నేను సింగిల్‌గా ఉండిపోవడానికి కారణం దేవీశ్రీ ప్రసాద్.. సీక్రెట్ రీవిల్ చేసిన హైపర్ ఆది!
జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్లలో హైపర్ ఆది. తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ప్రేక్షకులను అలరించి హైపర్ ఆది.. తాను ఎందుకు సింగిల్ గా ఉండిపోయాడో బయటపెట్టాడు. తాను సింగిల్ గా ఉండిపోవడానికి కారణం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంటూ బహిరంగంగా చెప్పుకువచ్చారు. అసలు హైపర్ ఆది సింగిల్ గా ఉండేందుకు, దేవిశ్రీ ప్రసాద్ ఎలా కారణం అయ్యాడు..?అంతలా ఏం చేశారు అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
నెట్టింట వైరల్...
గామా తెలుగు సినిమా అవార్డ్స్ నాలుగవ ఎడిషన్ మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందించారు. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

పాటతో ఉత్సాహం..
అయితే అందులో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తాను సింగిల్ గా ఉండిపోవడానికి గల కారణాన్ని రివిల్ చేశారు. తను పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండేందుకు కారణం దేవిశ్రీ ప్రసాద్ అంటూ బహిరంగంగా చెప్పుకువచ్చాడు. అసలు విషయం ఏంటంటే.. ప్రోమోలో యాంకర్ సుమ, హైపర్ ఆది సహా పలువురు సందడి చేశారు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో రాహుల్ సిప్లిగంజ్ తన పాటతో అలరించాడు. దసరా సినిమాలోని ఇచ్చి పడేద్దాం సాంగ్ పడి ఉత్సాహం నింపాడు.
కల్కి అప్డేట్...
ఆ తర్వాత చంద్ర బోస్ గామ అవార్డును అందుకుంటాడు. గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు ఇది పదకొండవ పురస్కారం అంటూ చెప్పుకువస్తాడు. మరోవైపు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ను కల్కి అప్డేట్ అడుగుతుంది యాంకర్ సుమ. దానికి ఆయన నవ్వి ఊరుకుంటాడు. మరి కల్కి అప్డేట్ ఇచ్చాడా లేదా అనేది పూర్తి ఎపిసోడ్ వచ్చాకే తెలుస్తుంది. ఆయనతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం ఈ అవార్డులను అందుకుంటారు.

సింగిల్ గా ఉండేందుకు కారణం..
ఇక తర్వాత దేవి శ్రీ ప్రసాద్ అవార్డు అందుకునేందుకు వస్తే.. హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒకసారి వన్ సైడ్ లవ్ బెటర్ అంటారు.. ఇంకోసారి లవ్ చేయాలా వద్దా అంటారు. అది ఏం చేయాలో తెలియక సింగిల్ గా ఉండిపోయా అన్నా... అంటూ దేవీతో హైపర్ ఆది అంటాడు. హైపర్ ఆది కామెంట్స్ విన్న దేవి శ్రీ.. మరి నేను అంటూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత చివరన ఫరియా అబ్దుల్లా కు అవార్డు రావడంతో మురిసిపోతుంది. ఇలా ఆధ్యంతం ప్రోమో ఆకట్టుకుంది.
కామెంట్స్ వైరల్...
ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ వల్లే సింగిల్ గా హైపర్ ఆది ఉండిపోయారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఆర్య సినిమాలో వన్ సైడ్ లవ్ బెటర్ అంటూ పాటలో చెప్పుకు రాగా.. కుమారీ 21ఎఫ్ చిత్రంలో లవ్ చేయాలా వద్దా అంటూ కన్ఫూజన్లో పెట్టారని నెటిజన్స్ ఈ వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోను చూడకపోతే మీరు ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











