For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది నా కథ.. డబ్బు దొబ్బెశారు, అంతా పోయింది...వీడియో రిలీజ్ చేసిన ఫన్ బకెట్ భార్గవ్!

  |

  ఒకప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీలా ఫీలయి నానా రచ్చ చేసిన ఫన్ బకెట్ భార్గవ్ ఇప్పుడు జైలు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఒకానొక సముంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, టిక్ టాక్ అంటూ అడ్డు లేకుండా చెలరేగిపోయిన భార్గవ్ ఒక మైనర్ బాలికని గర్భవతిని చేసిన కేసులో జైలు పాలయ్యాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన అతను తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

  జైలు శిక్ష

  జైలు శిక్ష

  మైనర్ బాలికని అవకాశాల పేరుతొ లొంగతీసుకుని, ఆమెను గర్భవతిని చేసిన కేసులో భార్గవ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే అతనికి బెయిల్ రావడంతో బయటకు వచ్చిన ఆయన తనకు మీ మద్దతు కావాలంటూ ఓ పోస్ట్ కూడా చేశాడు. అయితే అదలా ఉంచితే భార్గవ్ తన పరిస్థితి అంతా వివరిస్తూ ఏకంగా 20 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశాడు.

  Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

  ఇది నా కథ

  ఇది నా కథ

  "ఇది నా కథ" 24-7 డైరీ అనే పేరుతో ఈ వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఎప్పుడూ జోష్ తో కనపడే భార్గవ్ ఈ వీడియోలో గడ్డం పెంచి ఎమోషనల్ గా కనిపించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెట్ చేశాడు. భార్గవ్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తాడు అనుకుంటే ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చాడు.

  Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా

  అన్నీ పోయాయి

  అన్నీ పోయాయి

  అయితే తాను తన స్నేహితులని నమ్మి మోసపోయాను అని, చెప్పుకొచ్చాడు. నెలకి రూ.8 లక్షల దాకా సంపాదిస్తూ కూడా తాను డబ్బులు దాచుకోలేకపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తాను బయటకు వచ్చే సరికి నా జాబ్స్ అన్నీ పోయాయి అని చెప్పిన భార్గవ్ జైలులో ఉన్న సమయంలో తాను నమ్మిన వ్యక్తులే తన అకౌంట్ నుండి 12 లక్షలు డ్రా చేసేశారని చెప్పుకొచ్చాడు.

  Raj Kundra రెండు రోజుల పోలీసు రిమాండ్లో ఎలా ఉన్నాడో చూడండి!

  కొత్త జీవితం

  ఇక తన ఉపాధి మొత్తం పోయిందని చెప్పిన భార్గవ్ తాను కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని, ఈ ప్రయాణంలో తనను అందరూ ప్రోత్సహించాలని కోరాడు. నా కంటెంట్ నచ్చకపోతే చెప్పండి అంతే కానీ నెగిటివ్ గా మాత్రం కామెంట్స్ చేయకండి అంటూ భార్గవ్ చెప్పుకొచ్చాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నెలకు 8 లక్షల రూపాయలు సంపాదించినా వెనకేసుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.

  Anil Ravipudi Hilarious Fun With Vennela Kishore | Solo Brathuke So Better Interview
  నమ్మట్లేదుగా

  నమ్మట్లేదుగా

  అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వీడియో చూసిన నెటిజన్లు దారుణంగా భార్గవ్ మీద కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ చూస్తుంటే ఏ ఒక్కరూ కూడా భార్గవ్ మీద సానుభూతి కూడా చూపడం లేదని క్లారితీగా అర్ధం అవుతోంది. అతనిపై పాజిటివ్ ధోరణితో లేరని స్పష్టమవుతోంది. మరి చూడాలి ఏమవుతుందో అనేది.

  English summary
  TikTok fame Chippada Bhargav, also called Funbucket Bhargav, has been arrested by the Andhra police for allegedly raping a 14-year-old girl in Visakhapatnam. recently he released a video naming idhi na katha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X