Bigg Boss Telugu 7: ఆ కంటెస్టెంట్ వల్ల యావర్‌కు నష్టం.. లైట్ తీసుకున్న బిగ్‌బాస్... ఎందుకంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటి షో 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో గత వారం కెప్టెన్సీ కోసం టాస్కులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక కెప్టెన్ గా విన్ అయింది. అసలు కెప్టెన్సీ టాస్కుల్లో ప్రియాంక ఫౌల్ గేమ్ ఆడటం వల్ల యావర్ కు తీవ్ర నష్టం జరిగింది. అయినా బిగ్ బాస్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక ఓ ప్లాన్ ఉందని తెలుస్తోంది. అసలు ప్రియాంకను బిగ్ బాస్ ఎందుకు అంత కాపాడుకుంటూ వస్తున్నాడు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే కొత్తగా నడుస్తోంది. ఉల్టా పుల్టా అంటూ.. పేరుకు తగ్గట్లుగానే ప్రతి వారం ప్రేక్షకులకు ఓ ట్విస్టు, షాక్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక 11వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 12వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, రతికా రోజ్, యావర్, అర్జున్ అంబటి, గౌతమ్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అశ్విని శ్రీ, అమర్ దీప్ ఉన్నారు.

Foul Game in Bigg Boss House: Yawar Lost by Priyanka Jain

ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. గోడవలు గట్టిగానే జరిగాయట. ఈరోజు నైట్ ఎపిసోడ్ లో తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో 8మంది ఉన్నారు. కెప్టెన్ అయిన ప్రియాంకతో పాటు.. శోభా శెట్టి ఈ వారం సెఫ్ అయ్యారు. ఇక 8 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక అందులోనూ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం డేంజర్ లో రతికా రోజ్, అశ్వినిీ ఉంటే ఈ ఇద్దరూ ఔట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆ విషయం పక్కన పెడితే.. 11వ వారంలో కెప్టెన్సీ టాస్కుల కోసం బిగ్ బాస్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక జైన్.. ఆ పోటీల్లో ఫౌల్ గేమ్ ఆడినట్లు తేలింది. బ్రిక్స్ తెచ్చే క్రమంలో ఆమె గడ్డి మీద నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయినా బిగ్ బాస్ లైట్ తీసుకున్నాడు. ఫౌల్ గేమ్ ఆడినట్లు నాగార్జున చెప్పినా కానీ.. అది చిన్న తప్పే అని సమర్ధించుకున్నాడు.

అయితే ప్రియాంకను మొదటి నుంచి మెచ్చుకుంటున్నాడు బిగ్ బాస్. ఈ వారం నాగార్జున చేత కూడా బాగా ఆడావ్ అంటూ చెప్పించాడు. అంతే కాదు.. ఆమెకు కెప్టెన్సీ వచ్చేలా చేశాడు బిగ్ బాస్. ఫౌల్ గేమ్ ఆడిన ప్రియాంక.. అలా ఆడటం వల్ల ఫైనల్స్ కి వెళ్లింది. అప్పుడే బిగ్ బాస్ ఆమెను ఆపి ఉంటే.. ఆమె తర్వాతి స్థానంలో ఉన్న యావర్ వెళ్లే వాడు. యావర్ అమర్ దీప్ మధ్య పోటీ నెలకొనేది. ఇక యావర్ ఒకసారి కెప్టెన్ అయ్యారు కాబట్టి.. గౌతమ్ అమర్ దీప్ కు సపోర్ట్ చేసేవాడు.

Foul Game in Bigg Boss House: Yawar Lost by Priyanka Jain

ప్రియాంక ఫౌల్ గేమ్ ఆడటం వల్ల... ఇద్దరు కంటెస్టెంట్స్ నష్టపోయారు. ఒకరు యావర్ కాగా.. అమర్. అయినా బిగ్ బాస్ లైట్ తీసుకున్నాడు. దానికి కారణం.. ఆమెకు స్టార్ మాలో ఒక బిగ్ సిరియల్ ఆఫర్ రావడం. సిరియల్ కు క్రేజ్ రావాలంటే.. ప్రియాంక బిగ్ బాస్ టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో పెట్టేందుకు బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మొన్నటి వరకు రతికా రోజ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డగా ఉండగా.. ఇప్పుడు ప్రియాంక మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X