ఢీ వేదికపై క్రికెట్ కామెంట్స్ వివాదం... ఆపు బే అంటూ హైపర్ ఆదిపై అనిల్ రావిపూడి ఫైర్
బుల్లితెరపై ప్రసారమవుతున్న పాపులర్ డాన్స్ షో ఢీ సీజన్ 17 చివరి దశకు చేరుకుంది. మే 29న ఈ షోకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. తాజాగా ఈ ఫినాలేకు సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేయగా, అందులో అనిల్ రావిపూడి క్రికెట్ కామెంట్స్ గురించి హైపర్ ఆది పంచ్ వేయడం, డైరెక్టర్ ఫైర్ అవ్వడం కనిపించింది. వీళ్ళిద్దరి మధ్య ఈ షోలో జరిగిన వివాదంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో గ్రాండ్ ఫినాలేకు వర్షిని, ఆదర్శ్ తో పాటే శ్వేత నాయుడు కూడా కనిపించింది. ఫైనల్స్ లో ఈ ముగ్గురు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టినట్టు తెలుస్తోంది. రియల్ లైఫ్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ముగ్గురు కంటెస్టెంట్లు.

ఇక గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని గెస్ట్ గా తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హైపర్ ఆది ఒకరిపై ఒకరు వేసుకున్న పంచ్ లు ఫన్నీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి ఎంట్రీ ఇవ్వడమే ఓ పెద్ద సింహాసనంపై, పక్కనే రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చాడు.
దీంతో హైపర్ ఆది ఆ సింహానికి తెలిస్తే ఏం అనరా అంటూ బాలయ్య ఫోటోను చూపిస్తూ అనిల్ రావిపూడిని అడిగాడు. చెబుతావా ఏంటి ? అని అనిల్ రావిపూడి అడగ్గా, ఆయన చూడడా ఏంటి అంటూ హైపర్ ఆది పంచ్ వేశాడు. ఇక ప్రోమో చివర్లో వీళ్ళిద్దరి మధ్య క్రికెట్ కామెంట్స్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చింది.
హైపర్ ఆది అన్నా ఇంత టెన్షన్ లో అడగొచ్చు లేదో గాని మియావ్ మియావ్ డైలాగ్ చెప్పరా? అని అడిగాడు. వెంటనే అనిల్ నాకు మైక్ మడత పెట్టి అని అనాలని ఉంది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. తరువాత ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోతాయా అంటూ స్టార్ట్ చేశాడు ఆది.
ఆది డైలాగ్ ను పూర్తి చేయక ముందే అనిల్ రావిపూడి అందుకుని ఆపవయ్యా అంటూ ఫైర్ అయ్యాడు. అంటే మిమ్మల్ని కవర్ చేద్దామని అని ఆది చెప్పబోతే.. నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నాను. బ్యాటింగ్ మామూలుగా లేదక్కడ అంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు అనిల్ రావిపూడి.
సరే మా ఢీ షోని చూడండి అని చెప్తాను అంటే... అదేదో వాళ్ళు ఖాళీ టైంలో చూసుకుంటారు. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్ళకండయ్యా... వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు" అంటూ వరుసగా పంచులు వేసి తెగ నవ్వించారు. దీంతో ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే లేటెస్ట్ ప్రోమో తెగ వైరల్ అవుతుంది. మే 29న ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











