిన ప్రశ్నకు భారీ రెస్సాన్స్ లభించింది. సరైనది 50 శాతం మంది అనగా... సరికాదని... 36శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేం అని13 శాతం మంది ఓటు వేశారు.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిజాయితీగా ఆడుతున్నారని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు భారీ రెస్సాన్స్ లభించింది. అవును అని 42 శాతానికిపైగా కాదు అని 50 శాతం మంది పేర్కొ న్నారు. ఇక చెప్పలేం అని 8శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
అయితే బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో రెండోవారం ఎలిమినేషన్లో షకీలా వెళ్లిపోతుందని తెలుస్తోంది. పవర్ అస్త్రను గెలుచుకొని తొలి ఇంటి సభ్యుడిగా ఆట సందీప్ అవకాశం పొందారు. ఇక రెండో ఇంటి సభ్యుడిగా శివాజి గెలిచాడు.


Click it and Unblock the Notifications











