బయటపడిన రష్మీ గౌతమ్ నిజస్వరూపం: సీక్రెట్‌గా అలాంటి పని.. లీక్ చేసి షాకిచ్చిన గణేష్ మాస్టర్
ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. అందానికి అందం.. హోస్టింగ్‌కు హోస్టింగ్ చేస్తూ చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. దాదాపు ఏడేళ్లుగా ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్‌తో దూసుకుపోతోంది. అదే సమయంలో విభిన్నమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్.. ఓ టాప్ సీక్రెట్ లీక్ చేసి రష్మీ గౌతమ్ నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా మొదలైన కెరీర్.. రెండింటితోనే సరిపెట్టి
తెలుగు బుల్లితెరపై దూసుకుపోతోన్న షోలలో జబర్ధస్త్ ఒకటి. దీని ద్వారానే రష్మీ గౌతమ్ బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా ఆమెకు ఎన్నో ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, జబర్ధస్త్‌తో పాటు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో మాత్రమే పని చేస్తోంది. అయినప్పటికీ బాగానే సంపాదిస్తోంది.

అదొక్కటి తప్ప అన్నీ నిరాశనే మిగిల్చాయి
బుల్లితెరపై అద్భుతమైన క్రేజ్‌ను అందుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును దక్కించుకోలేకపోయింది. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. ఇందులో ఆమె హాట్ షో చేసి ఈ ఫలితాన్ని రాబట్టింది. మిగిలిన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా యావరేజ్ టాక్‌ను కూడా తెచ్చుకోలేదు.

సుధీర్‌తో లవ్ ట్రాక్.. వివాహం కూడా అంటూ
రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నదో... అంతకంటే ఎక్కువ శాతం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ వల్ల సంపాదించుకుంది. అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఖండించినా ప్రచారం ఆగడం లేదు.

ఏమీ లేదంటూనే రచ్చ చేస్తున్న యాంకర్
సుడిగాలి సుధీర్‌తో దాదాపు ఐదారేళ్లుగా ట్రాక్ నడుపుతోంది రష్మీ గౌతమ్. దీంతో ఒంటరిగా కంటే జంటగానే ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తరచూ అతడితో ఏదో ఒక రొమాంటిక్ యాక్ట్ చేస్తూనే ఉంది. మా ఇద్దరి మధ్య ఏమీ లేదని, స్నేహితులుగానే ఉంటున్నామని చెబుతోందామె. కానీ, షోలు, ఈవెంట్లలో మాత్రం సుధీర్‌తో రచ్చ చేస్తోంది యాంకర్ రష్మి.

ఢీ షోలో కష్టాలు చెప్పుకున్న కొరియోగ్రాఫర్
బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'ఢీ'. ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న 'ఢీ' షో.. పదమూడో సీజన్‌ను కూడా ప్రారంభించింది. 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో తాజాగా సాయి అనే కొరియోగ్రాఫర్‌కు అప్పులు ఉన్నాయని చెప్పి స్టేజ్‌పైనే బాధ పడ్డాడు.

అతడికి సహాయం అందించిన గణేష్ మాస్టర్
కొరియోగ్రాఫర్‌కు కష్టాలు ఉన్నాయని తెలుసుకున్న జడ్జ్ గణేష్ మాస్టర్.. 'నీకు అప్పు ఎంత ఉంది' అని అడిగాడు. దానికి అతడు నాలుగు లక్షల రూపాయలు అని చెప్పాడు. వెంటనే మాస్టర్ 'షో అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అమౌంట్ తీసుకుపో' అని సహాయం చేశాడు. ఆ తర్వాత తన గురువు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదర్శంతోనే ఈ పని చేసినట్లు గణేష్ మాస్టర్ చెప్పాడు.
Recommended Video

రష్మీ గురించి కూడా... మేటర్ లీక్ చేశాడుగా
ఇది జరిగిన కొద్ది సేపటికి గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సాయికి నేను నాలుగు లక్షలు ఇస్తానని చెప్పాను. అలాగే, రష్మీ మేడం కూడా లక్ష ఇస్తున్నారు. కానీ, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నారు. అయితే, మంచి పని చేసినప్పుడు నలుగురికి తెలిస్తేనే మంచిది మేడమ్' అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నిలబడి చప్పట్లు కొడుతూ రష్మీని అభినందించారు.


Click it and Unblock the Notifications











