twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 3పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్... నవ్వకుండా ఉండలేరు!

    |

    తెలుగు టీవీ రంగంలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా 3వ సీజన్లోకి ఎంటరైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఈ షోలో అడుగు పెట్టారు. సకల సౌకర్యాలు ఉన్న జైలు లాంటి ఈ ఇంట్లో అడుగడుగునా కెమెరాల మధ్య 100 రోజుల పాటు ప్రేక్షకుల మద్దతుతో ఎవరు చివరి వరకు కొనసాగుతారో వారు విజేతగా నిలుస్తారు.

    ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు. షో ప్రారంభమైన తర్వాత బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ దర్శనమిస్తున్నాయి. అవి చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.

    నాగార్జున లేడీ కంటెస్టెంట్ల పట్ల ఇలా...

    నాగార్జున లేడీ కంటెస్టెంట్లకు మాత్రమే హగ్గులు ఇచ్చారు. మేల్ కంటెస్టెంట్లతో అంటీ ముట్టనట్లే వ్యవహరించారు అని చెబుతూ..... అత్తారింటికిదారేది సినిమాలోని ఓ కామెడీ సీన్ నాగార్జునపై సర్వ్కులేట్ చేస్తున్నారు నెటిజన్లు.

    జాఫర్, హేమ ఇలా మాట్లాడుకుంటారు...

    బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ సారి టీవీ 9 రిపోర్టర్ జాఫర్, నటి హేమ కూడా ఎంటరయ్యారు. ఇంట్లో వీరు ఎలా మాట్లాడుకుంటారో వివరిస్తూ... కొందరు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేయడం బిగ్ బాస్ అభిమానులను నవ్విస్తోంది.

    శ్రీముఖి అభిమానుల పరిస్థితి ప్రస్తుతం ఇదీ...

    శ్రీముఖి అభిమానుల పరిస్థితి ఇపుడు ఇదీ... అంటూ రాహుల్ రామకృష్ణ ఫన్నీ ఇమేజ్ షేర్ చేస్తున్నారు. అన్నా శ్రీముఖి ఎక్కడ? అన్నా శ్రీముఖి ఎప్పుడు వస్తుంది? అన్నా శ్రీముఖి ఉందా? లేదా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారని ఈ మీమ్స్ పరమార్థం.

    హెల్దీగా ట్రోల్ చేస్తూ షో ఎంజాయ్ చేయండి

    మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్ చేయండి, నచ్చని కంటెస్టెంట్స్ నచ్చలేదని చెప్పండి ఫర్లేదు. అంతే కానీ ఆర్మీలు, నేవీలు అని పేర్లు పెట్టి మిగిలిన కంటెస్టెంట్లను బూతులు తిట్టడం మానండి...హెల్దీగా ట్రోల్ చేస్తూ షో ఎంజాయ్ చేయండి అని కొందరు సూచిస్తున్నారు.

    బ్రహ్మీ రియాక్షన్లు ఫన్నీగా..

    బిగ్ బాస్ షోపై మీమ్స్ ఎక్కువగా బ్రహ్మీ రియాక్షన్లతోనే జరుగుతుండటం గమనార్హం. ఇది నెటిజన్లకు మంచి వినోదం పంచుతోంది.

    English summary
    Funny memes on Bigg Boss Telugu 3. Bigg Boss Telugu season 3 hosted by Nagarjuna . The much-awaited show begins with all the right degree of pomp and dazzle as King Nagarjuna brings the house down.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X