బిగ్ బాస్2: ఈ వారం ఎలిమినేషన్ గురించి లీక్.. కౌశల్ ఎలాగైనా, మూడింది అతడికేనా!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Elimination This Week Is Very Intresting

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. మరి కొన్ని వారాల్లోనే విజేత ఎవరో తేలిపోనుంది. కానీ ఈ మధ్యలో ఇంటినుంచి ఎవరు బయటకు వెళుతారని ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొని ఉంది. హౌస్ లో హాట్ పేవరెట్ గా ఉన్న కౌశల్ కు నామినేషన్ దెబ్బలు తగులుతున్నాయి. గీత మాధురి చెలరేగిపోతోంది. తనీష్ కూడా టైటిల్ బరిలో ముందువరుసలోనే ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐదుగురు

ఐదుగురు

ఈ వారం నామినేషన్ లో కౌశల్ తో పాటు నూతన్ నాయుడు, అమిత్, సామ్రాట్, గణేష్ ఉన్నారు. వీరిలో ఈ ఆదివారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది.

 వాళ్లిద్దరూ కూడా

వాళ్లిద్దరూ కూడా

ఈ బిగ్ బాస్ లో గణేష్ దాదాపుగా ప్రతివారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్ నుంచి బయటపడుతున్నాడు. గణేష్ సంగతి పక్కన పెడితే హౌస్ లో ఇద్దరు లక్కీ ఫెలోస్ ఉన్నారు. వారే అమిత్, సామ్రాట్. అసలు నామినేషన్ ఉచ్చులోనే పడకుండా వీరిద్దరూ అదృష్టం కొద్దీ ఇప్పటివరకు నెట్టుకుని వచ్చారు.

ఈ వారం కూడా

ఈ వారం కూడా

అమిత్, సామ్రాట్ ప్రస్తుతం ఇద్దరూ నామినేషన్ లో ఉన్నారు. ఇప్పటికి వీరిద్దరికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం గణేష్ మీద ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్లు తెలుస్తోంది.

వ్యతిరేకంగా

వ్యతిరేకంగా

ఇటీవల కాలంలో హౌస్ లో కౌశల్ విషయంలో గణేష్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. మిగిలిన ఇంటి సభ్యుల విషయంలో అతడి వైఖరి సాఫ్ట్ గానే ఉంది. ఈ అంశం గణేష్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌశల్ ఎలిమినేషన్ ఎలాగు ఉండకపోవచ్చు.

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు

నూతన్ నాయుడుకి బాయట కౌశల్ ఆర్మీ నుంచి మద్దత్తు లభిస్తోంది. ఇది ఆయనకు కలసి వచ్చే అవకాశం. ఈ ఐదుగురిలో గణేష్ ఒక్కడికే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు అతడు సానుభూతితో ఎలిమినేషన్ నుంచి తప్పుంచుకుంటున్నాడనే అంశం కూడా నెగిటివ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X