Four More Shots Please: బోల్డ్‌గా యువతకు క్రేజీగా.. ఆన్‌లైన్‌లో తమిళ్‌రాకర్స్ లీక్
కరోనా లాక్‌డౌన్ సమయంలో Four More Shots Please Season 2 అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం రేపుతున్నది. పూర్తిగా అడల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్ యువతను విశేషంగా ఆకట్టుకొంటున్నది. బోల్డ్, హాట్ సీన్లతో ఈ వెబ్ సిరీస్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొంత వివాదంగాను.. మరికొంత సంచలనంగా మారిన ఈ వెబ్ సిరీస్‌ను పైరసీ వెబ్‌సైట్ తమిళ రాకర్స్ లీక్ చేయడం మరో సెన్సేషన్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్ గురించి వివరాల్లోకి వెళితే..

నైతిక విలువలను పక్కన పెట్టి
అడ్డదారులు తొక్కైనా, నైతిక విలువలు తుంగలో తొక్కైనా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి, ఆస్వాదించాలనే నలుగురు యువతులు, పురుషుల కథ. దామిని (సయానీ గుప్తా) అంజనా (కృతి కుల్హారీ) సిద్ది (మాన్వీ గార్గూ), ఉమంగ్ (బానీ జే), సమర (లీసా రే) నటించిన Four More Shots Please Season 2 హాట్ హాట్ సీన్లతో యువతను ఆకర్షిస్తున్నది.

మహిళలే నిపుణులే ఎక్కువగా
Four More Shots Please Season 2 ప్రత్యేకత ఏమిటంటే.. ఎక్కువ శాతం మహిళలే సాంకేతిక నిపుణులుగా పనిచేయడం, నటీనటులుగా నటించారు. మిలింగ్ సోమన్, ప్రతీక్ బబ్బర్, నీల్ భూపాళం, సమీర్ కొచ్చర్, ప్రభల్ పంజాబీ కీలక పాత్రల్లో నటించారు. దేవిక భగత్, ఇషితా మోయిత్రా రచనా సహకారం అందించారు. అను మీనన్, నూపుర్ ఆస్థానా దర్శకత్వం వహించారు.

క్వాలిటీ పరంగా నిరాశే..
Four More Shots Please Season 1 కంటే సిరీస్ 2 కంటెంట్ పరంగాను, క్వాలిటీ పరంగాను ఆకట్టుకోవడం లేదనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నది. కథ, కథనాలు ఆసక్తిగా లేవని, సన్నివేశాలు కొత్తదనం లేదనే వాదన గట్టిగానే వస్తున్నది. అయితే లాక్‌డౌన్ వ్యవహారంతో ఎక్కువగానే ఈ సిరీస్‌కు ఆదరణ లభిస్తుందనే రిపోర్టులు వస్తున్నాయి.
Recommended Video

తమిళ రాకర్స్ లీక్
యువతను క్రేజీగా ఆకర్షిస్తున్న Four More Shots Please Season 2ను తమిళ రాకర్స్ ఆన్‌లైన్ లీక్ చేసింది. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ఎదైనా ఫర్వాలేదని తమిళ రాకర్స్ ఈ లీక్‌తో నిరూపించింది. ఇలా అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లీక్ కావడం ఓటీటీ ఫ్లాట్‌ఫాంకు పెద్ద దెబ్బే అంటున్నారు.


Click it and Unblock the Notifications











