అవినాష్‌ను చితకబాదిన గంగవ్వ.. దంచి కొట్డడానికి కారణం ఏమిటంటే.. నామినేషన్లో మళ్లీ ఏడుగురు
బిగ్‌బాస్ ఇంటిలో సోమవారం ఎపిసోడ్ సరదగా టాస్కులతో సాగిపోయింది. నామినేషన్ ప్రక్రియ కొనసాగిన సమయంలో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నామినేట్ చేయడంపై కొందరు ఇంటి సభ్యులు గరం అయ్యారు. నన్ను నామినేట్ చేయడానికి ఒకే కథ చెబుతారా అంటూ కుమార్ సాయి భగ్గుమన్నాడు. ఇలా హిట్ మ్యాన్ టాస్క్ ఉత్సాహంగా సాగింది. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లోకి వెళితే..

ఫన్ గేమ్‌లో మూడు జంటలు
నామినేషన్ ప్రక్రియకు ముందు ఇంట్లో ఫన్ గేమ్ సాగింది. అందులో ఒక్కో ఎమోషన్ ప్రకారం ఇంటి సభ్యులు యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫన్ గేమ్‌లో అభిజిత్, స్వాతి దీక్షిత్ ఒక జంట కాగా, నోయల్-లాస్య మరో జంటగా, అలాగే గంగవ్వ, అవినాష్ మరో టీమ్‌గా ఏర్పడ్డారు.

అభిజిత్‌తో స్వాతి దీక్షిత్ రొమాంటిక్‌గా
అభిజిత్, స్వాతి దీక్షిత్ లవర్లుగా యాక్టింగ్ చేశారు. రొమాంటిక్ ఫీలింగ్స్‌తో అభిజిత్‌కు ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్వాతి దీక్షిత్‌కు మరో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం తండ్రి యాక్సిడెంట్ గురై ఐసీయూలో ఉంటే ఆ సందర్భంలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించాలని కోరారు. అఖిల్ తండ్రిగా యాక్ట్ చేస్తే స్వాతి అద్భుతంగా ఆ సీన్‌ను పండించింది.

లాస్య, నోయల్ లవర్స్‌గా.. చిలిపి గొడవలతో
ఇక లాస్య, నోయల్ లవర్స్‌గా నటించారు. తమ మధ్య జరిగిన ఓ విషయం మరో వ్యక్తికి తెలియడంతో ఆ విషయం ఎలా తెల్సిందని నోయల్ ఆరా తీశాడు. ఆ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఎవరు చెప్పారో ముందు అడిగి చూడు అని యాంకర్ లాస్య అంటే.. ఎందుకు అలా అరుస్తున్నావు. నాకు అరవడం రాదనుకొంటున్నావా అంటూ నోయల్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. దాంతో నాకు అరవడం వచ్చు. నీకే కాదు నాకు కూడా వచ్చు. నాకు ఒకరి వెనుక మాట్లాడే అవసరం నాకు లేదు అని లాస్య అంటే నా ముందు మాట్లాడు పిలుస్తా నోయ్ అన్నాడు. దాంతో నాకు వెనుక మాట్లాడటం అలవాటు లేదు సమాధానం ఇవ్వడంతో టాస్క్ ముగిసింది.

అవినాష్‌ను ఆటాడుకొన్న గంగవ్వ
ఆ తర్వాత గంగవ్వ, అవినాష్ టీమ్ యాక్టింగ్ ప్రారంభమైంది. అవినాష్‌ను ఉద్దేశించి పెళ్లి చేసుకోరా.. ఇప్పటికే 30 ఏళ్లు వచ్చాయని గంగవ్వ నిలదీసింది. అయితే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు అంటే.. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అని గట్టిగా గంగవ్వ అడిగితే మన ఊళ్లో రజితను ప్రేమిస్తున్నాను అని అవినాష్ చెప్పాడు. అలా వారిద్దరి మధ్య మాటలు కొనసాగడంతో అవినాష్‌ను గంగవ్వ చితకబాది. అవినాష్‌పై చెయ్యెత్తి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. గంగవ్వ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. అవినాష్, గంగవ్వ టాస్క్ ఫన్‌గా సాగింది.

ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ
నామినేషన్ టాస్క్ కోసం సోహైల్, అఖిల్ సార్థక్‌లకు డిటెక్టివ్ డ్రస్‌లు వేసి.. వారిని హిట్ మ్యాన్‌గా పిలిచారు. వారికి ఓ గదిని కేటాయించి అందులో ఉండాలని చెప్పారు. ఇక ఇంటి సభ్యులు లివింగ్ రూమ్‌ను బెల్ మోగగానే హిట్ మ్యాన్ ఉండే రూమ్‌లోకి వెళ్లాలి. అలా వెళ్లిన వ్యక్తులు ఇంటి సభ్యులను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. నామినేట్ చేయడానికి హిట్ మ్యాన్‌కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
Recommended Video

నామినేట్ అయిన వారు వీరే
నాలుగో వారానికి ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో ఏడుగురు ఉన్నారు. వారిలో వైల్డ్ కార్డుగా వచ్చిన స్వాతి దీక్షిత్ ఒకరు కాగా, లాస్య, అభిజిత్, మెహబూబ్, కుమార్ సాయి, హారికను ఇంటి సభ్యులు నామినేట్ చేస్తే.. నామినేషన్ టాస్క్‌లో హిట్‌మ్యాన్ తక్కువ డబ్బులు సంపాదించడంతో సోహైల్ గేమ్ రూల్ ప్రకారం నామినేట్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సాధించిన అఖిల్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.


Click it and Unblock the Notifications











