twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్పత్రిలో చేరిన గంగవ్వ: ఆందోళనలో అభిమానులు.. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటంటే!

    |

    సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఊహించని రీతిలో పాపులర్ అయిపోయారు. అందులో చాలా మంది టాప్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో సహజ నటి గంగవ్వ ఒకరు. చాలా కాలంగా వైవిధ్యమైన వీడియోలతో సందడి చేస్తోన్న ఆమె.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతున్నారు. ఇక, ఇటీవలే బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్న ఈ పెద్దావిడ.. ఆ నిర్వహకుల సహకారంతో కొత్త ఇంటిని కూడా నిర్మించుకోగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో గంగవ్వ తాజాగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు మీకోసం!

    గంగవ్వ పాపులర్ అవడానికి కారణం ఇదే

    గంగవ్వ పాపులర్ అవడానికి కారణం ఇదే

    తెలంగాణకు చెందిన కొందరు కుర్రాళ్లు యూట్యూబ్‌లో 'మై విలేజ్ షో' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గంగవ్వకు ఓ పాత్ర ఇచ్చి చేయించారు. అది బాగా పండడంతో ఆమెను కంటిన్యూ చేశారు. దీంతో అరవై ఏళ్ల వయసులో కుర్రాళ్లతో కలిసి ఆమె చేసే సందడికి ఎంతో మంది అభిమానులుగా మారారు. పల్లెటూరి భాషను అందరికీ పరిచయం చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

    బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. ఆమె రాకతో

    బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. ఆమె రాకతో

    'మై విలేజ్ షో' వల్ల సెన్సేషన్‌గా మారిపోయిన గంగవ్వ.. కొన్ని సినిమాల్లోనూ నటించారు. అలాగే, పలు టీవీ కార్యక్రమాల్లో భాగమయ్యారు. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్పెషల్ కంటెస్టెంట్‌గా లోపలికి వెళ్లిన ఆమె.. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడ్డారు. ఈ క్రమంలోనే కుర్ర కంటెస్టెంట్లతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేశారు.

    ఓట్ల వల్ల కాదు... తనకు తానే వచ్చేసింది

    ఓట్ల వల్ల కాదు... తనకు తానే వచ్చేసింది

    బిగ్ బాస్ హౌస్‌లో గంగవ్వ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కుర్రాళ్లంతా కండబలంతో పోటీ పడుతోంటే.. ఆమె మాత్రం తెలివిగా ఆడి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దీంతో పలుమార్లు నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అయ్యారు. ఇలా చాలా రోజుల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయారు. దీంతో తనకు తానే హౌస్‌ నుంచి వచ్చేశారు.

    బిగ్ బాస్ సాక్షిగా హామీ ఇచ్చిన నాగార్జున

    బిగ్ బాస్ సాక్షిగా హామీ ఇచ్చిన నాగార్జున

    తనకు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని, వాళ్లందరికీ పెళ్లి చేసేశానని గంగవ్వ చాలా సార్లు చెప్పారు. అదే సమయంలో తనకు సొంత ఇంటి కల ఉందని వెల్లడించారు. అందుకోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున స్టేజ్‌ మీద ఉన్న సమయంలోనే ఆమెకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గంగవ్వ సంతోషంగా వెళ్లారు.

    ఆస్పత్రిలో చేరిన గంగవ్వ.. ఫ్యాన్స్‌లో టెన్షన్

    ఆస్పత్రిలో చేరిన గంగవ్వ.. ఫ్యాన్స్‌లో టెన్షన్

    బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి పనులతో పాటు ఎప్పటి లాగే వీడియోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు గంగవ్వ. అంతేకాదు, గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సీనియర్ నటి ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

    ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటంటే

    ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటంటే

    రెండు రోజుల క్రితం గంగవ్వ తన మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకునేందుకు ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తోన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేద వైద్యం చేపించుకున్నా. కొత్త వీడియో అచ్చింది చూడుర్రి' అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇది తెలియని వాళ్లంతా ఆమెకు ఏదో అయిందని టెన్షన్ పడుతున్నారు.

    English summary
    Milkuri Gangavva is an Indian YouTube personality and actress. She used to work as a farm-worker before becoming popular on YouTube. Gangavva is known for her diction of Telangana dialect of Telugu language. In 2020, she entered the Telugu reality TV show Bigg Boss 4 as a contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X