ఆ తరువాత అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న TNR.. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే దశ తిరిగింది!

కరోనా వైరస్ ధాటికి మరో మంచి జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. TNR అనగానే అందరికి గుర్తొచ్చేది ఫ్రాంక్లీ విత్ TNR ఇంటర్వ్యూలు. ఎన్నో ఇంటర్వ్యూలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆయన గంటల తరబడి సెలబ్రెటీలతో మాట్లాడేవారు. ప్రస్తుతం డిజిటల్ తెలుగు మీడియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న యాంకర్ లలో ఆయన కూడా ఉన్నారు.

Recommended Video

Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
సహాయక దర్శకుడిగా

సహాయక దర్శకుడిగా

45 సంవత్సరాలు కకిగిన ఆయన 1976 జనవరి 09న జన్మించారు. TNR పూర్తి పేరు తుమ్మల నరసింహా రెడ్డి. ఆయన పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేశారు. ఆలీ నటించిన పిట్టల దొర అనే సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్, డిజిటల్ వరల్డ్ లోకి వచ్చారు.

నటుడిగా కూడా

నటుడిగా కూడా

అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. జార్జిరెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు వంటి సినిమాల్లో కూడా నటించారు. మొదట్లో జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ తో ఆయన పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేశారు. ఎన్టీవీలో క్రైమ్ స్టోరీస్ వంటి ఎపిసోడ్స్ ను డైరెక్ట్ చేశారు. TNR అంటే తెలియని సెలబ్రెటీలు ఉండరు. దాదాపు అందరితో ఆయన స్నేహంగా ఉంటారు.

చివరి ఇంటర్వ్యూ అదే..

చివరి ఇంటర్వ్యూ అదే..

ఐ డ్రీమ్ నుంచి TNR కు ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఫ్రాంక్లీ విత్ TNR పేరుతో ఆయన 189 ఇంటర్వ్యూ చేశారు. చివరగా ఐ డ్రీమ్ ఫౌండర్ తో ఒక ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా ఇంటర్వ్యూ ఒక గంట మాత్రమే ఎక్కువ అనుకునే కాలంలో ఆయన ఏకంగా 4గంటలకు పైగా ఇంటర్వ్యూలు చేసిన సందర్బాలు ఉన్నాయి. వచ్చిన సెలబ్రెటీలను ఇబ్బంది పెట్టకుండా చాలా ఫ్రెండ్లిగా ప్రశ్నలు అడిగేవారు.

అప్పుడే దశ తిరిగింది

అప్పుడే దశ తిరిగింది

రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి చిన్నపాటి యూ ట్యూబ్ కంటెంట్ దర్శకులను కూడా TNR ఇంటర్వ్యూ చేసేవారు. డైరెక్టర్ తేజ, RGV ఇంటర్వ్యూలతోనే ఆయన దశ తిరిగింది. టాలెంట్ ఉన్నవారిని చాలా బాగా సపోర్ట్ చేసేవారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు.

ఆయన రెమ్యునరేషన్ ఎంతంటే..

ఆయన రెమ్యునరేషన్ ఎంతంటే..

ఫ్రాంక్లీ విత్ TNR ఎంత సేపు చూసిన బోర్ కొట్టదు అనే టాక్ రావడం వల్లే ఆయన ఇంటర్వ్యూలు అంత ఎక్కువ నిడివితో ఉండేవి. ఇక ఆయన రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉండేదట. తెలుగులో ఇంటర్వ్యూ చేసే యాంకర్స్ లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ఆయన ఒకరు. ఒక్క ఇంటర్వ్యూకి దాదాపు లక్ష రూపాయలకు పైగా పారితోషికం అందుకునేవారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X