పోక్సో కేసులో మళ్లీ అరెస్ట్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వాళ్ళను భయపెట్టేలా చేయడంతోనే?
మైనర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఆమెను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్ భార్గవ్ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతను బెయిల్ మీద విడుదల అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన తర్వాత అనుకోని రీతిలో మళ్లీ అరెస్ట్ కాబడ్డాడు. అసలు ఎందుకు అరెస్టయ్యాడు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

అలా నమ్మించి
సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో చాలామంది అమ్మాయిలకు దగ్గరై అతను వారిని శారీరకంగా లొంగదీసుకున్నాడు అని కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. టిక్ టాక్ లో అమ్మాయిలను స్టార్ చేస్తానని నమ్మబలికి తాను ఇప్పటికే టిక్ టాక్ లో స్టార్ ను కాబట్టి తనతో వీడియో చేస్తే మీరు కూడా ఫేమస్ అవుతారని ఆ అమ్మాయి లను భార్గవ్ వలలో వేసుకున్నట్టు అప్పట్లో పోలీసులు తేల్చారు.

తల్లిదండ్రులతో బేరసారాలు
ఒక మైనర్ బాలికను చెల్లి అని నమ్మించి గర్భవతిని చేసి కేసు పెట్టవద్దని భార్గవ్ సదరు బాలిక తల్లిదండ్రులతో బేరసారాలు ఆడినట్టు కూడా ప్రచారం జరిగింది. రెండు లక్షలు ఇస్తాను కేసులు పెట్టవద్దని భార్గవ్ బాలిక తల్లిదండ్రులను కోరాడని అయితే తమ కుమార్తె జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారని చెబుతున్నారు.

అన్నాచెల్లెళ్లని నమ్మించి
ముందు సదరు బాలిక భార్గవ్ ను అన్న అని సంబోధించడంతో ఆమెను భార్గవ్ కూడా చెల్లి అని సంబోధించడంతో తల్లిదండ్రులు వారిద్దరిదీ అన్నాచెల్లెళ్ల సంబంధం అని భావించి పెద్దగా పట్టించుకోకపోవడంతో అతను దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోయాడు. నమోదయింది పోస్కో చట్టం కాబట్టి భార్గవ్ కు కఠినమైన శిక్షలు అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతనికి బెయిల్ లభించింది.

నిబంధనలతో కూడిన బెయిల్
అయితే టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. అతనికి మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురి కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయినా భార్గవ్ ఆ నిబంధనలు ఉల్లంఘించాడు.

సాక్షుల్ని ప్రభావితం చేసేలా
విడుదలైన తరువాత సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం సహా సాక్షులను ప్రభావితం చేసేలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. భార్గవ్ పై మెమో ఫైల్ చేసిన దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్, కేసు విచారణలో ఉండగా సాక్షుల్ని ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటన చేసినట్లు మెమో లో పొందుపరిచారు.
Recommended Video

సెంట్రల్ జైలుకు
దీంతో నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. ఇక రిమాండ్ లో భాగంగా ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.


Click it and Unblock the Notifications











