twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అమ్మాయి తల్లి బుగ్గలు పట్టుకుని.. చనిపోవాలనుకున్నా, చంద్రబాబు బాడీ గార్డ్స్ వచ్చి.. భార్గవ్ సంచలన ఇంటర్వ్యూ

    |

    ఒక మైనర్ బాలికను రేప్ చేసి ఆమె గర్భవతి కావడానికి కారణం అయ్యాడనే ఆరోపణలతో టిక్ టాక్ స్టార్ భార్గవ్ ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదలైన భార్గవ్ తనకు మీ సపోర్ట్ కావాలి అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టగా అది వైరల్ గా మారింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన భార్గవ తన జైలు జీవితానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే

    ఆ సాహసం చేయకుండా

    ఆ సాహసం చేయకుండా

    నిజానికి భార్గవ్ 24వ తేదీన ఒక వీడియో పెట్టాడు.. యూట్యూబ్ లో తనకి ఉన్న ఛానల్ లో 'ఇది నా కథ' అంటూ ఆయన పెట్టిన వీడియో కూడా వైరల్ అయింది. కానీ ఎక్కువగా ఆయనకు ఆ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. భార్గవ్ తప్పు చేసినట్లు అందరూ భావిస్తూ ఆయనను ఏకి పడేశారు. ఎక్కడా తగ్గకుండా ఆయనను భీభత్సమైన విధంగా ట్రోల్ చేస్తూ ఉండడంతో ఆయన మరో వీడియో పెట్టడానికి కూడా సాహసించలేదు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ కోరడంతో ఆ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

    తప్పుడు కేసు కాబట్టే

    తప్పుడు కేసు కాబట్టే

    ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కావాలని నా మీద తప్పుడు కేసు పెట్టారు. నేను తప్పు చేశాను అని మీరు ఏదైతే విన్నారో, వింటున్నారో.. అది నిజం కాదని వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉందన్న ఆయన త్వరలోనే న్యాయస్థానం అన్నీ నిజాలు బయట పెడుతుందని చెప్పుకొచ్చాడు. అయితే చాలామంది తనను తిడుతున్నా సరే కొంతమంది అభిమానులు మాత్రం భార్గవ్ మీరు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకున్నారని వారందరికీ ఇదే చెబుతున్నాను నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాక మీడియాలో తాను స్పాట్ లో దొరికిన అంటూ వార్తలు ప్రసారం అయింది కానీ తనను అరెస్టు చేసింది మాత్రం తన ఇంట్లో అని చెప్పుకొచ్చాడు.. అరెస్టు చేసిన సమయంలో తన ఫోన్ అలాగే తన టీం అలాగే ల్యాప్టాప్ కెమెరా, కార్ అన్ని సీజ్ చేశారు అని వాటన్నింటినీ పరిశీలించాక వాటిలో ఏవి అనుమానాస్పదంగా లేవు కాబట్టి అవన్నీ తనకు తిరిగి ఇచ్చేశారని చెప్పుకొచ్చాడు.

    చనిపోవాలనుకున్నా

    చనిపోవాలనుకున్నా


    అయితే ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో కూడా భార్గవ్ వెకిలి నవ్వు నవ్వుతూ ఉండటంతో ఇంటర్వ్యూ కింద కూడా కామెంట్లు దారుణంగా పెట్టుకొచ్చారు నెటిజన్లు. అయితే జైలుకు వెళుతున్నప్పుడు, అరెస్టయినప్పుడు మీ ఆలోచన ఏ విధంగా ఉంది అని ప్రశ్నించగా ఇక జైలు జీవితం శాపంగా తోచిందని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనిపించిందని తెలియచేశాడు భార్గవ్. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బెయిల్ కూడా త్వరగా రాదని కానీ తాను ఏ తప్పు చేయకపోవడం వలన రెండో నెలల్లోనే బెయిల్ వచ్చిందని తెలియచేశాడు. ఇక జైలు జీవితం నుండి ఏమి నేర్చుకున్నావు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి భార్గవ్.. ఎవరిని అతిగా నమ్మకూడదు అని నేర్చుకున్నట్టు సమాధానం చెప్పాడు. అలాగే ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా అతను మంచివాడు అని వేరే వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా చెడ్డవాడు అని కూడా ముద్ర వేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు.

