ముత్యాలు వస్తావా అంటూ రెచ్చిపోయిన గంగవ్వ.. చీర ఊడిపోయినా డ్యాన్స్ ఆపకుండా..
బిగ్‌బాస్ ఇంటిలో సుమారు 60 ఏళ్ల వయసులో గంగవ్వ మంచి జోష్‌ను ప్రదర్శిస్తున్నారు. 4వ వారాంతంలో ఫన్ గేమ్‌లో అదరగొట్టింది. సండే ఫన్‌డే భాగంగా ఇంటిలో జంబలకిడిపంబ స్కిట్ ప్రదర్శించారు. ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్ల వేశాలతో అలరించారు. గంగవ్వ గంగుగా, కుమార్ సాయి కుమారిసాయిగా నటించారు. వారిద్దరు పాటపై డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకొన్నారు. ఇంతకు పాటపై ఎలా డ్యాన్స్ చేశారంటే..

కుండబద్దలు కొట్టినట్టుగా గంగవ్వ
బిగ్‌బాస్‌లో దాదాపు నెలరోజులుగా గంగవ్వ తనదైన శైలిలో రాణిస్తున్నది. ఇంటిలో తనకు తోచినట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేయడం అందర్నీ ఆకట్టుకొంటున్నది. అంతేకాకుండా ఇంటిలోని సభ్యుల తీరును ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తూ అందర్నీ నవ్విస్తున్నారు.

జంబలకిడిపంబ స్కిట్‌లో గంగవ్వ
ఇక ఆదివారం జరిగిన జంబలకిడిపంబ స్కిట్‌లో గంగవ్వ గంగూగా మరోసారి ఆకట్టుకొన్నారు. గడ్డం, మీసాలు, మంచి హెయిర్ కట్‌తో గంగవ్వ లుక్ అదరొట్టింది. గంగవ్వ తన ఎంట్రీతోనే అందర్నీ ఆకర్షించారు. ఆమె గెటప్‌ను చూసి అందురూ థ్రిల్ అయ్యారు.

ముత్యాలు వస్తావా అంటూ స్టెప్పులు
ఇక స్కిట్‌లో భాగంగా స్వర్గీయ అల్లు రామలింగయ్య డ్యాన్స్ చేసిన పాపులర్ పాట ముత్యాలు వస్తావా అనే పాటకు కుమార్ సాయితో కలిసి గంగు స్టెప్పులేశారు. డ్యాన్స్ అనుకూలంగా తనదైన శైలిలో స్టెప్పులు, హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. ఇక కుమార్ సాయి కూడా గంగవ్వ మూమెంట్స్‌కు తగినట్టుగా స్టెప్పులు వేసి ఆకట్టుకొన్నారు.

చీర ఊడిపోయినా డ్యాన్స్ ఆపని కుమార్ సాయి
గంగవ్వతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో కుమార్ సాయి కట్టుకొన్న చీర ఊడిపోయింది. అయినా చీరను సర్దుకొంటూ డ్యాన్స్ చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే అలానే చీర ఊడిపోతుండంతో కుమార్ సాయి కాస్త ఇబ్బందిపడ్డాడు. వెంటనే అమ్మా రాజశేఖర్ స్టేజ్‌పైకి ఎక్కి చీరను సరిగా చేయడంతో మరింత ఉత్సాహంతో కుమార్ సాయి డ్యాన్స్ చేశారు.

ఈలలతో హోరెత్తించిన ఇంటి సభ్యులు
గంగవ్వ, కుమార్ సాయి డ్యాన్స్ చేస్తున్న సేపు ఇంటి సభ్యులు ఈలలు వేసి హంగామా చేశారు. ఇంటి సభ్యులందరూ వారిద్దరి డ్యాన్స్ చూసి నవ్వుల్లో మునిగిపోయారు. నాగార్జున సైతం జోష్‌గా వేదికపైన కనిపించారు. నాగ్ నవ్వును ఆపులేకపోతూ ఆ డ్యాన్స్‌ను ఎంజాయ్ చేశారు.
Recommended Video

జంబలకిడిపంబలో విజేతలుగా
జంబలకిడి పంబ డ్యాన్స్ పోటీలో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మా రాజశేఖర్, సుజాత విజేతగా నిలిచారు. వీరిద్దరి పెర్ఫార్మెన్స్‌కు అందరూ ఇంప్రెస్ అయ్యారు. అమ్మా రాజశేఖర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నాగ్ తట్టుకోలేకపోయారు. అలా సిగ్గుపడకు బాబు అంటూ అమ్మా రాజశేఖర్‌ను ఉద్దేశించి నాగ్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











