For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి పర్సనల్ వీడియో వైరల్: వేలికి ఉంగరం తొడిగించుకున్న బ్యూటీ.. కన్నీళ్లు ఆగట్లేదంటూ!

  |

  సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత దీనిని చాలా మంది తమ ఎదుగుదల కోసం వాడుకున్నారు. ఫలితంగా ఇది ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. ఇంటర్నెట్ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న వారిలో హాట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సెన్సేషన్ అయిన ఈ భామ.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉంది.

  ఇలాంటి పరిస్థితుల్లో కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన పర్సనల్ వీడియోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అషు రెడ్డి. ఇందులో ఆమె వేలికి ఉంగరం తొడిగించుకుంటూ కనిపించింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా పరిచయం.. జూనియర్ సమంతగా

  అలా పరిచయం.. జూనియర్ సమంతగా

  డబ్‌స్మాష్ వీడియోలు అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే అషు రెడ్డి కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఈ వీడియాల ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుందీ బ్యూటీ. అదే సమయంలో స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించడంతో జూనియర్ సమంతగా పేరును కూడా తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు రెండు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. అలా అషు రెడ్డి బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది.

  ఘాటు ఫొటోలతో పవన్ హీరోయిన్ రచ్చ: హద్దు దాటేసి మరీ అందాలు ఆరబోత.. చూస్తే షాక్ అవుతారు!

  అషు రెడ్డి యాక్టింగ్ కెరీర్... ఆ అవకాశం

  అషు రెడ్డి యాక్టింగ్ కెరీర్... ఆ అవకాశం

  జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డికి అప్పట్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే మూవీలో ఈ బ్యూటీ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత కూడా ఆమెకు అవకాశాలు వచ్చినా.. ఎందుకనో సినిమాలు చేయలేదు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా చాలా మంది దృష్టిని మాత్రం ఆకర్షించగలిగింది. ఫలితంగా వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది.

  పవన్ వల్ల మరింత ఫేమస్... వివాదాలు

  పవన్ వల్ల మరింత ఫేమస్... వివాదాలు

  అషు రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకోడానికి సోషల్ మీడియా కారణం అయితే.. ఆమెకు ఫాలోయింగ్ పెరగడానికి మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని కావడమే. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆ మధ్య ఓ వివాదం కూడా చెలరేగింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ.

  Intinti Gruhalakshmi August 4th Episode: నందూ సర్‌ప్రైజ్.. తులసికి గుడ్ న్యూస్.. అంతలోనే ప్రమాదం

  లవ్ ట్రాకులతో అషు రెడ్డి.. క్లారిటీ ఇస్తూనే

  లవ్ ట్రాకులతో అషు రెడ్డి.. క్లారిటీ ఇస్తూనే

  అషు రెడ్డి వ్యవహార శైలి తరచూ చర్చనీయాంశం అవుతోంది. గతంలో రాహుల్ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్' షోలో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల లైవ్ చాట్‌లో హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయినప్పటికీ అతడు టాటూ వేయించుకోవడం వంటి వాటితో వీళ్ల ట్రాక్ నిజమేనని అనుకుంటున్నారంతా.

  అలా మారిపోయిన అషు.. అదుర్స్ అనేలా

  అలా మారిపోయిన అషు.. అదుర్స్ అనేలా

  కెరీర్ ఆరంభం నుంచి ఆర్టిస్టుగా సత్తా చాటిన అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. జబర్ధస్త్ అజయ్ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇందులో రవితో కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. తద్వారా ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  వైరల్ అవుతోన్న అషు పర్సనల్ వీడియో

  వైరల్ అవుతోన్న అషు పర్సనల్ వీడియో

  అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఫ్యాన్స్‌కు దగ్గరవుతోన్న ఈ భామ.. తరచూ తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటూ ఉంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తన పర్సనల్ వీడియోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

  అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోన్న బాలయ్య హీరోయిన్: బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్

  Parari Movie Official Motion Poster || Filmibeat Telugu
  చేతికి ఉంగరం తొడిగించుకున్న అషు రెడ్డి

  చేతికి ఉంగరం తొడిగించుకున్న అషు రెడ్డి

  తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమెకు లేడీ ఫ్రెండ్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్టును అందించారు. అందులో AR అనే అక్షరాలతో చేయించిన ఉంగరం ఉంది. దీన్ని ఆమె చేతికి తొడిగింది స్నేహితురాలు. వీడియోను షేర్ చేసిన అషు రెడ్డి.. ‘మీరెప్పుడూ నన్ను ఆశ్చర్య పరుస్తూనే ఉంటున్నారు. నాకు కన్నీళ్లు ఆగడం లేదు' అంటూ క్యాప్షన్లు పెట్టుకుంది. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Very Busy in Social Media. Recently She Shared a Personal Video in her Instagram. This Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X