Bigg Boss: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. వెళ్లిపోయిన వాళ్లకు మరో ఛాన్స్.. ఆ నలుగురిలో ఇద్దరు రీఎంట్రీ
రియాలిటీ షోలను ఇష్టపడే వాళ్లకు సరైన ట్రీట్ ఇస్తూ.. సుదీర్ఘ కాలంగా ఇండియాలోనే భారీ రేటింగ్ సాధిస్తోన్న కార్యక్రమంగా వెలుగొందుతోంది బిగ్ బాస్. తెలుగులోకి సాదాసీదాగానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ షోగా ఎదిగేంత రేటింగ్‌ను సాధించింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను మొదలెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వెళ్లిపోయిన వాళ్లకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు. ఆ సంగతులు మీరే చూడండి!

రేటింగ్ చాలా తక్కువగానే
ఇండియాలోని ఎన్నో భాషల్లో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు నమోదు చేసుకుంది. దీంతో ఆరో సీజన్‌ను నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా ప్రసారం చేస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఫలితంగా దీనికి రేటింగ్ చాలా తక్కువగానే నమోదు అవుతోంది.

ఫైర్ పెరిగింది... ఫిజికల్‌గా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని టాస్కులు చాలా చప్పగా సాగుతూ ఉండేవి. అందుకే దీనికి రేటింగ్ దారుణంగా వచ్చింది. దీంతో హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రతి వారం కంటెస్టెంట్లను తిడుతూ వాళ్లలో కసిని పెంచే ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు వారాలుగా ఇందులో ఫిజికల్ టాస్కులు ఇస్తున్నారు. దీంతో కంటెస్టెంట్లలో ఫైర్ పెరిగి అదిరిపోయే ప్రదర్శనను ఇస్తున్నారు.

స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన కెప్టెన్ కోసం పోటీదారులను ఎంపిక చేసేందుకు 'స్నేక్ అండ్ ల్యాడర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించారు. ఇందులో మట్టితో నిచ్చేన, పాము ఆకారాలను కట్టాల్సి ఉంటుంది. ఈ టాస్కులో గెలిచిన టీమ్ సభ్యులు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.

టాస్క్ నుంచి వాళ్లు ఔట్
కంటెస్టెంట్ల మధ్య ఎన్నో గొడవలతో ఎంతో కసిగా సాగిన 'స్నేక్ అండ్ ల్యాడర్' టాస్కుకు సంబంధించిన రెండు రౌండ్లు మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లోనే పూర్తి అయ్యాయి. ఇందులో మొత్తంగా రెండు టీమ్‌ల నుంచి రోహిత్, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, వాసంతిలు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో వీళ్లు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు.

బిగ్ ట్విస్ట్.. మరో అవకాశం
'స్నేక్ అండ్ ల్యాడర్' టాస్కు మంగళవారం ఎపిసోడ్‌లోనే పూర్తైందని చెప్పిన బిగ్ బాస్.. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ అయిపోయిన నలుగురు కంటెస్టెంట్లు రోహిత్, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, వాసంతిలకు మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. వీరిలో ఇద్దరు రీఎంట్రీ ఇవ్వొచ్చని ప్రకటించాడు.

పొరపాటున ఓడిపోయారు
'స్నేక్ అండ్ ల్యాడర్' టాస్కులో పాల్గొనే అవకాశం కోల్పోయిన రోహిత్, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, వాసంతిలకు బిగ్ బాస్ స్టిక్కర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నలుగురు ఓ బాక్స్‌లో ఉండి ఒకరికి ఒకరు స్టిక్కర్లు అంటించుకోవాల్సి ఉంటుంది. ఎవరి షర్ట్‌పై ఎక్కువ ఉంటే వాళ్లు ఔట్ అవుతారు. కానీ, ఇనాయా, వాసంతి బాక్స్ నుంచి బయటకు వెళ్లడంతో ఓడిపోయారు.

ఆ ఇద్దరు రీఎంట్రీ ఇచ్చి
స్టిక్కర్ టాస్కులో ఓడిపోయిన ఇనాయా, వాసంతిలు ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీ సత్య, రోహిత్ 'స్నేక్ అండ్ ల్యాడర్' టాస్కులో తిరిగి పాల్గొనే ఛాన్స్ పొందారు. ఇక, ఈ టాస్కులో స్నేక్ టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ సభ్యులు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. అలాగే, బంగారు మణి ఉన్న మెరీనా కూడా కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక అయింది.


Click it and Unblock the Notifications











