సుడిగాలి సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!

Recommended Video

Anchor Rashmi And Sudheer Flexie Picture Goes Viral | Filmibeat Telugu

జబర్దస్త్ షోతో రష్మీ పాపులర్ యాంకర్ గా మారిపోయింది. రష్మీకి గ్లామర్ కూడా కలసి రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్ చేసి మెప్పించింది. రష్మీకి యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అదే విధంగా సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడి పంచ్ లు పేలుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలనే సుధీర్, రష్మీ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటుంటాయి. దీనితో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీ హాట్ టాపిక్ గా మారుతోంది.

అవాస్తవం అంటూ ఎన్నోసార్లు

అవాస్తవం అంటూ ఎన్నోసార్లు

సుధీర్, రష్మీ ప్రేమలో ఉన్నారు. వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో రష్మీ ఈ వార్తలని ఖండించింది. తనకు, సుధీర్ కి మధ్య ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అని తేల్చేసింది. తమ వృత్తిలో భాగంగా కొన్ని సార్లు అలా కనిపించాల్సి రావచ్చు. అది కేవలం అక్కడి వరకు మాత్రమే పరిమితం అని రష్మీ గతంలో తెలిపింది.

వైరల్ అవుతున్న ఫ్లెక్సీ

వైరల్ అవుతున్న ఫ్లెక్సీ


ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో సుధీర్, రష్మీ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీ ఒకటి వైరల్ అవుతోంది. తిరుపతిలో ఈ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. క్యాన్సర్ పై అవకాగాహన కల్పిస్తూ, ప్రజల్ని చైతన్య పరచడానికి కొందరు తిరుపతిలో 10కె రన్ నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 9 న జరిగే ఈ 10 కె రన్ కు రష్మీ, సుధీర్ బాబు హాజరు కాబోతున్నట్లు ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది.

ఫేక్ న్యూస్

రష్మీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ఈ ఈవెంట్ నిర్వాహకులు ఎవరూ నన్ను ఇంత వరకు సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కు నేను హాజరు కాబోతున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని రష్మీ తెలిపింది. నా అనుమతి లేకుండా ఫోటోని ఉపయోగించుకున్నారు అంటూ మండిపడింది. ఈవెంట్ నిర్వాహకులు తన ప్లెక్సీని తొలగించాలని కోరింది.

నటిగా రాణిస్తూ

నటిగా రాణిస్తూ

రష్మీ నటిగా రాణిస్తున్న గుంటూరు టాకీస్ తర్వాత అలాంటి విజయం దక్కడం లేదు. రష్మీ నటిస్తున్న చిత్రాలన్నీ నిరాశపరుస్తున్నాయి. జబర్దస్త్, ఢీ లాంటి షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడేసే రష్మీ సినిమాల్లో కూడా బోల్డ్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X