ప్రముఖ షోలో శృతి మించిన రొమాన్స్: వాళ్ల ముద్దులకు సిగ్గుతో తలిదించుకున్న సుమ.!

By Manoj

తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. వేరే రాష్ట్రానికి చెందిన ఆమె... అచ్చ తెలుగు మహిళలా కనిపించడమే కాదు.. వ్యవహరిస్తోంది కూడా. అందుకే ఈ యాంకర్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగానే ఆమెకు ఎన్నో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకు అనుగుణంగానే సుమ చేసే ప్రతి షో సూపర్ హిట్ అవుతోంది. ఇదిలాఉండగా... ఆమె నడిపిస్తోన్న ఓ షోలో రొమాన్స్ శృతిమించింది. తాజాగా దానికి హాజరైన జంటలు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. దీంతో సుమ చీర అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

గ్లామర్ ప్రపంచంలో.... టాలెంటెడ్ యాంకర్

గ్లామర్ ప్రపంచంలో.... టాలెంటెడ్ యాంకర్


తెలుగులో ఊహించని రీతిలో క్రేజ్‌ను సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోందామె. చాలా మంది అమ్మాయిలు గ్లామర్‌తో అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే... ఈమె మాత్రం అద్భుతమైన టాలెంట్‌తో ఛాన్స్‌లు పట్టేస్తోంది. ఈ క్రమంలోనే వరుస పెట్టి కొత్త కొత్త ప్రోగ్రామ్‌లు చేసుకుంటూ వెళ్తోంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ కా బాప్.. యాంకర్ సుమ

ఎంటర్‌టైన్‌మెంట్‌ కా బాప్.. యాంకర్ సుమ


సుమ కేవలం యాంకర్‌గానే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌కు చిరునామాగా మారింది. తన షోలను చూసే వారికి వందకు వంద శాతం వినోదాన్ని పంచేందుకు ఆమె ఎంతగానో ఆరాటపడుతుంటుంది. ఈ క్రమంలోనే గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ ఎదుటి వారిపై దండయాత్ర చేస్తోంది. దీంతో టాప్ యాంకర్ కాస్తా బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్‌ కా బాప్ అనిపించుకుంటోంది.

సుమ షోలకు అక్కడ కూడా భారీ స్పందన

సుమ షోలకు అక్కడ కూడా భారీ స్పందన


చాలా కాలంగా తెలుగు టెలివిజన్ రంగంలో తన సత్తాను చూపిస్తోన్న సుమ.. ప్రస్తుతం చాలా రకాల కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇప్పుడు చేస్తున్న షోలన్నీ మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్నాయి. అంతేకాదు, ఈ కార్యక్రమాలన్నింటికీ యూట్యూబ్‌లో కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే అత్యధికంగా వ్యూస్ రాబడుతున్నాయి.

సుమకు ఈ షో ప్రత్యేకం.. వాళ్లకు చుక్కలు

సుమకు ఈ షో ప్రత్యేకం.. వాళ్లకు చుక్కలు

ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది యాంకర్ సుమ. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో ‘క్యాష్' కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తుంటుంది.

నాలుగు జంటలు.. క్యాష్‌లో సందడే సందడి

నాలుగు జంటలు.. క్యాష్‌లో సందడే సందడి

సక్సెస్‌ఫుల్ షోగా పేరొందిన ‘క్యాష్'లోకి సెలెబ్రిటీలు రావడానికి తెగ ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగానే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సీరియల్ యాక్టర్ అస్మిత ఆమె భర్త సుధీర్... ఇంద్రనీల్ - మేఘన... రోహిత్ - మేరీనా... యశ్వంత్ - వర్షలు వచ్చారు. ఈ నాలుగు జంటలు ఎంతో సందడి చేశాయి. దీనికి సంబంధించిన ప్రోమో ట్రెండ్ అవుతోంది.

బాస్కెట్ బాల్ లీగ్... దండల లీగ్ అయింది

క్యాష్ షోలో ‘సుమ బాస్కెట్ బాల్ లీగ్' అని ఒక గేమ్ ఉంటుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌‌కు సుమ ఓ క్లిష్టమైన ప్రశ్న వేస్తుంది. దానికి ఆప్షన్లు కూడా అదే తరహాలో ఇస్తుంది. అలాగే చేతితో బాస్కెట్ బాల్ పెట్టి విసరమంటుంది. ఆ బంతి బాస్కెట్‌లో పడితే ఆన్సర్ చెప్పకర్లేదు. పడకపోతే మాత్రం చెప్పాలి. ఇప్పుడిదే ఆటను దండల లీగ్‌గా మార్చేసింది యాంకర్ సుమ.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
ముద్దులకు సిగ్గుతో తలిదించుకున్న సుమ

ముద్దులకు సిగ్గుతో తలిదించుకున్న సుమ


ఈ షోలో పాల్గొన్న అందరూ భర్తలు వాళ్ల భార్యల మెడలో దండలు వేశారు. అంతకంటే ముందు వీళ్లంతా తమ జీవిత భాగస్వామిపై ముద్దుల వర్షం కురిపించుకున్నారు. దీంతో దగ్గరుండి చూస్తున్న సుమ ‘ఏడేళ్లుగా ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు' అంటూ తన చీర కొంగును ముఖానికి అడ్డు పెట్టుకుని మరీ సిగ్గు పడిపోయింది. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X