తీవ్రంగా క్షీణించిన గంగవ్వ ఆరోగ్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల ఆందోళన.. రంగంలోకి డాక్టర్లు!
బిగ్‌బాస్ హౌస్‌లో అనుహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. గంగవ్వ ఆరోగ్యం క్షీణించడం ఒకటైతే. ముక్కు అవినాష్ ఎంట్రీ రెండోవది. ఇంటి సభ్యులు ఆటపాట, హుషారు మధ్య గంగవ్వ ఆరోగ్యం క్షీణించడంతో సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గంగవ్వకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇంటిలో ఎలాంటి పరిస్థితి ఉందంటే..

సుజాతకు అఫైర్ అంటగట్టేందుకు
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరితోనైనా అఫైర్ పెట్టుకోవాలనుకొంటున్నావా అనే విషయంపై సుజాతతో లేడి కంటెస్టెంట్లు చర్చ జరిపారు. అయితే నా బయటి జీవితంలో లవ్‌లో పడేంత ఛాన్స్ రాలేదు. ఇంట్లో కూడా నన్ను అందరూ చెల్లెలుగా చూసుకొంటున్నారు అని సుజాత బదులిచ్చింది. కావాలంటే నోయల్‌ను ట్రై చేయి అంటే నన్ను చెల్లె అని పిలుస్తాడు కాబట్టి నాకు అలాంటి ఆలోచన లేదు అని సుజాత ఇబ్బందిగా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి నోయల్‌తో చెప్పుకొని ఏడ్చింది. అయితే మన మధ్యలో అన్నాచెల్లెల బంధమే అని క్లారిటీ ఇచ్చారు.

మోనాల్ లవ్ గేమ్ గురించి అభిజిత్
మోనాల్ లవ్ గేమ్ గురించిన చర్చ అభిజిత్, దేత్తడి హారిక మధ్య వచ్చింది. అఖిల్, మోనాల్ మధ్య ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు అంటూ అభిజిత్ అయోమయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి ఏమైనా ఉందంటే తాను కచ్చితంగా చెప్పలేనంటూ దేత్తడి హారిక సమాధానం ఇచ్చింది. అయితే మనకెందుకులే అంటూ అభిజిత్, దేత్తడి హారిక ఆ చర్చను అలా ముగించేశారు.

ముక్కు అవినాష్ ఇంట్లోకి
10వ రోజు ఐయాయ్ గల్లీ.. సిల్లీ బాయ్ అనే పాటతో దిన చర్య మొదలైంది. అప్పటికే ముక్కు అవినాష్ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే వాయిస్ ఓవర్‌తో ఇంట్లో వాళ్లను పిలిచి కామన్ హాల్‌లోకి రమ్మన్నాడు. ఆ తర్వాత జోకర్ గెటప్‌లో ఇంట్లోకి వచ్చి ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు.

మోనాల్‌ను ముగ్గులోకి దించేందుకు పులిహోర
ఇంటిలోకి రాగానే ముక్కు అవినాష్ తన మార్కు టాలెంట్‌ను చూపించాడు. ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. మోనాల్‌తో మాట్లాడుతూ.. నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. అచ్చు నీలాగే ఉండేది అంటూ పులిహోర కలిపేందుకు సిద్దమయ్యాడు. అంతలోనే పక్క నుంచి మీకు సోప్ వేయడానికి రెడీ అవుతున్నాడు. అంటే నేను ఇంట్లోకి సోప్ తీసుకురాలేదు అందుకే మోనాల్‌కు సోప్ వేస్తున్నాను అంటూ కామెంట్ చేశారు.

ముక్కు అవినాష్‌ను అమ్మాయిలా తయారు చేసి
ఇంటి సభ్యులందరూ కలిసి అవినాష్‌ను ఆటపట్టించారు. అవినాష్‌కు అమ్మాయి డ్రస్ వేసి బొట్టు కాటుక పెట్టి ముస్తాబు చేశారు. అవ్వ నన్ను ఇలా ఆటపట్టిస్తున్నారంటే.. ముక్కు ఎర్రటిది పెట్టుకొని వచ్చావు అందుకే నిన్ను అలా ఆడిస్తున్నారు అంటూ గంగవ్వ పంచ్ వేసింది. ఆ తర్వాత అదిరేటి డ్రస్సు మీరేస్తే అంటూ పాటకు ఫ్యాషన్ వాక్ చేశారు. ఆ తర్వాత అవినాష్, గంగవ్వ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ సరదాగా గడిపారు.

బిగ్‌బాస్‌లో గంగవ్వకు అస్వస్థత
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తానని చెబుతూ వస్తున్న గంగవ్వ అస్వస్థతకు గురయ్యారు. గంగవ్వను కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించి నీ ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు. మీరు త్వరగా కోలుకొంటారు అని బిగ్‌బాస్ చెప్పారు. అయితే నన్ను బాగా చూసుకొంటున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు ఈ వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తండ్రి, భర్త, నాకంటూ ఎవరూ లేరు అంటూ ఏడ్చింది. దాంతో మీ ఆరోగ్యం విషయంలో కంగారు పడొద్దు. మీ ఆరోగ్యం గురించి డాక్టర్లు చూసుకొంటారు అని బిగ్‌బాస్ చెప్పారు.
Recommended Video

డాక్టర్ వద్దకు గంగవ్వ.. మెడికల్ పరీక్షలు
నాకు కాళ్లలో నొప్పులు ఉంటాయి. ఆరోగ్యం నాకు సరిగా ఉండటం లేదు అంటే.. ఇక్కడి వచ్చిన వారందరికి కొత్తలో ఇలానే ఉంటుంది. కొద్ది రోజులు ఆగితే తగ్గిపోతుంది. మీరు గట్టి మనిషి. మీ గురించి బిగ్‌బాస్‌కు బాగా తెలుసు. మీరు టైమ్‌కు మందులు వేసుకోండి. డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకొంటారు. మీరు నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లండి అంటే సరే అని గంగవ్వ చెప్పారు. మీరు చెప్పినట్టే నేను గట్టి మనిషిని అంటూ గంగవ్వ తన గురించి చెప్పుకొన్నారు. లాస్య సహాయంతో గంగవ్వ డాక్టర్ రూమ్‌కు వెళ్లారు.


Click it and Unblock the Notifications











