For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్ మాస్టర్ ఆగ్రహం: పవన్ కల్యాణ్ పేరు వాడుతూ షాకింగ్‌గా!

  |

  బుల్లితెరపై ఎక్కువ ఆదరణను అందుకునే షోలలో డ్యాన్స్ ఆధారంగా నడిచే కార్యక్రమాలు ముందుంటాయి. దేశంలోని పలు భాషల్లో ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్‌లు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని టీఆర్పీ రేసులో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో కూడా కొన్నేళ్ల క్రితం ప్రారంభమై.. విజయవంతంగా ప్రసారం అవుతోన్న షో 'ఢీ'. దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు పోతోంది.

  ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పదమూడో సీజన్‌ను ప్రసారం అవుతోంది. ఇక, ఈ షోలో భాగంగా అందులో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పేరును వాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

  అన్నింట్లో మన డ్యాన్స్ షోకే ఆదరణ

  అన్నింట్లో మన డ్యాన్స్ షోకే ఆదరణ

  ఇండియా మొత్తంలో చాలా భాషల్లో డ్యాన్స్ షోలు ప్రసారం అయినప్పటికీ.. తెలుగులో వచ్చే ‘ఢీ'కు మాత్రం మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. దీనికి కారణం ఈ షోలో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఎంతో మంది కంటెస్టెంట్లు డ్యాన్సర్లు పాల్గొంటుండడమే. అదే సమయంలో పక్క రాష్ట్రాలకు చెందిన కొరియోగ్రాఫర్లు కూడా దీని కోసం పని చేస్తున్నారు.

  అలాగే, ఇందులో మాత్రమే అన్ని హంగులు కనిపిస్తుంటాయి. అందుకే ఈటీవీలో రన్ అవుతోన్న ‘ఢీ' అన్నింట్లోనూ బెస్ట్ అని నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటోంది.

  బోల్డు ఫొటోలతో యాంకర్ మంజూష రచ్చ: వామ్మో ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటేది వాళ్లే

  అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటేది వాళ్లే

  ‘ఢీ' షో దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడానికి టీఆర్పీ రేటింగ్ ఒక్కటే కారణం కాదు. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు, ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీలకు పరిచయం అవ్వడమే. మరీ ముఖ్యంగా సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో శేఖర్ మాస్టర్, గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్, రఘు మాస్టర్, యశ్వంత్ మాస్టర్లు వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. వీళ్లంతా దక్షిణాదిలోని ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తున్నారు. ఇక, ఈ షోలో చేసిన సాయి పల్లవి ఇప్పుడు స్టార్ అయిపోయింది.

  భారీ ఆదరణ.. వరుసగా పదమూడు

  భారీ ఆదరణ.. వరుసగా పదమూడు

  ‘ఢీ' డ్యాన్స్ షోకు వస్తున్న ఆదరణకు అనుగుణంగానే నిర్వహకులు వరుసగా సీజన్లను మొదలు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇది విజయవంతంగా పన్నెండు సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే ఈ మధ్యనే పదమూడోది కూడా ప్రసారం అవుతోంది. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు.

  దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది ఆకర్షితులు అవుతున్నారు. తద్వారా ఈ షోను మరింతగా ఆదరిస్తున్నారు.

  జబర్ధస్త్‌‌లో ఆ టీమ్ లీడర్‌కు అవమానం: అన్యాయం జరిగిందని కన్నీరు.. వాళ్లిద్దరిపై సంచలన ఆరోపణలు

  రెండు జంటలు... కొత్త జడ్జ్‌తో మజా

  రెండు జంటలు... కొత్త జడ్జ్‌తో మజా

  ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' అనే పేరిట ప్రసారం అవుతోన్న పదమూడో సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. అబ్బాయిల టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మెంటర్లుగా.. అమ్మాయిల జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దీనికి జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోలో కంటెస్టెంట్ల డ్యాన్సులు ఏమో కానీ.. వీళ్లందరూ చేసే కామెడీ మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పుకోవచ్చు.

  వచ్చే వారం 6 సినిమాల స్పెషల్‌గా

  వచ్చే వారం 6 సినిమాల స్పెషల్‌గా

  వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ‘ఢీ' షోలో బ్లాక్ బస్టర్ మూవీస్ స్పెషల్ జరగబోతుంది. ఇందులో గణేష్ మాస్టర్ జానీగా, ప్రియమణి మిత్రవిందగా, పూర్ణ అరుంధతిగా, సుడిగాలి సుధీర్ ఇంద్రగా, రష్మీ గౌతమ్ జెస్సీగా, హైపర్ ఆది కాలభైరవగా, దీపిక పిల్లి అతిలోక సుందరిగా, యాంకర్ ప్రదీప్ మాచిరాజు జైగా గెటప్‌లు వేసుకుని ఎంట్రీ ఇచ్చారు.

  ఈ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చే బుధవారం ఆరు సినిమాలకు సంబంధించిన సాంగ్స్‌ థీమ్‌కు కంటెస్టెంట్లు డ్యాన్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో నెటిజన్ల మెప్పు పొందింది. ఫలితంగా తెగ వైరల్ అవుతోంది.

  జాకెట్ తీసేసి బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో: అందాల ఆరబోతలో పట్టా తీసుకుందా ఏంటి!

  పవన్ కల్యాణ్‌కు జై కొట్టిన మాస్టర్

  పవన్ కల్యాణ్‌కు జై కొట్టిన మాస్టర్

  ఈ ఎపిసోడ్‌లో భాగంగా ఓ కంటెస్టెంట్ ‘వకీల్ సాబ్' సినిమా థీమ్‌ను తీసుకుని డ్యాన్స్ చేశాడు. ఇందులో పవన్ కల్యాణ్ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక, ఇందులో పవర్ స్టార్ ఆడవాళ్లపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి చెప్పే డైలాగులకు కూడా సదరు కంటెస్టెంట్ డ్యాన్స్ మూమెంట్స్ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత గణేష్ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయన ఆవేదదను వకీల్ సాబ్ రూపంలో చూపించారు' అంటూ బిగ్గరగా అరిచాడు. దీంతో అందరూ చప్పట్లు కొట్టారు.

  Mahesh Babu కోసం Malayalam హీరోయిన్ | Ssmb 28 Upadate | Filmibeat Telugu
  దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్

  దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్

  చివర్లో గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘అరెయ్ దొంగ ల*కొడుకుల్లారా.. చిన్న పిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు' అంటూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న వాళ్లపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు, అక్కడే వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో పక్కనే ఉన్న పూర్ణ, ప్రియమణి ఆయనను ఓదార్చారు. ఆ సమయంలోనే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ గౌతమ్ సహా అక్కడున్న చాలా మంది ఏడవడాన్ని ప్రోమోలో చూపించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగనుందని ఈ ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.

  English summary
  Dhee is an Indian dance reality show. This Was telecasting in ETV. In Latest Promo.. Ganesh Master Shocking Comments on Rapes. This is Gonna be Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X