    ఆ మాట తప్పిస్తూ

    ఆ మాట తప్పిస్తూ

    తాను బెయిల్ మీద బయటకు వచ్చాక తన టీమ్ లో ఉన్న ఒక అమ్మాయి తల్లి తన బుగ్గలు పట్టుకుని వెళ్లిందని నిన్ను చాలా మిస్ అయ్యాం బాబు నువ్వు వచ్చావు కదా అంతా మంచిగానే ఉంటుంది అని చెప్పుకొచ్చారు అని అన్నాడు. తానేంటో వారికి తెలుసు కాబట్టి వారు అలా అన్నారని నేను ఎలాంటి వాడినో మా వాళ్ళు అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చాడు. అయితే నువ్వు అమ్మాయిల విషయంలో చెడుగా ప్రవర్తిస్తున్నారని నీ ఫ్రెండ్స్ అన్నారు కదా అంటే వాళ్ళు నిజంగా అన్నారా అని ప్రశ్నించిన భార్గవ్ ఆ తర్వాత ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. జైల్లో నిన్ను కొట్టారు అంట కదా అని ప్రశ్నిస్తే వెకిలిగా నవ్వుతూ తనను జైలులో ఎందుకు కొడతారు ? అని ప్రశ్నించాడు. పోలీసులు కేసు పెట్టడం అనేది వారి బాధ్యత కాబట్టి కేసు పెట్టారని ఆ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ధారణ జరగలేదని చెప్పుకొచ్చాడు. కేసు వాయిదాలకు తిరుగుతున్నాను అంటే కేసు దర్యాప్తు లోనే ఉందని నిజం నిలకడ మీద తెలుస్తుంది అని తాను నిర్దోషిగా బయటకు వచ్చాక కూడా మీకే ముందు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పుకొచ్చాడు.

    62 రోజులే

    62 రోజులే

    అంతేకాక జైలుకు వెళ్లిన వెంటనే ఒక శివలింగం కనిపించింది అని ఆ శివలింగం చూడగానే శివా నీ దయ నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు అంతా నీ మీదే భారం వేస్తున్నారు అని అన్నాను అని చెప్పుకొచ్చాడు. జైలులో 90 రోజుల దాకా ఉన్నారు కదా అంటే లేదని కేవలం అరవై రెండు రోజులు మాత్రమే ఉన్నానని మిగతా రోజులు తన తల్లితో కలిసి ఉన్నానని భార్గవ్ చెప్పుకొచ్చాడు. ఎక్కువగా తల్లిదండ్రులతో సమయం గడపమని మా లాయర్ అలాగే ఏసిసీ ప్రేమ్ కాజల్ మేడం చెప్పారని వారు చెప్పినట్టుగానే తాను చేస్తున్నాను అని వెల్లడించాడు. ఇక తనని ట్రోల్ చేసే వాళ్ళని మాత్రం పట్టించుకోనని పేర్కొన్న భార్గవ్. నా ఫోన్స్, ల్యాప్ టాప్, కామెరా పోలీసులు వెనక్కి ఇచ్చారని, ఇకపై నా పని మీదే నా దృష్టి ఉంటుందని భార్గవ్ తెలియచేశాడు.

    చంద్రబాబు బాడీ గార్డ్స్ వచ్చి

    చంద్రబాబు బాడీ గార్డ్స్ వచ్చి

    అయితే తన మీద నెగిటివిటీ కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుందని బయట మాత్రం తాను ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అన్నాడు. టీ తాగుదామని టీ స్టాల్ టీ స్టాల్ ఓనర్ తన తోటి సెల్ఫీ దిగి అని అన్నారు.. అలాగే తాను హైదరాబాద్ వచ్చాక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తున్నారని ఆయనతో పాటు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తనతో సెల్ఫీ తీసుకొని వెళ్ళారు అని అన్నాడు.. ఈ నెగిటివిటీ అంతా సోషల్ మీడియా లో ఉన్నది తప్ప బయట తను చాలా బాగా ఆదరిస్తున్నారని భార్గవ్ చెప్పుకొచ్చాడు.

    English summary
    Chippada Bhargav alias Funbucket Bhargav, a TikTok star who gained popularity for his video featuring OMG girl Nithya, was arrested by the Andhra Pradesh Police. in a recent interview Bhargav Revealed Real Facts About His Arrest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X