బిగ్ బాస్‌పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. కండిషన్స్ పెట్టిన కామెడీ స్టార్.. చివరకు!

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్‌కి సంబందించి రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో హోస్ట్, పార్టిసిపెంట్స్ గురించిన విషయాలు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. తెలుగు బిగ్ బాస్‌కి సంబంధించి గత రెండు సీజన్లు ఫుల్ సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది బుల్లితెర లోకం. అయితే తాజా సమాచారం మేరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోయే పార్టిసిపెంట్ లిస్టులో నిర్మాత, కామెడీ స్టార్ బండ్ల గణేష్ కూడా చేరారని తెలుస్తోంది.

కమెడియన్ గా సినిమా చేసి, ఆ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్.. మొన్నటి ఎలక్షన్స్ కాలంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాడు. అయితే ప్రజల నుంచి ఆయన ఊహించిన దానికి భిన్నమైన తీర్పు రావడంతో మెల్లగా సైలెంట్ అయ్యాడు బండ్ల గణేష్. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం సినిమా నిర్మాణాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల కన్ను బండ్ల గణేష్ పై పడింది.

Ganesh Babu Will Participate in Bigg Boss season 3 ?

తనదైన టైమింగ్ మాటలతో ఆకట్టుకోగల సత్తా బండ్ల గణేష్‌ది. కాబట్టి ఆయన ఉంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండే సందడే వేరు అని భావించిన నిర్వాహకులు ఆయన్ను సంప్రదించగా.. లేని పోనీ కండీషన్స్ పెట్టాడట బండ్ల గణేష్‌. బిగ్ బాస్‌ హౌస్‌లో ఉన్నా కూడా తనకు వారంలో రెండు మూడు సార్లు అయినా ఫోన్ ఇవ్వాలని.. తన కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేలా తనకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అది బిగ్ బాస్ రూల్స్‌కి విరుధం కాబట్టి నిర్వాహకులు ఆయన పెట్టిన డిమాండ్స్ అంగీకరించలేదట. దీంతో బిగ్ బాస్ హౌస్ లో బండ్ల గణేష్ ఎంట్రీపై సందిగ్ధం నెలకొంది.

కాగా ఈ షోలో హోస్ట్ గా నాగార్జున చేయబోతున్నారని తెలుస్తోంది. పార్టిసిపెంట్స్ గా రేణు దేశాయ్, కేఏపాల్, బిత్తిరి సత్తి, సావిత్రి, శ్రీముఖి, ఉదయ భాను, వరుణ్ సందేశ్ ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బాస్ సీజన్ 3 నిర్వాహకుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X