భావోద్వేగాల మధ్య గంగవ్వ బయటకు.. ఆమె కోరికను నేను తీరుస్తా.. నాగార్జున హామీ.. అవ్వ కోరిక ఏమిటంటే!

బిగ్‌బాస్ ఇంటిలో ఐదోవారం ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకొన్నది. తన మాటలతో అద్బుతంగా గేమ్‌ను రక్తి కట్టిస్తున్న గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల ఇంటిని వీడారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వను ఇంటి నుంచి బయటకు పంపేందుకు బిగ్‌బాస్ అనుమతించారు. గంగవ్వ ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో జరిగిన విషయాలు ఇలా ఉన్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన గంగవ్వ, ఇల్లు కట్టిస్తానన్ననాగార్జున..!!
అవినాష్‌కు బిగ్‌బాస్ గిఫ్టు

అవినాష్‌కు బిగ్‌బాస్ గిఫ్టు

ఇంటిలో గతవారం బిగ్‌బాస్‌ను అనుకరించి అవినాష్ అందర్నీ ఆకట్టుకొన్నారు. అదే విషయాన్ని నాగార్జున గుర్తు చేస్తూ ఆటపట్టించారు. దివిని అనుకరించినది ఆమె ముందు చూపించమన్నారు. దాంతో దివి ఎలా నడుస్తుందో అవినాష్ చూపించారు. ఆ తర్వాత సీక్రెట్ టాస్క్‌లో పప్పులో ఉప్పు, వెంట్రుక, పిన్స్ కలపడంపై నాగార్జున గుర్తు చేసి అందర్ని నవ్వించాడు. బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌ గాను అవినాష్‌కు టోపిని బిగ్‌బాస్ బహుకరించారు.

సోహైల్ సయ్యద్ సేఫ్

సోహైల్ సయ్యద్ సేఫ్

ఇక ఎలిమినేషన్ కావడంతో ఇంటి సభ్యులను సేఫ్ చేయడంపై దృష్టిపెట్టారు. తొమ్మిది మంది ఇంటి సభ్యులను నిలబెట్టి ఎలిమినేషన్‌కు సిద్ధమయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ సేఫ్ అయ్యే వక్తి కెప్టెన్ సోహైల్ అంటూ నాగార్జున ప్రకటించారు. దాంతో సోహైల్ హ్యాపీగా ఎగిరి గంతేశాడు. ఇంటి సభ్యులు అందరూ సోహైల్‌ను అభినందించారు. దాంతో ఈ వారంతోపాటు వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్నారు.

గంగవ్వ ఆరోగ్యం క్షీణించిందని నాగ్ ధృవీకరణ

గంగవ్వ ఆరోగ్యం క్షీణించిందని నాగ్ ధృవీకరణ

ఇంటిలో గంగవ్వ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వచ్చి పరీక్షలు జరిపించారు. ఆ తర్వాత ఆమె మెడికల్ రిపోర్టులు వైద్యులు, నాగార్జున పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకొన్నారు. గంగవ్వ ఆరోగ్యం బాగాలేని కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే బాధ్యతను బిగ్‌బాస్‌పై పెట్టారు. దాంతో గంగవ్వను ఇంటి పంపిచడానికి అనుమతించడంతో బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

ఇంటి సభ్యులు నవ్వుతూ సాగనంపారు

ఇంటి సభ్యులు నవ్వుతూ సాగనంపారు

గంగవ్వ ఇంటి నుంచి వెళ్లడం ఖాయం కావడంతో నాగార్జున ఇంటి సభ్యులకు అదే విషయాన్ని తెలియచేశారు. గంగవ్వను నవ్వుతూ ఇంటి సభ్యులు సాగనంపారు. ఇంటిలో నుంచి వచ్చేటప్పడు ఇంటి సభ్యులందరూ ఆమెను కౌగిలించుకొని ప్రేమతో బయటకు పంపించారు. ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పారు. అయితే నాకు ఓ ఇళ్లు కట్టించే బాధ్యతను తీసుకోవాలని గంగవ్వ కోరడం కనిపించింది. అలా బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి ప్రయాణం ముగిసింది.

ఇంటి సభ్యుల కంటతడి

ఇంటి సభ్యుల కంటతడి

ఇక వేదిక మీదకు గంగవ్వను సాదరంగా నాగార్జున ఆహ్వానించారు. ఇంటిలో తన ప్రయాణాన్ని నాగార్జునతో కలిసి చూశారు. ఇంటి సభ్యులు కంటతడి పెడుతూ కనిపించారు. అఖిల్, అమ్మా రాజశేఖర్, లాస్య, సుజాత ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యుల మంచి చెడుల గురించి చెప్పి నవ్వించారు. ఆ తర్వాత నాగార్జునతో కలిసి సెల్పీ దిగారు.

అఖిల్‌ను సేఫ్ చేసిన గంగవ్వ

అఖిల్‌ను సేఫ్ చేసిన గంగవ్వ

వేదికపైన గంగవ్వ ఉండగానే ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున మొదలుపెట్టారు. ఇప్పటికే సోహైల్ సేఫ్ కావడంతో మిగిలిన ఎనిమిది సభ్యుల్లో మరొకరిని గంగవ్వ చేతుల మీదుగా సేఫ్ చేశారు. కవర్ నుంచి ఓ కార్డు తీయగా.. అందులో అఖిల్ ఫోటో రావడంతో సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. దాంతో అఖిల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.

గంగవ్వకు ఇల్లు కట్టిస్తా.. నాగార్జున

గంగవ్వకు ఇల్లు కట్టిస్తా.. నాగార్జున

ఇక వేదికపై నుంచి గంగవ్వను బయటకు పంపిస్తూ నాగార్జున ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. గంగవ్వ కోరిక మేరకు తనకు ఇళ్లు కట్టించే బాధ్యతను తీసుకొంటున్నానని చెప్పారు. దాంతో ఇంటి సభ్యులు అందరూ హర్షం ప్రకటించారు. నాగార్జున హామీతో గంగవ్వ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అలా గంగవ్వ బిగ్‌బాస్ అర్ధాంతరంగా హ్యాపీ ఎండింగ్‌గా ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X