Bigg Boss Telugu season 8: విగ్గు పెట్టుకొంటే తప్పా? మహేష్ బాబు అలా చేయలేదా?

Bigg Boss Telugu season 8: బిగ్ బాస్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కింగ్ నాగార్జున,ఆ తరువాత నాగ మణికంఠ. అవునండీ బాబు.. మణికంఠ అంతలా బిగ్ బాస్ లవర్స్ ను అట్రాక్ట్ చేశాడు. సీజన్ లాంచ్ ఈవెంట్ లోనే తన ఫ్లాష్ బ్యాగ్ చెప్పి కంటెస్టెంట్లనే కాదు.. బీబీ ఆడియన్స్ ను కూడా కంటతడి పెట్టించాడు. ఇలా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు మణికంఠ.

ఇక ఎలిమేనేషన్స్ రౌండ్ లో అందరూ మనోడ్ని టార్గెట్ చేయడంతో నేడు ట్రాన్స్ పరేంట్ గా ఉంటానంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టాడు. దీంతో అతనిపై నెట్టింట్లో కామెంట్స్, ట్రోల్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. అయితే ఈ విషయంలో నాగమణికంఠకు సపోర్ట్ చేస్తూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

former Bigg Boss contestant Geethu Royal supporting Bigg Boss contestant Naga manikanta Geethu Royal video viral on social media

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్ మణికంఠ గురించి గీతు మాట్లాడుతూ..'ఎలిమినేషన్స్ లో మణికంఠ చాలా ఎమోషనలయ్యారు. ఆ తరువాత అతడు తాను ట్రాన్స్‌పరెంట్ అంటూ విగ్గు తీసేశారు. అయితే అది విగ్గు కాదు అది ఒక ఎక్స్‌టెన్షన్.. దాని బిట్ అంటారు' అని పేర్కొంది గీతూ. 'అలా విగ్గు తీసేసిన మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోయాడు, అసలు మణికంఠ మానసికంగా సరిగా లేడు, కానీ చాలా మంది రివ్యూవర్స్ ఆయన విగ్గు గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ అలా మాట్లాడటం చాలా చాలా తప్పునని, ట్రోల్స్ చేయడం మానేయండి' అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

గీతూ ఇంకా మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో ఉండాలనుకున్నప్పుడూ అందరూ తాము అందంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే.. మణికంఠకు కొంచెం హెయిర్ తక్కువగా ఉంది. దీంతో ఆ విగ్గు పెట్టుకున్నాడు. ఇందులో తప్పేముంది. కానీ, చాలా మంది విగ్గు కూడా తీసేశాడంటూ తనపై కామెంట్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చేయడం సరికాదు' అని అన్నారు.

ఆమె కంటిన్యూ చేస్తూ.. 'అంతేందుకు ప్రిన్స్ మహేష్ బాబు కూడా హెయిర్ తక్కువగా ఉందని హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ చేయించుకున్నారు. అదేం తప్పు కాదు కాదా. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందంగా కనిపించాలని అలా చేస్తారు. బిగ్ బాస్ ఒక్క ప్లాట్ ఫాం మాత్రమే.. దీని తరువాత అతనికి చాలా అవకాశాలు రావాలని వస్తారని అభిప్రాయ పడింది గీతూ.

గీతూ రాయల్ ఇంకా మాట్లాడుతూ.. మణికంఠ ముందుగానే తన దగ్గర అంత డబ్బుల్లేవన చెప్పాడు. అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్‌కి కూడా డబ్బులు లేకపోవచ్చు. అందుకే ఆయన ఉన్న దానిలో విగ్గు పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని మనం కామెడీ చేసి మాట్లాడటం సరికాదు. అది హ్యుమానిటీ కానేకాదు" అంటూ మణికంఠ పరిస్థితిని తెలియజేసింది గీతూ. అలాగే ఇన్ డైరెక్ట్ గా ఆయనకు సపోర్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కొందరూ ఆమె అభిప్రాయాన్ని ఏకీభవిస్తే.. మరికొందరు తిరస్కరిస్తున్నారు. మెయిన్ గా ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె వీడియోపై షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ రివ్యూలు చేసుకుంటే.. చేసుకో.. మణికంఠ సపోర్టు చేస్తే చేసుకో.. కానీ సంబంధం లేకుండా.. మహేష్ బాబు‌ని తీసుకవస్తే బాగోదు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. మరికొందరూ గీతు మీరు చాలా మంచిగా మనుషులు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. కానీ. ఇండస్ట్రీ గురించి మాట్లాడూ.. సెలబ్రెటీలు కూడా విగ్గులు వాడతారనీ, ఇలా హీరో పేర్లు చెప్పడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X