షోలోకి మొదటిసారి హైపర్ ఆది భార్య.. అందరి ముందు రష్మి పరువు తీసేసిన బుడ్డోడు!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. అదిరిపోయే పంచులతో స్కిట్ ను పండించి, కడుపుబ్బా నవ్వించడం హైపర్ ఆది స్టైల్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకున్నాడు ఆది. ప్రస్తుతం జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ.. ఇతర షోలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో హైలెట్ అవుతున్న ఆది మొదటి సారి తన భార్య వచ్చింది అంటూ అందరికి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్నో సార్లు స్కిట్ల రూపంలో..

ఎన్నో సార్లు స్కిట్ల రూపంలో..

టీవీ ప్రేక్షకులను అలరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. యాంకర్ అనసూయ అంటే హైపర్ ఆదికి క్రష్. తనంటే పడి చస్తాడు. అనసూయను చూడాలని, పట్టుకోవాలని, కౌగిలించుకోవాలని ఉందని ఏకంగా జబర్దస్త్ స్టేజ్ పైనే ఎన్నో సార్లు స్కిట్ల రూపంలో చెప్పాడు. అప్పట్లో వారి కామెడీ టైమింగ్ బాగా హైలెట్ అయ్యింది.

హైపర్ ఆది నిజమైన భార్య

హైపర్ ఆది నిజమైన భార్య

అయితే ఇప్పటి వరకు ఆదికి పెళ్లి కాలేదనే అంతా అనుకున్నారు. అయితే ఆది పెళ్లి వీడియో అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన క్లిప్పులు ఫేక్ అని ఆ తర్వాత తేలిపోయింది. ఏదో సినిమాలో చేసిన సీన్లు అని తెలిసింది. తాజాగా విడుదలైన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది నిజమైన భార్య అంటూ మరో డ్రామా క్రియేట్ చేశారు.

ఓ తెల్ల అమ్మాయిని

ఓ తెల్ల అమ్మాయిని

తనే నా భార్య అంటూ ఓ తెల్ల అమ్మాయిని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు హైపర్ ఆది. ఆ మహిళ ముఖానికి మాస్కు, పెద్ద సైజు గాగుల్స్ ధరించింది. హైపర్ ఆది భార్యను చూడాలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, ఆ మాస్కు తీసి నీ ముఖాన్ని చూపించాలని హైపర్ ఆది అడగ్గా.. తను మాత్రం మాస్కు తీయనని నో చెబుతుంది.

కనీసం నన్నైనా చూడనివ్వు

కనీసం నన్నైనా చూడనివ్వు

కనీసం నన్నైనా చూడనివ్వు, ఇప్పటి వరకు చూడలేదు అంటూ జోక్ వేశాడు ఆది. ఇక వారికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు రష్మి అలాగే ఇమ్మన్యుయెల్ పై ఆది నాన్ స్టాప్ కామెంట్స్ తో మరింత కామెడి పండించాడు. ఇక ఇంద్రజ పై కూడా కౌంటర్లు వేశాడు ఆది.

రష్మి పరువు పోయేలా..

రష్మి పరువు పోయేలా..

ఈ వారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ కామెడీగా, చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండనుందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. ఈ ప్రోమో చివర్లో యాంకర్ రష్మి ఒక ప్రకటన చేస్తుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఒక కొత్త టీమ్ రాబోతుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే పాట పాడిన ఒక బుడ్డోడు మాత్రం అసలు నువ్వు ఎవరు అంటూ ఆమె పరువు తీసే విధంగా మాట్లాడాడు. ఆ సీన్ కూడా హైలెట్ అయ్యింది. ఇక వీరి ఫుల్ డ్రామా ఎలా ఉంటుందో ఏప్రిల్ 2న ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.

Photos Credit:etvteluguindia YouTube

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X