Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా రామ్ రాథోడ్.. కింగ్‌ను సర్‌ప్రైజ్ చేసిన ఫోక్ సింగర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెలబ్రెటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు కావడం విశేషం. ఆయన తెలుగు జానపద పాటలను వినసొంపుగా పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులకు జానపద కళలకు ప్రాధాన్యతను చాటి చెబుతూ ప్రస్తుత జనరేషన్ ను ఆకట్టుకునేలా పాటలు పాడుతూ ఆడుతున్నారు కూడానూ. తన రీసెంట్ సాంగ్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
రాము రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం గోపాలపూర్ ఖుర్ద్ గ్రాడం తాండలో లో జన్మించాడు. ఆయన బంజారా లంబాడీ గిరిజన జానపద గాయకుడిగా జీవితాన్ని మొదలు పెట్టారు. ఆయన తల్లిదండ్రులు పేర్లు కిషన్ నాయక్, కమలాబాయి దంపతులు. ఆయనకు 4 గురు తోబుట్టువులు కూడా ఉన్నారు. ఈయన ఐదో సంతానం కావడం విశేషం. రాము రాథోడ్ కు చిన్నప్పటి నుంచే టేప్ రికార్డర్ పాటలు, నృత్యంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇక స్కూళ్లలో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గోనే వాడు.

ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా ఆయన పాల్గొని డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరి ప్రశంసలు అందుకునే వాడు. ఆయన స్కూలింగ్ వివేకానంద పాఠశాలలో, ఇక ఇంటర్ భూత్పూర్ మండలంలో, డిగ్రీ మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి చేశాడు. ఇక ఆయనకు చిన్నప్పటి నుంచే పాటలు, డ్యాన్స్ పై చాలా ఆసక్తి. ఆయన తండ్రి కిషన్ నాయక్ కు సంగీతంపై అభిరుచి ఉండింది. అలా రామ్ రాథోడ్ కు ఫోక్ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే శక్తి లభించింది. అలా ఆయన టీనేజ్ లైఫ్ సాగింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం మారిన ట్రెండ్ కు అనుగుణంగా పాటు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వచ్చారు.
ఇంత మంచి టాలెంట్ ఉన్న రాము రాథోడ్ కు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అవకాశం వచ్చింది. అది కూడా సెలబ్రెటీ కంటెస్టెంట్ హోదాలో ఆయన హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా బిగ్ బాస్ లోకి ఆయన రీసెంట్ బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్ రానూ ముంబైకి రానూ అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్లి హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జునను కలిశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆయనకు పాటలు, ఆటలపై ఆసక్తి ఉందని చెప్పారు.
ఎప్పుడూ ఆడేవాడినని, ఇక తన పాటకు తానే ఎందుకు డ్యాన్స్ చేయకూడదని పాటలు చేయడం, ఆడటం ప్రారంభించానని నాగార్జునతో చెప్పారు. కరోనా సమయంలో పాటలు పాడటం ప్రారంభించానని చెప్పారు. అలా ప్రారంభమై ఇలా బిగ్ బాస్ వరకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇక ఆయన రానూ ముంబైకి రాను సాంగ్ యూట్యూబ్ లో 563 మిలియన్ల వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. దాంతో నాగార్జున షాక్ అయ్యారు. ఇంకొన్నాళ్ల పాటు ఆ రికార్డ్ నీ పేరుపైనే ఉంటుందని అభినందించారు.


Click it and Unblock the Notifications











